అన్వేషించండి

CRPF Firing: సీఆర్పీఎఫ్ జవాన్ల మధ్య కాల్పులు... ఎస్సైపై కాల్పులు జరిపిన కానిస్టేబుల్... ఎస్సై మృతి, కానిస్టేబుల్ కు తీవ్రగాయాలు

పోలీసు స్టేషన్ లో సీఆర్పీఎఫ్ సిబ్బంది మధ్య చెలరేగిన వివాదం కాల్పులకు దారితీసింది. కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో ఎస్సై మృతి చెందాడు. అనంతరం కానిస్టేబుల్ తనను తాను కాల్చుకున్నాడు.

ములుగు జిల్లా నూగురువెంకటాపురం పోలీసు స్టేషన్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఆదివారం ఉదయం సీఆర్పీఎఫ్ ఎస్సై ఉమేష్ చంద్ర, కానిస్టేబుల్ స్టీఫెన్ లు మెస్ వద్ద గొడవ పడి కాల్పులు జరుపుకోవడంతో ఎస్సై ఉమేష్ చంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. కానిస్టేబుల్ స్టీఫెన్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఈ కాల్పుల్లో సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ కు చెందిన ఎస్సై ఉమేష్ చంద్ర మృతి చెందారు. కాల్పులు జరిపిన కానిస్టేబుల్ ఆ తర్వాత తనని తాను కాల్చుకోగా కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. కానిస్టేబుల్ ను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యలు అంటున్నారు.

Also Read: ఈ ఛానెళ్లలో పని చేసేవాళ్లు జర్నలిస్టులే కాదు.. అల్లం నారాయణ సంచలన వ్యాఖ్యలు

ఎస్సై మృతి, కానిస్టేబుల్ పరిస్థితి విషయం

ములుగు జిల్లాలో 39వ సీఆర్పీఎఫ్ బెటాలియ‌న్ కు సంబంధించి ఓ సమావేశం జ‌రిగింది. ఈ బెటాలియ‌న్ లోని స్టీఫెన్, ఎస్సై ర్యాంకు అధికారి ఉమేష్ చంద్ర అనే జ‌వాన్ మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. దీంతో రెండు రౌండ్ల కాల్పులు జరుపుకున్నారు. ఈ కాల్పుల్లో ఎస్సై ఉమేష్ చంద్ర అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. కానిస్టేబుల్ స్టీఫెన్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. స్టీఫెన్ ను ఏటూరు నాగారం ఏరియా ఆసుపత్రికి త‌ర‌లించారు. అనంతరం ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఉమేష్ చంద్ర సొంతూరు బీహార్. స్టీఫెన్ కన్యాకుమారికి చెందిన వాడని స‌మాచారం. విధి నిర్వహణలో భేదాభిప్రాయాలతో సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ విచక్షణ కోల్పోయి ఎసైపై కాల్పులు జరిపి, తాను కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటన ములుగు జిల్లా అడవి వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 

Also Read: పాత పనిమనిషి మెగా ప్లాన్.. దాన్ని అమలు చేసిన కొత్త పనిమనిషి, ఓనర్‌‌కే కుచ్చుటోపీ!

దర్యాప్తు చేస్తున్నట్లు ములుగు ఎస్పీ ప్రకటన

ఈ ఘటనపై ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ప్రకటన విడుదల చేశారు. ఆదివారం ఉదయం 8.30 గంటలకు వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ కి చెందిన హెడ్ కానిస్టేబుల్ స్టీఫెన్ సీఆర్పిఎఫ్ కు చెందిన ఎస్సై ఉమేష్ చంద్రపై కాల్పులు జరిపారని, అనంతరం తనకు తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో ఎస్సై ఉమేష్ చంద్ర మృతిచెందగా హెడ్ కానిస్టేబుల్ స్టీఫెన్ ను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించామని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులపై విచారణ చేసి పూర్తి వివరాలు తెలుపుతామని ఎస్పీ అన్నారు. పని ఒత్తిడి వల్ల ఏర్పడిన మనస్పర్థలతో కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల నక్సల్స్ కోసం అడవుల్లో కూంబింగ్ నిర్వహించడం, సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సోదాలు, బందోబస్తు నిర్వహించే క్రమంలో పనిభారం పెరిగి, మనస్పర్థలు వచ్చుంటాయని పోలీసులు భావిస్తున్నారు. 

Also Read: కొత్త ఏడాదిలో ధనవంతులవ్వాలని ఆశపడుతున్నారా? ఇంట్లో ఈ వస్తువులు ఉండేలా చూసుకోండి... 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tiger Trapped In Cage: నలుగురు మహిళల్ని చంపిన పులిని బంధించిన అధికారులు.. స్థానిక ప్రజలుకు బిగ్ రిలీఫ్
నలుగురు మహిళల్ని చంపిన పులిని బంధించిన అధికారులు.. స్థానిక ప్రజలుకు బిగ్ రిలీఫ్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Hyderabad News: క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
Telangana Heatwave: వ‌డ‌గాల్పుల‌తో 16 మంది మృతి.. రూ.4 ల‌క్షల ఆర్ధిక సాయం.. 3 రోజులు మరింత తీవ్రంగా హీట్ వేవ్
వ‌డ‌గాల్పుల‌తో 16 మంది మృతి.. రూ.4 ల‌క్షల ఆర్ధిక సాయం.. 3 రోజులు మరింత తీవ్రంగా హీట్ వేవ్

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Heatwave Heart Care : వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
Film Development Corporation : AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
Hyderabad News: క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
Crime Thriller OTT : వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Guntur Crime News: పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
Peddi: 'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
Embed widget