అన్వేషించండి

Maruti Swift నుంచి Tata Nexon వరకు - CNG వెర్షన్లు బెస్ట్‌ మైలేజ్‌ ఇస్తున్నాయా?, రియల్‌ వరల్డ్‌ టెస్టింగ్‌లో నిజాలు ఇవే!

CNG Cars Mileage: మారుతి స్విఫ్ట్‌ నుంచి టాటా నెక్సాన్‌ వరకు, తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న ఆరు CNG కార్ల మైలేజీని టెస్ట్‌ చేస్తే తెలిసిన నిజాలు ఇవే.

Best CNG Cars Real World Mileage: భారతదేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరిగిపోతున్న తరుణంలో, చాలా మంది CNG కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయడమే కాకుండా, పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గిస్తున్నాయి కాబట్టి ఈ సెగ్మెంట్‌కి డిమాండ్‌ రోజురోజుకీ పెరుగుతోంది. ప్రముఖ ఆటోమొబైల్ మ్యాగజైన్‌, ఇటీవల, మార్కెట్‌లో ఉన్న టాప్‌ CNG కార్లను టెస్ట్ చేసి, రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ ఫిగర్స్‌ను వెల్లడించింది. అందులో మారుతి, టాటా, హ్యుందాయ్ కంపెనీల మోడల్స్‌ ఉన్నాయి. ఇప్పుడు వాటి డీటైల్స్ ఒక్కసారి చూద్దాం.

Tata Nexon CNG
టాటా నెక్సాన్‌ CNG భారతదేశంలో టర్బో ఇంజిన్‌తో వచ్చిన ఏకైక CNG SUV. 100hp పవర్‌, 170Nm టార్క్‌ను ఇది ఇస్తుంది. ARAI ప్రకారం ఇది 24km/kg ఇస్తుందని చెబుతుంటే, రియల్‌ వరల్డ్ టెస్ట్‌లో 18.55km/kg మాత్రమే రికార్డ్‌ అయింది. నగరంలో 13.4km/kg, హైవేపై 23.7km/kg మైలేజ్‌ చూపించింది. దీని ధరలు ₹8.23 లక్షల నుంచి ₹13.08 లక్షల వరకు ఉన్నాయి.

Maruti Brezza CNG
మారుతి బ్రెజ్జా CNG కూడా కాంపాక్ట్ SUVగా మంచి ఫేమస్‌. 1.5 లీటర్ ఇంజిన్‌తో 88hp పవర్‌, 122Nm టార్క్ ఇస్తుంది. ARAI క్లెయిమ్‌ 25.5km/kg కాగా, రియల్‌ టెస్ట్‌లో 22.95km/kg వచ్చింది. ప్రస్తుత ధరలు ₹9.17 లక్షల నుంచి ₹11.46 లక్షల వరకు ఉన్నాయి.

Tata Altroz CNG
హ్యాచ్‌బ్యాక్‌లలో టాప్‌గా నిలిచే టాటా ఆల్ట్రోజ్‌, ట్విన్‌ సిలిండర్‌ CNG టెక్నాలజీతో పెర్ఫార్మ్‌ చేస్తుంది. 1.2 లీటర్ ఇంజిన్‌తో 74hp పవర్‌, 104Nm టార్క్ జనరేట్‌ చేస్తుంది. ARAI క్లెయిమ్‌ 27.8km/kg కాగా, రియల్‌ వరల్డ్‌ టెస్ట్‌లో 25.11km/kg వచ్చింది. ఈ కారు ధరలు ₹7.22 లక్షల నుంచి ₹10.15 లక్షల వరకు ఉన్నాయి.

Tata Punch CNG
టాటా పంచ్ CNG కూడా అదే 1.2 లీటర్ ఇంజిన్‌, ట్విన్‌ సిలిండర్ టెక్నాలజీతో పని చేస్తుంది. ARAI సర్టిఫై చేసిన ప్రకారం 26.99km/kg మైలేజ్‌ అని చెబుతుంటే, వాస్తవ ప్రపంచంలో ఇది 25.85km/kg గా రికార్డ్ అయింది. ధరలు ₹6.68 లక్షల నుంచి ₹9.30 లక్షల వరకు ఉన్నాయి.

Hyundai Exter CNG
టాటా పంచ్‌కి డైరెక్ట్ రైవల్‌గా వచ్చిన హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ CNG, ట్విన్‌ సిలిండర్ ఆప్షన్‌తో పని చేస్తుంది. దీని 1.2 లీటర్ ఇంజిన్ 69hp పవర్‌, 95Nm టార్క్ ఇస్తుంది. ARAI సర్టిఫైడ్‌ మైలేజ్‌ నంబర్‌ 27.1km/kg కాగా, రియల్‌ టెస్ట్‌లో 26.55km/kg ఇచ్చింది. ధరలు ₹6.87 లక్షల నుంచి ₹9.61 లక్షల వరకు ఉన్నాయి.

Maruti Swift CNG
ఇక చివరగా, మారుతి స్విఫ్ట్ CNG అన్ని కార్లను దాటేసి బెస్ట్‌ మైలేజ్‌ ఇస్తోంది. ఈ కారులోని 1.2 లీటర్ ఇంజిన్‌, 70hp పవర్‌, 102Nm టార్క్ ఇస్తుంది. ARAI ప్రకారం 32.85km/kg మైలేజ్‌ అని చెబుతుంటే, రియల్‌ వరల్డ్‌ టెస్ట్‌లో 27.87km/kg రికార్డ్ అయింది. ప్రస్తుత ధరలు ₹7.45 లక్షల నుంచి ₹8.39 లక్షల వరకు ఉన్నాయి.

మొత్తంగా చూస్తే, రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌లో మారుతి స్విఫ్ట్ CNG అగ్రస్థానంలో నిలిచింది. దాని తర్వాత హ్యుందాయ్ ఎక్స్‌టర్‌, టాటా పంచ్‌ కూడా మంచి నంబర్సే ఇచ్చాయి. నగరంలో డైలీ యూజ్‌కి CNG కార్లు చాలా సరైన ఆప్షన్‌ అని చెప్పొచ్చు.

టాప్ హెడ్ లైన్స్

కొత్త స్పెక్ట్రల్‌ గ్రీన్‌ కలర్‌తో టీవీఎస్‌ రైడర్‌ 125 డాక్టర్‌ డూమ్‌ ఎడిషన్‌ - ధర రూ.95,320
టీవీఎస్‌ రైడర్‌ 125 డాక్టర్‌ డూమ్‌ ఎడిషన్‌ లాంచ్‌.. మార్వెల్‌ అభిమానుల కోసం స్పెషల్‌ బైక్‌
No PUC No Fuel: పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే నో పెట్రోల్‌, డీజిల్‌! కొత్త రూల్‌లోకి వచ్చేస్తోంది!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే నో పెట్రోల్‌, డీజిల్‌! కొత్త రూల్‌లోకి వచ్చేస్తోంది!
Seltos Modification: పాత సెల్టోస్‌కు కొత్త రూపు ఇవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది?
పాత సెల్టోస్‌కు కొత్త రూపు ఇవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది?
కొత్త Toyota Hiluxలో వచ్చిన మార్పులేంటి? పాత మోడల్‌తో పోలిస్తే కీలక తేడాలు ఇవే
2026 టయోటా హైలక్స్‌ vs పాత హైలక్స్‌.. డిజైన్‌ నుంచి ఫీచర్ల వరకు పూర్తిగా మారిందా?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Police Complaint OTT : నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget