Revanth Reddy: వరి పంట వేస్తే ఉరేనని చెప్పిన సీఎం కేసీఆర్.. 150 ఎకరాల్లో వరి వేశారు
సీఎం కేసీఆర్ పై టీపీసీ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వరి వేస్తే ఉరేనని చెప్పి.. తన 150 ఎకరాల్లో వరి వేశారన్నారు.
అన్నదాతల సమస్యలపై ప్రభుత్వం వింత వైఖరి.. అవలంభిస్తోందని.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రైతుల పంటలకు దళారులు ధర నిర్ణయించడమేంటని ప్రశ్నించారు. పంటలకు ధర నిర్ణయించే హక్కు రైతులకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని రేవంత్ మండిపడ్డారు. యూపీ, పంజాబ్ ఎన్నికల కోసమే సాగుచట్టాలు రద్దు చేశారని అన్నారు.
పంట కొనుగోలు విషయంలో కేంద్రం, రాష్ట్రం అయోమయంలో నెడుతున్నారని రేవంత్ విమర్శించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర బఫర్ స్టాక్ ఉంచుకుంటుందని తెలిపారు. మార్కెట్లో షార్టేజ్ వచ్చినా.. విపత్కర పరిస్థితులు తలెత్తినా ఎఫ్సీఐ ఆ పంటను అందిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. పంజాబ్, హర్యానాలో కేంద్రం కొనుగోలు చేస్తోందని.. ఆయా రాష్ట్రాల్లో కేంద్రం నేరుగా మండీ విధానంలో కొనగా.. ఇక్కడ ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని రేవంత్ తెలిపారు.
ఎంఎస్‌పీ విధానం తెచ్చింది కాంగ్రెస్సే. రైతుల్ని బానిసలుగా చేయాలని చూస్తే తిరుగుబాటు తప్పదు. రైతు ఉద్యమంలో చనిపోయినవారి కుటుంబాలకు కేంద్రం సాయం చేయలేదు. కనీసం వారి వివరాలు కూడా సేకరించలేదు. రైతులను బానిసలుగా చూస్తున్నారు. వ్యవసాయ చట్టాలను అందరూ వ్యతిరేకించినా తీసుకొచ్చారు. మళ్లీ వాళ్లే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో పార్లమెంటులో బిల్లును వెనక్కి తీసుకున్నారు. ఇలా నల్ల చట్టాలను రద్దు చేశారో లేదో.. వెంటనే నరేంద్ర సింగ్ తోమర్ వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకొస్తామని ప్రకటించారు. ఇవన్నీ ఎన్నికల జిమ్మిక్కులే. కేవలం ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఎన్నికల కోసమే చట్టాలను రద్దు చేశారు.
- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
Also Read: Jammalamadaka Pichaiah: తొలితరం బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అర్జున పిచ్చయ్య కన్నుమూత...
Also Read: KTR: నీకు నిబద్ధత ఉంటే ఇందిరా పార్కు సాక్షిగా ముక్కు నేలకు రాయి.. వివరణ ఇవ్వు: కేటీఆర్