అన్వేషించండి

KCR: మొదటి సంతకంతోనే హైడ్రాను ఎత్తిపడేస్తా - వచ్చేది బీఆర్ఎస్సే - జగిత్యాల సభలో కేసీఆర్ వ్యాఖ్యలు

KCR Hydra: బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే తొలి సంతకంతో హైడ్రాను తీసేస్తానని కేసీఆర్ ప్రకటించారు. జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కీలక వ్యాఖ్యలుచేశారు.

KCR Jagityala meeting: జగిత్యాల వేదికగా సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన  ప్రజా ఆశీర్వాద సభ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శంఖారావం పూరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడుతూ, భవిష్యత్తు రాజకీయాలపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. 
 
హైడ్రాపై తొలి సంతకం 

తాము మళ్ళీ అధికారంలోకి రాగానే  హైడ్రా  వ్యవస్థను మొదటి సంతకంతోనే రద్దు చేస్తానని కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. తన మరణాన్ని కోరుకుంటున్న ప్రత్యర్థులకు చురకలు వేస్తూ..  నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావను.. ప్రజల దీవెనలు ఉన్నంత వరకు నన్నెవరూ ఏమీ చేయలేరు  అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి పడదని, తెలంగాణా అభివృద్ధి కోసం తన శ్వాస ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.  

నీళ్ల కష్టాలపై ఆగ్రహం 

తెలంగాణను తాము పదేళ్లలో అభివృద్ధి పథంలో నడిపించామని, ఇంటింటికీ నల్లా నీళ్లు ఇస్తామని సవాల్ చేసి నెగ్గామని గుర్తుచేశారు. మిషన్ భగీరథ నీళ్లు ఐదేళ్లు పుష్కలంగా వస్తే.. ఇప్పుడు ఏ రోగం పుట్టి నీళ్లు రావడం లేదు  అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నీళ్ల కోసం ప్రజలు పోరాడాలని, అధికారులను నిలదీయాలని పిలుపునిచ్చారు. సాగునీరు, తాగునీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

జీవన్ రెడ్డి చేరిక - కొత్త బాధ్యతలు 

45 ఏళ్ల తన మిత్రుడు టి. జీవన్ రెడ్డి పార్టీలో చేరడాన్ని కేసీఆర్ చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పి ఆహ్వానిస్తూ, ఆయనను పార్టీ  ప్రధాన కార్యదర్శి గా నియమిస్తున్నట్లు వేదికపైనే ప్రకటించారు. కేవలం జగిత్యాలకే పరిమితం కాకుండా పాత కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల బాధ్యతలను జీవన్ రెడ్డి చూడాలని కోరారు. ఆయన చేరికతో పార్టీకి నూతన ఉత్తేజం వచ్చిందని, సర్వేలన్నీ బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.   

 వయసు కేవలం అంకె మాత్రమే 

జీవన్ రెడ్డి తన వయసు 75 ఏళ్లు అని చెప్పగా, కేసీఆర్ దానిని ఆసక్తికరంగా మళ్లించారు. మీకు ఇప్పుడు 50 ఏళ్లే.. ఇవాల్టి నుంచి మీ వయసు 25 ఏళ్లు తగ్గిపోయింది  అంటూ ఉత్సాహపరిచారు. తనకూ 72 ఏళ్లు వచ్చాయని, తెలంగాణ ప్రజలు తలెత్తుకుని బతికే దాకా తమ సేవలు కొనసాగుతాయని చెప్పారు. ఆరు నూరైనా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అప్పుడు జీవన్ రెడ్డికి సముచిత పదవులు దక్కుతాయని హామీ ఇచ్చారు.
 
అయితే మేడిగడ్డ అంశంపై మాత్రం కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తన హయాంలో పథకాలు.. ప్రాజెక్టుల గురించి చాలా సేపు చెప్పారు కానీ..కాళేశ్వరం అంశాన్ని ప్రస్తావించకపోవడం విశేషంగా మారింది.   

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"విద్యార్థులపై కాల్పులు జరిపించింది హోంమంత్రే" లోక్‌సభలో రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Hyderabad Crime News: మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget