Sharmila Dharna ; పాదయాత్రకు అనమతి ఇచ్చే వరకూ ఆమరణ దీక్ష - ట్యాంక్ బండ్‌పై షర్మిల దీక్ష, అరెస్ట్ !
ట్యాంక్ బండ్‌పై దీక్ష చేస్తున్న షర్మిలను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.
Sharmila Dharna ; వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ట్యాంక్ బండ్‌పై మెరుపు ధర్నా నిర్వహించారు. న్యాయానికి సంకెళ్లు పేరుతో అంబేద్కర్ విగ్రహం వద్ద అనుచరులతో కలిసి దీక్షకు కూర్చున్నారు. దీంతో ఒక్క సారిగా ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ జామ్ అయింది. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తనకు పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంపై ఈ ధర్నా చేశారు. పోలీసులు అమెను అరె్ట్ చేసి తరలించారు. ఈ ఈ సందర్భంగా పోలీసులకు.. వైఎస్ఆర్టీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం .. తోపులాట చోటు చేసుకున్నాయి. ప్రజాస్వామ్య హక్కును కాలరాస్తున్నారని షర్మిల ప్రభఉత్వంపై మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని .. తాను జైల్లో పెట్టిన ఆమరణ దీక్షను కొనసాగిస్తానని ప్రకటించారు.
అంతకు ముందు వైఎస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ పోలీసులు అనుమతిని నిరాకరించారు. వైఎస్‍ఆర్ తెలంగాణ పార్టీ ప్రతినిధులు, లీగల్ సెల్ బృంద అభ్యర్థనపై పదిరోజులపాటు చర్చలు జరిపిన పోలీసులు చివరకు నో చెప్పారు. షర్మిల పాదయాత్ర చేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని పోలీసులు తెలిపారు. దీంతో పాదయాత్రకు అనుమతి కోసం ధర్నా ప్రారంభించారు. కొద్ది క్షణాల్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు గుమికూడారు. షర్మిల ట్యాంక్ బండ్‌పై ధర్నా చేస్తారని ఊహించలేకపోయిన పోలీసులు ఒక్క సారిగా ఉలిక్కి పడ్డారు. వెంటనే.. వైఎస్ఆర్‌టీపీ నేతలను అక్కడ నుంచి తరలించే ఏర్పాట్లు చేసారు.
పాదయాత్రలో భాగంగా నవంబర్ 26న వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై ఆయన సొంత ఊరు నల్లబెల్లిలో షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. 28న షర్మిల యాత్రపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. అక్కడ వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. శాంతిభద్రతల సమస్య కారణంగా లింగగిరి శంకరమ్మ తండా వద్ద షర్మిల పాదయాత్రకు బ్రేక్ వేశారు. ఆమెను అరెస్టు చేసి హైదరాబద్ తరలించారు. తర్వాతి రోజు ప్రగతి భవన్ ముట్టడికి వెళ్లడంతో .. ఆమెను టోయింగ్ క్రేన్‌తో కారుతో సహా తీసుకెళ్లడం వివాదాస్పదమయింది. ఆ ఘటన తర్వాత రాజకీయాలు అనూహ్యంగా మారిపోాయి.
తర్వాత పాదయాత్ర అనుమతి కోసం హైకోర్టులో వైఎస్ఆర్టీపీ నేతలు పిటిషన్ వేశారు. షర్మిల పాదయాత్రకు నర్సంపేట పోలీసులు అనుమతి రద్దు చేశారని.. తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. షర్మిల పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దని, విమర్శనాత్మకంగా మాట్లాడవద్దని హైకోర్టు సూచించింది. అయితే మళ్లీ పోలీసులకు దరఖాస్తు చేసుకోవాలని వైఎస్ఆర్‌టీపీ నేతలకు సూచించింది. దీంతో ఆ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు వరంగల్ కమిషనర్ రంగనాథ్‌ను కలిసి అనుమతి కోసం లేఖ ఇచ్చారు.
కొన్ని రోజుల పాటు పరిశీలన జరిపి పాదయాత్ర కోసం మరోసారి షర్మిల పోలీసుల అనుమతి కోసం ధరఖాస్తు చేసుకోగా తిరస్కరించారు. పాదయాత్రకు పోలీసులు అనుమతులు నిరాకరించడంతో భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసుకుని వెంటనే రంగంలోకి దిగారు. అనుమతి ఇచ్చే వరకూ దీక్ష చేస్తానని షర్మిల అంటున్నారు.