అన్వేషించండి

First Day Car Sales: ట్యాక్స్‌ తగ్గగానే ఇంత ఊపా? మారుతి, హ్యుందాయ్, టాటా ఫస్ట్‌ డే సేల్స్‌ అదరహో

GST 2.0 అమలులోకి వచ్చినప్పటి నుంచి కార్ల కంపెనీలు అమ్మకాల్లో గణనీయంగా పెరిగాయి. మొదటి రోజు, మారుతి 25,000 కార్లను, హ్యుందాయ్ 11,000 & టాటా 10,000 కార్లను డెలివరీ చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కొత్త GST 2.0 తో కారు అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.
  • మారుతి సుజుకి 80,000 ఎంక్వైరీలు, 25,000 కార్ల డెలివరీలు అందుకుంది.
  • హ్యుందాయ్, టాటా మోటార్స్ కూడా రికార్డు అమ్మకాలు, డెలివరీలు నమోదు చేశాయి.
  • చిన్న కార్లపై GST తగ్గింపు, లగ్జరీ కార్లపై పన్ను తగ్గింపు వినియోగదారులకు లాభం.

First Day Car Sales Increase After New GST: మన దేశంలో, 22 సెప్టెంబర్ 2025 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త GST 2.0, కారు మార్కెట్‌కు మామూలు బూస్ట్‌ ఇవ్వలేదు. చిన్న కార్లపై GSTని 28% నుంచి 18% కి తగ్గించడం వల్ల కస్టమర్లు హ్యాపీగా ఉన్నారు. నవరాత్రి ప్రారంభం & పండుగ సీజన్‌తో, కంపెనీలు రికార్డు స్థాయిలో బుకింగ్స్‌ & సేల్స్‌ను మూటగట్టుకున్నాయి. దేశంలోని అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, ఒక్క రోజులోనే, అంటే సెప్టెంబర్ 22వ తేదీన 80,000 కు పైగా కస్టమర్ ఎంక్వైరీస్‌ అందుకుంది. 25,000 కు పైగా కార్లను డెలివరీ చేసింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 30,000 కు చేరుకుంటుందని అంచనా.

మారుతి SEO ప్రకటన
"చిన్న కార్లకు అత్యధిక డిమాండ్ ఉంది, బుకింగ్స్‌ దాదాపు 50% పెరిగాయి. అనేక వేరియంట్‌లకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల స్టాక్స్‌ త్వరగా అయిపోతాయని భావిస్తున్నాం" - మారుతి మార్కెటింగ్ & సేల్స్‌ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ

ముఖ్యంగా, మారుతి, తగ్గిన GST రేట్ల ప్రయోజనాలను సెప్టెంబర్ 18 నుంచే కస్టమర్లకు అందించడమే కాకుండా, అదనపు ధరల కోతలను కూడా అమలు చేసింది. ఫలితంగా, ఈ కంపెనీకి 75,000 బుకింగ్స్‌ వచ్చాయి. అంటే రోజుకు సగటున 15,000 బుకింగ్స్‌. డీలర్‌షిప్‌ల వద్ద రద్దీ చాలా ఎక్కువగా ఉండటం వల్ల రాత్రి పొద్దుపోయే వరకు షోరూమ్‌లు తెరిచి ఉండాల్సి వచ్చింది.

గత ఐదేళ్లలో హ్యుందాయ్ మోటార్స్‌కు అతి పెద్ద సంతోషం
మారుతి మాదిరిగానే, హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) కూడా మొదటి రోజున (22 సెప్టెంబర్ 2025) కొత్త రికార్డును సృష్టించింది. కంపెనీ 11,000 డీలర్ బిల్లింగ్స్‌ నమోదు చేసింది, ఇది గత ఐదు సంవత్సరాలలో అత్యధిక సింగిల్ డే పెర్ఫార్మెన్స్‌. GST 2.0 అమలు & నవరాత్రి ప్రారంభం కలిసి మార్కెట్లో అద్భుతమైన ఉత్సాహాన్ని సృష్టించాయని హ్యుందాయ్ COO తరుణ్ గార్గ్ చెప్పారు. కస్టమర్ విశ్వాసం పెరిగింది & ఈ పండుగ సీజన్‌లో కంపెనీ బలమైన డిమాండ్‌ను ఆశిస్తోంది.

టాటా మోటార్స్ పరిస్థితి
టాటా మోటార్స్ కూడా మినహాయింపు కాదు. GST 2.0 అమలులోకి వచ్చిన మొదటి రోజే ఈ కంపెనీ 10,000 కార్లను డెలివరీ చేసింది. ఇంకా, దీనికి 25,000 కు పైగా ఎక్కువ కస్టమర్ ఎంక్వైరీలు వచ్చాయి. కొత్త పన్ను విధానం, కస్టమర్లను కొనుగోలు వైపు ప్రోత్సహించిందని ఇది స్పష్టంగా చూపిస్తోంది.

GST 2.0 లో అతి పెద్ద బెనిఫిట్‌ చిన్న కార్లకు
కొత్త GST నిబంధనల ప్రకారం, చిన్న పెట్రోల్ & హైబ్రిడ్ కార్లపై ఇప్పుడు 18% GST మాత్రమే వసూలు చేస్తారు. CNG & LPG కార్లకు కూడా అదే పన్ను వర్తిస్తుంది. 1200cc లేదా అంతకంటే తక్కువ ఇంజిన్‌ & 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉన్న పెట్రోల్‌ కార్లకు 18% GST వరిస్తుంది. అలాగే, 1500cc వరకు ఇంజిన్‌ & 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉన్న డీజిల్ & డీజిల్ హైబ్రిడ్ కార్లకు కూడా 18% GST నియమం వర్తిస్తుంది. 

లగ్జరీ, SUVలపై 40% పన్ను
ప్రభుత్వం లగ్జరీ & పెద్ద కార్లపై GST రేటును 40% కి పెంచింది. వీటిలో SUVలు, UVలు, MUVలు & XUVలు వంటి వాహనాలు ఉన్నాయి. 170mm కంటే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న వాహనాలు కూడా ఈ వర్గంలోకి వస్తాయి. అయితే, కస్టమర్లకు ఇది బ్యాడ్‌ న్యూస్‌ కాదు. గతంలో, లగ్జరీ కార్లపై 28% GST & 22% సెస్, మొత్తం కలిపి 50% పన్ను వసూలు చేసేవాళ్లు. ఇప్పుడు, GSTని 40%కి తగ్గించారు & సెస్ పూర్తిగా తొలగించారు. అంటే ఇక్కడ కూడా కస్టమర్లు 10% పన్ను ఉపశమనం పొందుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Second-hand Car: రూ.7 లక్షల నుంచి Kia Sonet facelift.. సెకండ్‌హ్యాండ్‌లో కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి!
సెకండ్ హ్యాండ్ కియా సోనెట్ కొనాలనుకుంటున్నారా? ఈ రెండు సమస్యలను ముందే చెక్ చేయండి!
Vibration-Free Bikes: లాంగ్ రైడ్స్‌కు బెస్ట్ బైక్స్‌.. అతి తక్కువ వైబ్రేషన్లు ఇచ్చే స్మూత్ ఇంజిన్, మంచి కంఫర్ట్ ఇచ్చే 5 మోడల్స్‌పై ఓ లుక్కేయండి!
హైవేపై గంటల తరబడి ప్రయాణించినా వైబ్రేషన్లు, అలసట తక్కువే.. 300cc విభాగంలో బెస్ట్ 5 బైక్స్
Driving In Fog: వింటర్ ఫాగ్‌లో కారు నడిపేటప్పుడు హజార్డ్ లైట్లు ఆన్ చేస్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ చిన్న పొరపాట్లు మీ ప్రయాణాన్ని ప్రమాదంలో పడేస్తాయి!
సింగిల్‌ ఛార్జ్‌తో Kia Syros EV నిజంగా ఎంత దూరం వెళ్తుంది? సిటీలో అదరగొట్టినా హైవేపై తగ్గిన రేంజ్!
Kia Syros EV రియల్‌ రేంజ్ టెస్ట్.. కంపెనీ చెప్పినట్లు నిజంగానే 526 కి.మీ. ప్రయాణించిందా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
US Federal Court Visa Ruling: ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
Shubman Gill Strategy:  కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
Amaravati Financial Plan: అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
Khairatabad By-Election Suspense: ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
Rahul Gandhi Fake Name: మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
Cyclone Akvan: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Embed widget