NHAI, బ్యాంకులు FASTag నిబంధనలను ఇటీవల మరింత కఠినతరం చేశాయి.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ఒక వాహనానికి ఒకే ట్యాగ్ ఉండాలి. పాత ట్యాగ్ ఉండగానే కొత్తది తీసుకుంటే, పాతది లేదా రెండూ బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది.

Image Source: pexels

మీ ఫాస్టాగ్ కేవైసీ (KYC) గడువు ముగిసినా లేదా అసంపూర్తిగా ఉన్నా ట్యాగ్ పనిచేయదు.

Image Source: pexels

కారుకు వాడాల్సిన ట్యాగ్‌ను ట్రక్కులకు లేదా బస్సులకు వాడితే ట్యాగ్ బ్లాక్ అవుతుంది.

Image Source: pexels

ఫాస్టాగ్ వాలెట్‌లో కనీస బ్యాలెన్స్ లేకపోయినా అది బ్లాక్ లిస్ట్‌లో పడుతుంది.

Image Source: pexels

పదేపదే స్కాన్ అవ్వకపోతే ట్యాగ్ పనికిరాకుండా పోతుంది.

Image Source: pexels

ఒక కారుకు కేటాయించిన ఫాస్టాగ్‌ను తీసి వేరే కారుకు వాడటం చట్టవిరుద్ధం. ఇలా చేస్తే ట్యాగ్ శాశ్వతంగా బ్లాక్ అవుతుంది.

Image Source: pexels

వాహనంపై ఏవైనా పోలీస్ కేసులు ఉన్నా లేదా ఫైనాన్స్ రీజన్స్ ఉన్నా, అథారిటీలు ఆ వాహన ఫాస్టాగ్‌ను బ్లాక్ చేస్తాయి.

Image Source: pexels

ఫాస్టాగ్ తీసుకునే సమయంలో ఆర్సీ (RC) లేదా ఐడీ ప్రూఫ్ వంటి నకిలీ పత్రాలు ఇచ్చినట్లు తేలితే ట్యాగ్ రద్దు చేస్తారు.

Image Source: pexels

6 నెలల నుండి ఏడాది పాటు వాడకుండా ఉన్న ఫాస్టాగ్ అకౌంట్లను బ్లాక్ చేస్తారు.

Image Source: pexels