అన్వేషించండి

BRS Politics: జగిత్యాల కేసీఆర్ సభ సమయంలోనే డిల్లీకి హరీష్ - కాంగ్రెస్ మైండ్ గేమ్ షురూ !

Harish Rao: కేసీఆర్ సభ వకు వెళ్లకుండా హరీష్ రావు ఢిల్లీకి వెళ్లడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్‌లో ముసలం ప్రారంభమయిందని కాంగ్రెస్ నేతలంటున్నారు.

Harish Rao Delhi tour hot topic: జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ సభకు పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావు హాజరు కావడం లేదు.  ఆయనతో పాటు వద్దిరాజు రవిచంద్ర, బోయినపల్లి వినోద్ కుమార్ కూడా ఢిల్లీ వెళ్లారు. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ తన  మైండ్ గేమ్ కు అస్త్రంగా మలుచుకుంది. ముఖ్యంగా మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరుతున్న తరుణంలో, ఆ నిర్ణయం నచ్చకే హరీష్ రావు సభను స్కిప్ చేసి హస్తిన బాట పట్టారని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు.

ఈ పరిణామంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి  . బీఆర్ఎస్‌లో అసమ్మతి జ్వాలలు మొదలయ్యాయని, పార్టీలో ముసలం  పుట్టిందని వ్యాఖ్యానించారు. హరీష్ రావు లేని కేసీఆర్ సభను ఊహించలేమని, ఆయన ఢిల్లీ పర్యటన వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉందని పేర్కొన్నారు. జీవన్ రెడ్డి రాకను హరీష్ రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, బీఆర్ఎస్ ఒక మునిగిపోయే పడవ అని ఎద్దేవా చేశారు. ఆయన త్వరలోనే తన భవిష్యత్తు ప్రణాళికను వెల్లడిస్తారని జోస్యం చెప్పారు. 

జగిత్యాల ఎమ్మెల్యే సైతం ఇదే తరహాలో స్పందించారు.  హరీష్ రావు గైర్హాజరు వెనుక బిజెపి అగ్రనేతలతో మంతనాల కోణాన్ని తెరపైకి తెచ్చారు. జీవన్ రెడ్డి చేరికతో పార్టీలో చీలిక వచ్చే ప్రమాదం ఉందని, హరీష్ రావు వెంట మరికొందరు ఎమ్మెల్యేలు వెళ్లే అవకాశం ఉందంటూ కాంగ్రెస్ శ్రేణులు మైండ్ గేమ్ ఆడుతున్నాయి. కేసీఆర్ ఏడాది తర్వాత నిర్వహిస్తున్న కీలక సభ కంటే ఢిల్లీ వెళ్లడమే ముఖ్యమా అని వారు ప్రశ్నిస్తున్నారు.   

ఈ విమర్శలను బీఆర్ఎస్ వర్గాలు తీవ్రంగా కొట్టిపారేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ , ఎమ్మెల్యేల అనర్హత వేటు వంటి కీలక న్యాయపరమైన అంశాలపై సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చించేందుకే వారు ఢిల్లీ వెళ్లారని స్పష్టం చేశారు. ఏప్రిల్ 22న హైకోర్టు తీర్పు రానున్నందున, ముందస్తుగా చట్టపరమైన వ్యూహాలు రచించడమే ఈ పర్యటన ఉద్దేశమని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పసలేని ఆరోపణలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని వారు మండిపడ్డారు.

 ఒకవైపు జగిత్యాలలో కేసీఆర్ తన సభ ద్వారా పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు హరీష్ రావు ఢిల్లీ పర్యటన చుట్టూ జరుగుతున్న ప్రచారం బీఆర్ఎస్‌కు కొంత ఇబ్బందికరంగా మారింది. ఇది నిజంగానే న్యాయపరమైన పర్యటననా లేక కాంగ్రెస్ అంటున్నట్లుగా గులాబీ గూటిలో ఏదైనా రాజకీయ మార్పులకు సంకేతమా అన్నది వేచి చూడాలి. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Telangana Politics: రేవంత్ ఫ్యామిలీపై బీఆర్ఎస్ ఆరోపణల దాడి - కౌంటర్ ఇవ్వడానికి ముందుకు రాని మంత్రులు- అసలేం జరుగుతోంది?
రేవంత్ ఫ్యామిలీపై బీఆర్ఎస్ ఆరోపణల దాడి - కౌంటర్ ఇవ్వడానికి ముందుకు రాని మంత్రులు- అసలేం జరుగుతోంది?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget