అన్వేషించండి

Sharmila : పనులు పూర్తి కాకుండానే పాలమూరు ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం - కేసీఆర్‌పై షర్మిల ఘాటు విమర్శలు

పనులు పూర్తి కాకుండానే పాలమూరు ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చేస్తున్నారని కేసీఆర్‌పై షర్మిల మండిపడ్డారు. గ్రామాల్లోకి వచ్చే బీఆర్ఎస్ నేతలకు బడితే పూజలు చేయాలని ఆమె పిలుపునిచ్చారు.


Sharmila :   పనులేమీ చేయకుండానే పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు.  పాలమూరు ఓట్లు దక్కించుకునేందుకు అగచాట్లు పడుతున్నారని..  దొర.సగం పనులే కాని ప్రాజెక్టుకు ప్రారంభోత్సవాలు చేయడమేమిటని షర్మిల సోషల్ మీడియాలో ప్రశ్నించారు.   పూర్తేగాని రిజర్వాయర్లకు పూజలు కాలువలు తవ్వకుండనే ఊరూరా ఉత్సవాలు.. ఏమిటని ఆమె ప్రశ్నించారు.  రీ డిజైన్ పేరిట దక్షిణ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు.  కమీషన్లు ఇచ్చే కాళేశ్వరంలో లక్ష కోట్లు కుమ్మరించి, పాలమూరుకు శఠగోపం పెట్టారన్నారు. 

పనులు ఆగిపోయిన ప్రాజెక్టును.. ఎన్నికల కోసం నామమాత్ర పనులు చేపట్టి, ప్రాజెక్టు మొత్తం పూర్తయిందనే భ్రమను సృష్టిస్తున్నారని..  పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 50 శాతం కూడా కాలేదని షర్మిల స్పష్టం చేశారు.   ప్రాజెక్టు పరిధిలో ఉన్న 4 రిజర్వాయర్లలో తట్టెడు మట్టీ తీయలేదన్నారు.  లక్ష్మీదేవిపల్లి 6వ రిజర్వాయర్ అతి గతి లేదు...కేవలం అంజనాపూర్ మొదటి రిజర్వాయర్ లో 90 శాతం పనులే పూర్తి చేసి ప్రాజెక్ట్ మొత్తం కట్టినట్లు కలరింగ్ ఇస్తున్నారని ఆరోపించారు.  నార్లాపూర్ వద్ద 9 మోటార్లకు గాను ఒక్కటే వాడుకలోకి తెచ్చార్నారు. భూనిర్వాసితులకు అణాపైసా సాయం అందలేదు. కాలువలకు భూసేకరణ కూడా పూర్తి కాలేదన్నారు. ఇదీ పాలమూరు ప్రాజెక్టుపై కేసీఆర్ చిత్తశుద్ధి అన్నారు. 

ఇంత పనితనానికి గ్రామాల్లో సంబురాలు చేయాలా అని ప్రశ్నించారు.  కృష్ణా జలాలు ఊరూరా చల్లాలంటున్నారని..  తొమ్మిదేండ్లుగా పాలమూరు ప్రజలను మోసం చేసినందుకు   ప్రభుత్వానికి చేయాల్సింది విజయయాత్ర కాదు. పాడెయాత్ర అని మండిపడ్డారు.  పాలమూరు పల్లెల్లో చేయాల్సింది సంబురాలు కాదు.మీ బందిపోట్లకు బడితే పూజలన్నారు.  వైఎస్ హయాంలో 35 వేల కోట్లతో పూర్తి చేయాలనుకున్న ప్రాజెక్టును కేసీఆర్ కమీషన్ల కోసం రూ.55 వేల కోట్లకు పెంచినా పూర్తి చేయలేకపోయారని..   ఇది పూర్తిగా ఎన్నికల స్టంటే కానీ పాలమూరు మీద ప్రేమ మాత్రం కాదన్నారు.  దక్షిణ తెలంగాణలో డిపాజిట్లు దక్కవన్న సర్వేలతో.. దొరకు భయం తప్ప.. నీళ్లు ఇవ్వాలన్న సోయి లేదని ఆరోపించారు.   

 పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును 21 ప్యాకేజీలుగా విభజించి పనులు చేస్తున్నారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్, లక్ష్మీదేవిపల్లి వద్ద రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. మొదటి ప్యాకేజీలో నిర్మిస్తున్న నార్లాపూర్​రిజర్వాయర్​పనులు ఇంకా 30శాతం పెండింగ్​లో ఉన్నాయి.  శ్రీశైలం బ్యాక్​వాటర్ ఆధారంగా నార్లాపూర్​పంప్​హౌస్​నుంచి నీటిని ఎత్తిపోయాలి. ఇక్కడ తొమ్మిది మోటార్లు (ఒక్కొక్కటి 145 మెగావాట్లు) ఏర్పాటు చేయాల్సి ఉండగా, ప్రస్తుతానికి ఒక్కటే సిద్ధం చేశారు. ఈ మోటారునే ఈ నెల16న సీఎం కేసీఆర్ ఆన్ చేయనున్నారు. మోటార్ ఆన్​చేసిన తర్వాత రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్లాపూర్​ రిజర్వాయర్​లోకి నీటిని లిఫ్ట్​ చేస్తారు. అక్కడి నుంచి మెయిన్​ కెనాల్ ద్వారా ఏదులకు నీటిని తరలించాల్సి ఉంది. కానీ, మధ్యలో మెయిన్​ కాలువ పనులు పెండింగ్​లో ఉన్నాయి. అందుకే విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Changes In Futures And Options: చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
Weak Passwords: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
Embed widget