Maharastra Elections: మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రధాని మోదీ విస్తృత ప్రచారం - నాందేడ్‌లో ఎన్నికల వ్యూహాలపై నేతలకు ప్రశంసలు
BJP Vishnu: మహారాష్ట్ర ఎన్నికల్లో నాందేడ్ సభలో ప్రధాని ప్రసంగించారు . ఈ ప్రాంతానికి ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు. నేతలు బాగా పని చేస్తున్నారని మోదీ అభినందించారు.
AP BJP leader Vishnuvardhan Reddy with Modi: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహారాష్ట్రలో భారీ బహిరంగసభల్లో ప్రసంగించారు. నాందేడ్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలోనూ ప్రసంగించారు.
నాందేడ్ జిల్లాకు బీజేపీ పరిశీలకునిగా ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ప్రధానమంత్రి రాక సందర్భంగా ఎయిర్ పోర్టులో ఆయన విష్ణువర్ధన్ రెడ్డి స్వాగతం చెప్పారు. తర్వాత కొద్ది సేపు ఎన్నికల సన్నద్దతపై పార్టీ నేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ ఇంచార్జ్ గా గత నెల రోజులుగా నాందేడ్ ప్రాంతంలో చేసిన ప్రచారంతో పాటు ఎలక్షనీరింగ్ వ్యూహాలు ఇతర అంశాలపై వివరించారు. ఈ ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నికల పని, పార్టీ ప్రచారం, సభలు ప్రస్తుత ఎన్నికల సంబంధించి పార్టీ ప్రస్తుత రాజకీయ స్థితిని విష్ణువర్ధన్ రెడ్డి ప్రత్యేకంగా వివరించారు.
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున యన్, డి, ఏ అభ్యర్థులకు అనుకూలంగా ప్రజలు మద్దతిస్తున్నారని ప్రధానికి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో బిజెపి తిరిగే అధికారంలోకి వస్తుందని ఆశాభావాన్ని ప్రధానితో విష్ణువర్థన్ రెడ్డి వ్యక్తం చేశారు.
తెలుగువారి మద్దతుతో పాటు బీజేపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధితో ప్రజలు మరోసారి కూటమి ప్రభుత్వానికి మద్దతిస్తారని బీజేపీ ఆశిస్తోంది. పార్టీ ఇంచార్జ్ వ్యవహరిస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి ఎలక్షనీరింగ్ వ్యూహాల్లోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. బహిరంగసభలు భారీగా విజయవంతం చేయడానికి ఆయన కృషి చేశారు. నాందేడ్ లో జరిగిన బహిరంగ సభలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనడంపై ప్రధాని కూడా సంతృప్తి వ్యక్తం చేశారు.
झारखंड में भाजपा-एनडीए के पक्ष में प्रचंड आंधी चल रही है।
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) November 10, 2024
https://t.co/5WXyd07DMb
ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే పలువురు ఏపీ బీజేపీ నేతలకూ బాధ్యతలు ఇస్తారు. విష్ణువర్ధన్ రెడ్డికి ఇలాంటి ఎన్నికల నిర్వహణలో ప్రత్యేక అనుభవం ఉండటంతో కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడల్లా ఆయనకు పిలుపు ఇస్తూంటారు. తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లోనూ..గతంలో కర్ణాటక ఎన్నికల్లోనూ మోదీ సభల నిర్వహణలో సమన్వయం చేసుకున్నారు.