Hero Destini 110 Launch: కేవలం ₹72 వేలకే మోడ్రన్ ఫీచర్లతో స్టైలిష్ స్కూటర్
Hero Destini 110 Design: హీరో డెస్టినీ 110 డిజైన్‌ను మోడ్రన్ & క్లాసిక్ స్టైలింగ్‌ను మిళితం చేస్తూ నియో-రెట్రో థీమ్‌పై ఆధారపడి రూపొందించారు.

Hero Destini 110 Features Price Mileage: హీరో మోటోకార్ప్ తన కొత్త స్కూటర్ హీరో డెస్టినీ 110 ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్కూటర్ కొత్త & ఆకర్షణీయమైన ఆఫర్‌గా కంపెనీ ప్రచారం చేస్తోంది. బడ్జెట్ ధరలోనే సౌకర్యం & మంచి మైలేజీని కోరుకునే వారిని దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందించారు.
హీరో డెస్టినీ 110 స్కూటర్ ధర, డిజైన్, స్పెసిఫికేషన్లు & ఇంజిన్ వివరాలు:
హీరో డెస్టినీ 110 స్కూటర్ ధర
వాస్తవానికి, ఇప్పటికే లాంచ్ అయిన Destini 125 మోడల్‌కు ఏ మాత్రం తీసిపోకుండా Destini 110 ను తీసుకొచ్చారు. కొత్త హీరో డెస్టినీ 110 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది, అవి: బేస్ VX వేరియంట్, దీని ధర రూ. 72,000 ఎక్స్-షోరూమ్; రెండోది ZX వేరియంట్, దీని ధర రూ. 79,000 ఎక్స్-షోరూమ్. ఎక్స్-షోరూమ్‌కు రిజిస్ట్రేషన్ ఫీజు, ఇన్సూరెన్స్ ఇతర అవసరమైన ఖర్చులు కలిపితే ఆన్-రోడ్ ధర వస్తుంది.
హీరో డెస్టినీ 110 డిజైన్ & రంగులు
హీరో డెస్టినీ 110 డిజైన్‌ను నియో-రెట్రో థీమ్ ఆధారంగా రూపొందించారు, అంటే మోడ్రన్ & క్లాసిక్ స్టైలింగ్‌ను మిళితం చేసి స్కూటర్‌ను డిజైన్ చేశారు. ప్రీమియం క్రోమ్ యాక్సెంట్స్, ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్ & H ఆకారపు LED టెయిల్ ల్యాంప్ డెస్టినీ 110 స్కూటర్‌కు అద్భుతమైన లుక్స్ ఇస్తున్నాయి. ఈ స్కూటర్‌లో మూడు పెద్ద మెటల్ బాడీ ప్యానెళ్లను ఉపయోగించారు. డెస్టినీ 110 రంగు ఎంపికలలో (Hero Destiny 110 colour options) - ఎటర్నల్ వైట్, మాట్టే స్టీల్ గ్రే, నెక్సస్ బ్లూ, ఆక్వా గ్రే & గ్రూవీ రెడ్ (Eternal White, Matte Steel Grey, Nexus Blue, Aqua Grey & Groovy Red) ఉన్నాయి.
హీరో డెస్టినీ 110 ఫీచర్లు
ఫీచర్ల పరంగా (Hero Destini 110 Features), హీరో డెస్టినీ 110 చాలా అనేక ఆధునిక & ఉపయోగకరమైన ఫీచర్లను అందిస్తుంది. డెస్టినీ 110 కు 12-అంగుళాల అల్లాయ్ వీల్స్ బిగించారు. డెస్టినీ 110 వీల్‌బేస్ 1302 mm, సీట్ ఎత్తు 770 mm, గ్రౌడ్ క్లియరెన్స్ 162 mm. బండి మొత్తం బరువు 114 కేజీలు. స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో సింగిల్ సైడెడ్ షాక్ అబ్జార్బర్ ఇచ్చారు. ఈ స్కూటర్‌లో ఫ్రంట్ గ్లోవ్ బాక్స్, బూట్ లాంప్ & అనలాగ్-డిజిటల్ స్పీడోమీటర్ కూడా ఉన్నాయి.
హీరో డెస్టినీ 110 ఇంజిన్
హీరో డెస్టినీలో కూడా, హీరో i3S లో ఉన్న అదే 110 సిసి, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఈ ఇంజిన్ 7,250 rpm వద్ద 8 bhp శక్తిని & 5,750 rpm వద్ద 8.87 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. డెస్టినీలో వన్-వే క్లచ్ సిస్టమ్ (One-way clutch system) ఉంటుంది. హీరో డెస్టినీ ఇంజిన్ BS6-2.0 కు అనుకూలంగా ఉంటుంది.
హీరో డెస్టినీ 110 మైలేజ్
ఈ టూవీలర్ లీటరుకు 56.2 km మైలేజీని ఇస్తుందని హీరో మోటోకార్ప్ ప్రకటించింది. ఈ బండి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లు. ట్యాంక్ ఫుల్ చేస్తే, కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజీ ప్రకారం, ఈ స్కూటర్ దాదాపు 300 km ప్రయాణిస్తుంది.





















