Morning Top News: నేడే ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్, మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్లు వంటి మార్నింగ్ న్యూస్
Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.
Morning Top News:
నేడు ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మరి కాసేపట్లో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను సభ ముందు ఉంచనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలతోపాటు రాష్ట్రాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేయడమే ధ్యేయంగా ఈ బడ్జెట్‌ను ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు
అమరావతి ప్రాంత అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. నగర నిర్మాణం, సుస్ధిరాభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు , ఆసియా అభివృద్ధి బ్యాంకులు కలిసి సంయుక్తంగా ఇచ్చే రూ.15 వేల కోట్ల రుణ సహకార వినియోగంపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో రాజధానిలో అత్యున్నత ప్రమాణాలతో మౌలిక వసతులు, హరిత నిర్మాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేలా కార్యాచరణ చేపట్టాలని పేర్కొంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
అన్నమయ్య జిల్లాలో విషాదం
అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పీలేరు నియోజకవర్గం కేవీపల్లి మండలంలోని గ్యారంపల్లిలో ఏపీఆర్ రెసిడెన్సీ స్కూల్‌లో ఐదో తరగతి విద్యార్థి రెడ్డిమోక్షిత్ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లి, బంధువులు పాఠశాలకు చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ప్రేమ వివాహానికి అడ్డొస్తున్నాడని ప్రియురాలి తండ్రిపై కాల్పులు
హైదరాబాద్ సరూర్‌నగర్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. తన ప్రేమ వివాహానికి అడ్డొస్తున్నాడని యువతి తండ్రిపై యువకుడు కాల్పులకు తెగబడ్డాడు. యువతి తండ్రి కంట్లో నుంచి తూటా దూసుకెళ్లడంతో తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్లు
త్వరలోనే ఆటంబాంబు పేలబోతోందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పొంగులేటి పేల్చే బాంబులకు ఏ కాంగ్రెస్ నాయకుడు ఎగిరిపోతాడో తెలియదు కానీ, శ్రీనివాస్ రెడ్డికి బాంబుల శాఖ మంత్రిగా పేరు పెట్టాలని సెటైర్లు వేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
సామాజిక స్పృహపై జర్నలిస్ట్ లకు పవన్ క్లాస్
డిప్యూటీ సీఎం పవన్ మీడియా ప్రతినిధులకు క్లాస్ తీసుకున్నారు. సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే కనీసం పట్టించుకోవడం లేదని.. స్పృహ ఇక్కడి నుంచే రావాలని అన్నారు. అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు అధికారులకు ఎవరైనా వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని హెచ్చరించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
కురుమూర్తి గుట్టపైకి ఘాట్ రోడ్డుకు సీఎం రేవంత్ శంకుస్థాపన
జిల్లాలోని చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని జరుగుతున్న కురుమూర్తి స్వామి జాతరలో పాల్గొన్నారు. కింద నుంచి కురుమూర్తి గుట్టపైకి ఘాట్ రోడ్డు పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల కిందట పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఇన్నాళ్లకు పాలమూరు బిడ్డనైన నాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
విజయోత్సవాల పై కేటీఆర్ ఫైర్
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఒక ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించనున్న విజయోత్సవాలపై కేటీఆర్ మండిపడ్డారు. ఎనుముల వారి ఏడాది పాలనలో చెప్పుకోవడానికి ఏమున్నది గర్వకారణం, జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు.. “కరప్షన్ కార్నివాల్” అని కేటీఆర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మంచిర్యాల జిల్లాను వణికిస్తున్న పెద్దపులి
మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. పులి సంచారంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కాసిపేట మండలం పెద్ద ధర్మారం సమీపంలో పులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. ఒడిశా సరిహద్దులో పులి సంచారంతో ఆంధ్రాలోనూ అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. గత కొన్ని రోజులుగా గంజాం, గజపతి జిల్లాల్లో మహారాష్ట్ర నుంచి దారి తప్పి వచ్చిన పులిని అక్కడ అటవీశాఖ అధికారులు గుర్తించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రధాని ప్రచారం
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహారాష్ట్రలో నాందేడ్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలోనూ ప్రసంగించారు. ఈ బహిరంగ సభలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనడంపై ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాంతానికి ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
రెండో టీ20లో భారత్‌కు తప్పని ఓటమి!
మొదటి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్నటీం ఇండియాకు రెండో టీ20లో మాత్రం ఓటమి తప్పలేదు. . రెండో T20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను సౌతాఫ్రికా సమం చేసింది. ఈ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఒకే ఇన్నింగ్స్‌లో 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఐదో భారత బౌలర్‌గా నిలిచాడు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..