అన్వేషించండి

Revanth Reddy: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బొందపెట్టి కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం - కేసీఆర్‌కు సవాల్ - మేడిగడ్డ గడ్డపై రేవంత్ రెడ్డి ఉగ్రరూపం

CM Revanth: వచ్చే ఎన్నికల్లో తేల్చుకుందామని కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. మేడిగడ్డ బహిరంగసభలో తీవ్ర విమర్శలు చేశారు.

Revanth Reddy challenged KCR:   కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దిగమింగినందుకు, ఇది గనుక ఏదైనా ఆటవిక రాజ్యమైతే అపరాధులను చెట్టుకు ఉరేసేవారని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నాం కాబట్టే సీబీఐ విచారణకు ఆదేశించామని, లేదంటే ప్రజలే బుద్ధి చెప్పేవారని మండిపడ్డారు. కేసీఆర్ అహంకారానికి మేడిగడ్డ కూలిన పిల్లర్లే సాక్ష్యమని ఆయన దుయ్యబట్టారు.                             

కేసీఆర్ నిర్వహించిన జగిత్యాల సభను లక్ష్యంగా చేసుకున్న రేవంత్ రెడ్డి, ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగిత్యాల గడ్డపై కేసీఆర్‌ను వంద మీటర్ల గోతిలో పాతర వేయడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణాకు పాపాల బైరవుడు అయిన కేసీఆర్ అవసరం లేదని, ప్రజా పాలనను అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రాజెక్టుల పేరుతో దోచుకున్న సొమ్మును కక్కిస్తామని, దోషులు ఎంతటి వారైనా జైలుకు వెళ్లక తప్పదని స్పష్టం చేశారు. కేసీఆర్ రీ-లాంచ్ సభ కేవలం తన పాపాలను కప్పుకోవడానికేనని రేవంత్ విమర్శించారు.

ఇదే క్రమంలో కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరిన సీనియర్ నేత టి. జీవన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఉన్న కేసీఆర్ చెంతకు వెళ్లిన జీవన్ రెడ్డికి, ఇకపై  పెద్ద మనిషి అని పిలిపించుకునే అర్హత లేదని ఎద్దేవా చేశారు. కేవలం మంత్రి పదవి రాలేదన్న అక్కసుతోనే, 40 ఏళ్లు తనను నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలను వదిలేసి వెళ్లడం ఆయన నైతిక పతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.  నీ కుటుంబానికి పదవులు ఇచ్చుకున్నా కార్యకర్తలు ఊడిగం చేశారు.. మరి వారికేం సమాధానం చెబుతావు  అని నిలదీశారు.  

అంతకు ముందు మేడిగడ్డ బ్యారేజీని స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి, ఇంజనీర్ల హెచ్చరికలను పెడచెవిన పెట్టి ప్రాజెక్టును ఎలా నాశనం చేశారో ప్రజలకు వివరించారు. 2020లోనే పగుళ్లపై నివేదికలు వచ్చినా, కేవలం కమిషన్ల కోసం కేసీఆర్ సర్కార్ ఆ విషయాలను తొక్కిపెట్టిందని ఆరోపించారు. ప్రకృతి ఈరోజు ఆ అవినీతిని బయటపెట్టిందని, లక్ష కోట్లు గంగలో పోసిన పాపం కేసీఆర్ కుటుంబానిదేనని అన్నారు. ఈ సందర్భంగా రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేస్తూ, ప్రభుత్వం రైతు పక్షపాతని మరోసారి నిరూపించుకున్నారు.

 ఒకే రోజు అటు జగిత్యాలలో కేసీఆర్, ఇటు మేడిగడ్డలో రేవంత్ రెడ్డి సభలు నిర్వహించడంతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రేవంత్ రెడ్డి ప్రసంగం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కేసీఆర్ అవినీతిపై సీబీఐ విచారణను వేగవంతం చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, తెలంగాణ ఆస్తులను దోచుకున్న వారిని వదిలే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి  స్పష్టం చేశారు.                     

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
Kumram Bheem Asifabad Latest News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో SIR ప్రక్రియను బహిష్కరించిన గ్రామాలు - కారణం ఏంటంటే?
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో SIR ప్రక్రియను బహిష్కరించిన గ్రామాలు - కారణం ఏంటంటే?
IAS Sanjay Jaju : తెలంగాణ కొత్త సీఎస్‌గా ఐఏఎస్ సంజయ్ జాజు నియామకం.. మీసేవ రూపకర్త వైపే సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు!
తెలంగాణ కొత్త సీఎస్‌గా ఐఏఎస్ సంజయ్ జాజు నియామకం.. మీసేవ రూపకర్త వైపే సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు!
Breaking News:తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు! ఉత్తర్వులు జారీ
తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు! ఉత్తర్వులు జారీ
Advertisement

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS IRE 1ST 20 Result Update: వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ ఇండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. పసికూన చేతిలో శ్రేయ‌స్ సేన‌ ఘోర పరాజయం, అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం వృథా!
వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ ఇండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. పసికూన చేతిలో శ్రేయ‌స్ సేన‌ ఘోర పరాజయం, అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం వృథా!
Telangana Sentiment vs AP Development: ఏపీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో తెలంగాణ బిడ్డలు.. నారా లోకేష్ ట్వీట్ వైరల్! టాలెంట్‌కు బోర్డర్లు లేవంటూ ప్రశంసలు
ఏపీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో తెలంగాణ బిడ్డలు.. నారా లోకేష్ ట్వీట్ వైరల్! టాలెంట్‌కు బోర్డర్లు లేవంటూ ప్రశంసలు
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
Nandyal SI Bigg Boss 10 Selfie Video: బిగ్ బాస్ చాన్స్ కోసం వీడియో చేస్తే పోలీస్ బాస్ కంట్లో పడిన ఎస్ఐ - ఇప్పుడెలా?
బిగ్ బాస్ చాన్స్ కోసం వీడియో చేస్తే పోలీస్ బాస్ కంట్లో పడిన ఎస్ఐ - ఇప్పుడెలా?
Pune Ketan Agrawal Murder Case: పుణె మర్డర్ కేసులో నయా ట్విస్ట్ - లవర్ చేతన్‌పై మొత్తం తోసేస్తూ.. తప్పించుకునే ప్లాన్‌లో సియా గోయల్!
పుణె మర్డర్ కేసులో నయా ట్విస్ట్ - లవర్ చేతన్‌పై మొత్తం తోసేస్తూ.. తప్పించుకునే ప్లాన్‌లో సియా గోయల్!
Varanasi Update : వారణాసి షూటింగ్‌ బిగ్ అప్డేట్ - రాజమౌళి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్
వారణాసి షూటింగ్‌ బిగ్ అప్డేట్ - రాజమౌళి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్
Mollywood Times OTT : ఓటీటీలోకి ప్రేమలు హీరో కొత్త మూవీ - సైకలాజికల్ డార్క్ కామెడీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి ప్రేమలు హీరో కొత్త మూవీ - సైకలాజికల్ డార్క్ కామెడీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Ram Mandir Donation Theft: అయోధ్య రామ మందిర కానుకల దొంగతనం కేసులో కీలక మలుపు! ట్రస్ట్ ప్రధాన కార్యదర్శులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా !
అయోధ్య రామ మందిర కానుకల దొంగతనం కేసులో కీలక మలుపు! ట్రస్ట్ ప్రధాన కార్యదర్శులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా !
Embed widget