TS High Court: న్యూఇయర్ వేడుకలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్.. రేపు విచారణ, ఆదేశాలపై ఉత్కంఠ!
పాండమిక్, ఎపిడమిక్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.
తెలంగాణలో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై కొద్దిరోజుల క్రితం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం బేఖాతరు చేస్తూ కొత్త సంవత్సర నిబంధనలు ఉన్నాయని ఓ పిటిషనర్ పిల్ దాఖలు చేశారు. హైకోర్ట్ ఆదేశాలకు భిన్నంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఉన్నాయని పిటిషనర్ తన పిటిషన్‌లో వివరించారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా ఆంక్షలు పెట్టాలని హై కోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోలేదని పిటిషనర్ వివరించారు.
Also Read: బీజేపీ అధికారంలోకి వస్తే.. 70 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తాం.. అన్ని కుదిరితే 50కే..
పాండమిక్, ఎపిడమిక్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఓమిక్రాన్‌ను కట్టడి చేయకుండా ఇష్టానుసారంగా ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలను అనుమతి ఇచ్చిందని పిటిషనర్ కోర్టుకు వివరించారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 62 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకునేలా న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించేలా చేయాలని పిటిషనర్ కోర్టును కోరారు. అయితే, ఈ పిటిషన్ రేపు (డిసెంబరు 30) హైకోర్టు ధర్మాసనం విచారణ జరపనుంది. ఇప్పటికే లిక్కర్ షాపులకు వెసులుబాటు కల్పిస్తూ డిసెంబరు 31 రాత్రి 12 గంటల వరకూ తెరిచి ఉంచుకోవచ్చన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
కొత్త ఏడాది సందర్భంగా మద్యం విక్రయ వేళలు పొడిగించారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 వరకు మద్యం దుకాణాలు తెరిచే ఉంటాయి. 31న రాత్రి ఒంటిగంట వరకు ఈవెంట్ల నిర్వహణకు అనుమతి ఉంటుంది. రాష్ట్రంలోని బార్లు, పబ్బులు, క్లబ్బులు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అధీనంలోని హోటళ్లు, ఈవెంట్ పర్మిట్ల కింద లైసెన్సు పొందినవారు అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట వరకూ కూడా మద్యాన్ని సరఫరా చేసుకునేలా అనుమతిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. కాకపోతే, కొవిడ్-19 నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. కాగా, మద్యం విక్రయాల ద్వారా ఈనెల 28వ తేదీ వరకూ రూ.2,886 కోట్ల రాబడి వచ్చినట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి.
Also Read: KTR: కొంప ముంచుతున్న సోము వీర్రాజు వ్యాఖ్యలు.. దేశమంతా వైరల్, కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్
Also Read: వ్రతం చెడినా ఫలితం దక్కని రమణ దీక్షితులు ! పదవి కోసం ఇంకెన్ని ట్వీట్లు..?
Also Read: బ్రాహ్మణులే అర్చకత్వానికి అర్హులా..? తిరుపతిలో సుబ్రహ్మణ్య స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి