Director Sujeeth Story: రైలు పట్టాల మీద షూట్ చేస్తూ.. ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు… షారూఖ్‌ఖాన్ వచ్చి 11 హగ్గులిచ్చాడు- The Real OG Sujeeth స్టోరీ ఇది..!
షార్ట్‌ఫిల్మ్‌లు చేసుకునే ఓ కుర్రాడు.. రెండో సినిమాకే ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను… మూడో సినిమాకు పవర్ స్టార్‌ను డైరక్ట్‌చేశాడు. మూడు సినిమాలకే.. టాప్ డైరక్టర్లకు కూడా లేని క్రేజ్ సంపాదించాడు..

The Real OG Sujeeth: పవన్ కల్యాణ్ అనే పేరు అంటే.. అది ఓ హై ఓల్టేజ్ పవర్.. ఫ్యాన్స్ లో ఓ క్రేజ్.. థియేటర్ లోపల.. బయట.. ఓ పూనకం.. అంతటి పవర్‌ను కూడా అంతకు మించిన రేంజ్‌కు తీసుకెళ్లిన ఓ Enigma… Sujeeth. The Real OG. మామూలుగానే పవన్ కల్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్‌ను పట్టలేం.. కానీ ఈ OGకి మాత్రం పట్టపగ్గాలు లేకుండానే పోయాయి. దానికి కచ్చితంగా కారకుడు ఆ సినిమా డైరక్టర్ సుజితే..! ఒక కల్ట్ ఫ్యాన్.. తన అభిమాన హీరోతో సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలా చేశాడు అంటూ.. మిగతా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. సరే.. ఆ సినిమా మరో కొన్ని గంటల్లో వస్తుంది. అసలు ఈ పవన్ కల్యాణ్ ఫ్యాన్ కమ్ డైరక్టర్ కథ ఏంటో ఓసారి చూద్దాం..
అనంతపురం కుర్రాడు.. అందనంత ఎత్తుకు ఎదిగాడు.. Life Journey of Sujith
నిండా ముప్పై ఏళ్లు కూడా రాకముందే.. మూడొందల కోట్ల బడ్జెట్ సినిమా చేసే కెపాసిటీ సంపాదించిన సుజిత్ ప్రయాణం మొదలైంది.. ఓ చిన్న హ్యాండీక్యామ్‌తో.. ! అనంతపురానికి చెందిన ఓ చార్టెడ్ అకౌంటెంట్ కుమారుడైన సుజీత్‌కు చిన్నప్పటి నుంచే సినిమాలంటే విపరీతమైన పిచ్చి.. ఆ పిచ్చి పరాకాష్టకు చేరి… తానే సినిమాల్లోకి వెళ్లిపోవాలనుకున్నాడు. ఆ తర్వాత చెన్నైకు వెళ్లి అక్కడ చదువుకుంటున్నా.. కూడా సినిమాల్లోకి వెళ్లాలన్నదే ధ్యాస. ఇంట్లో వాళ్లు CAకి ప్రిపేర్ అవ్వమని విజయవాడ పంపిస్తే.. అతను మార్నింగ్ షో నుంచి మిడ్‌నైట్ షోల వరకూ.. సినిమా హాళ్లలోనే ఉన్నాడు.
విజయవాడ మార్చేసింది..
బెజవాడ చాలా మంది బతుకు మార్చేసింది. సిద్దార్థ కాలేజీలో చేరిన రామ్‌గోపాల్‌వర్మ విజయవాడ సినిమా హాళ్ల చుట్టూ తిరిగినట్లే.. సీఏ కోచింగ్‌కు వచ్చిన సుజీత్ Sujeeth కూడా బెజవాడలో థియేటర్లన్నీ చుట్టేశాడు.. హిట్టు.. ఫ్లాపులతో సంబంధం లేకుండా అన్ని సినిమాలూ ఓ రౌండ్ వేసేసి.. ఇక తాను సినిమాల్లోకి వెళ్లిపోవాలని ఫిక్స్ అయ్యాడు.. దీనికోసం తానే ఓ మార్గం చూసుకున్నాడు.. షార్ట్ ఫిల్మ్‌లు చేస్తే.. సినిమాల్లోకి షార్ట్ రూట్ దొరుకుతుందని.. వాటిని తీయడం మొదలుపెట్టాడు.. క్యాంపస్, కార్ షెడ్డు, టీ స్టాల్, చుట్టుపక్కల స్ట్రీట్స్ ఇవే లొకేషనన్లు.. పాత హ్యాండీకామ్‌లు, మొబైల్ ఫోన్లే ఎక్విప్‌మెంట్‌లు.. కొన్ని షార్ట్‌ఫిల్ములు తీసి.. చివరకు ఇంట్లో వెళ్లి చెప్పేశాడు..

బంగారం తాకట్టు పెట్టి హ్యాండికామ్ కొనిచ్చిన అమ్మ
సినిమాల్లోకి వెళ్తానంటే.. అన్నీ కుటుంబాల్లో వెంటేనే ప్రోత్సాహం రాదు.. కానీ.. సుజీత్ ఫ్యామిలీ అతన్ని బాగా ఎంకరేజ్ చేశారు. షార్ట్ ఫిల్మ్‌లు తీయడానికి మంచి కెమెరా కావాలనుకుంటే.. సుజీత్ వాళ్ల అమ్మ.. తన బంగారం తాకట్టు పెట్టి… మరీ తన కుమారుడుకి కెమెరా కొనిపెట్టారు. అలా సినిమాల్లోకి రాకముందే ౩౦ షార్ట్ ఫిల్మ్‌లు పూర్తి చేశాడు ఆ షార్ట్ ఫిల్మ్‌లే అతన్ని ప్రభాస్ వరకూ తీసుకెళ్లాయి.
రైలు పట్టాల మీద షూట్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు
సుజిత్‌కు వీడియో మేకింగ్, టేకింగ్ అంటే ప్రాణం.. ఓ సారి ఓ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ చేస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఓ సారి రైలు పట్టాలపై నించుని షూట్ చేస్తున్నప్పుడు.. రైలు వస్తోంది. అయినా సీన్ పర్ఫెక్ట్ గా రావాలని రెండోసారి షూట్ చేస్తున్నాడు.. ఈలోగా ట్రైయిన్ సమీపంలోకి వచ్చింది కానీ... షూటింగ్‌లో ఇన్వాల్వ్ అయిపోయిన సుజీత్ ట్రెయిన్ గురించి పట్టించుకోలేదు. దాదాపుగా ట్రెయిన్ తన మీదకు వచ్చినంత పనైంది. లాస్ట్ మినిట్‌లో కిందకు దూకి ప్రాణాలు దక్కించుకున్నట్లు... అతనితో పాటు షూట్‌లో పాల్గొన్న అతని స్నేహితులు చెబుతారు.
హీరో అవ్వాలనుకుని.. కెమెరామెన్ కు అప్లై చేసి.. డైరక్టర్ అయ్యాడు.
సుజీత్ హీరో అవ్వాలనుకుని ఇండస్ట్రీకి వద్దామనుకున్నాడు. అయితే చేసిన షార్ట్ ఫిల్మ్స్ కొన్నింటిలో తనే నటించాడు. వాటిలో తన పెర్ఫార్మెన్స్ చూసి.. తనకు యాక్టింగ్ స్కిల్స్ కంటే.. టెక్నికల్ స్కిల్స్ ఎక్కువుగా ఉన్నాయనుకున్నాడు అంట..! చెన్నైలోని ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ ఇనిస్ట్టిట్యూట్‌లో కెమెరామెన్ కోర్స్‌కు అప్లై చేస్తే.. మొన్న MIRAI సినిమా తీసిన.. అప్పట్లో DOPగా ఉన్న కార్తీక్ ఘట్టమనేని.. సుజీత్ అప్లికేషన్‌లో 'డైరక్టర్' అని రాశాడు.. అలా చెన్నైలోని LV ప్రసాద్ అకాడమీలో చేరిపోయాడు.. “నేను ఎలాగూ హిట్ సినిమా తీస్తా.. మీరు చాన్స్ ఇస్తే.. ఈ ఇనిస్టిట్యూట్‌లో చదువుకుని హిట్ తీశా అని చెబుతా… ఇవ్వకపోతే… ఈ ఇనిస్టిట్యూట్ రిజెక్ట్ చేసింది.. అయినా హిట్ సినిమా తీశా అని చెబుతా..” అని చెప్పి మరీ అక్కడ జాయిన్ అవ్వడం.. అతని కాన్ఫిడెన్స్ లెవల్‌ను చాటుతుంది.

ప్రభాస్ దృష్టిలో పడి..
ఇండియన్ సినిమా అంతకు ముందెన్నడూ చూడనటువుంటి గ్రాండియర్ బాహుబలి ఇచ్చిన తర్వాత.. ప్రభాస్‌తో సినిమా అంటే.. అప్పటికే ఇండియాలో ఉన్న టాప్ డైరక్టర్లు అందరూ లైన్‌లో ఉంటారు. కానీ ప్రభాస్ ఓ పాతికేళ్ల కుర్రాడిని నమ్మారు. అతనిపై 350కోట్ల పెట్టుబడి పెట్టారు. అన్నీ చూస్తే.. అతను అప్పటికి తీసింది రన్ రాజా రన్ అనే ఓ చిన్న సినిమా.. ఆ సినిమా డీసెంట్ హిట్ కానీ.. ప్రభాస్ లాంటి బాహుబలితో 350కోట్లు ఖర్చు పెట్టి తీయగలిగేంత కెపాసిటీ ఉందా అన్న అనుమానాలు అందరిలో వచ్చాయి. కానీ బాలీవుడ్, హాలీవుడ్‌లోని టాప్ టెక్నీషియన్లను హ్యాండిల్ చేసి.. ‘సాహో’ (Saaho) అనిపించుకున్నాడు.. సుజీత్. సాహో మీద మిక్స్‌డ్ ఒపీనియన్స్ ఉండొచ్చు కానీ..దాని అవుట్‌పుట్ మాత్రం అదరహో అనే రేంజ్‌లో ఉంది. అసలు ఎవరూ నమ్మకపోయినా.. ప్రభాస్ లాంటి వ్యక్తి.. అతన్ని నమ్మడానికి కారణం అతని టాలెంటే. సుజీత్ మొదటి సినిమా కూడా తీయకముందే.. ప్రభాస్ అతని షార్ట్ ఫిల్మ్స్ చూసి.. అతనికి చాన్స్ ఇవ్వాలనుకున్నాడు. తన స్నేహితులైన UV క్రియేషన్స్ వాళ్లతో సినిమాలు తీయించారు.

షారూఖ్ 11 హగ్గులిచ్చాడు..
ఒక్క సినిమా కూడా పూర్తికాకముందే సుజీత్ ప్రతిభ బాలీవుడ్‌కు పాకిపోయింది. సాహో సినిమా రిలీజ్ కాకముందే.. ఆ సినిమా టీజర్ చాలామందిని షాక్‌కు గురిచేసింది. టీజర్ రిలీజ్ అయిన వెంటనే.. షారూఖ్ నుంచి సుజీత్‌కు ఫోనొచ్చింది. "ప్రభాస్ పక్కన ఉండగానే షారూఖ్ నుంచి ఫోన్ వచ్చిందని.. ఓ సూపర్ స్టార్ పక్కన ఉండగా.. మరో సూపర్ స్టార్ కాల్ చేసి కలుద్దామని చెప్పారంటూ.. తన క్లౌడ్ 9 మూమెంట్‌ను" సుజీత్ ఓ ఇంటర్వూలో షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత.. సుజీత్ షారూఖ్ ఇళ్లు.. Mannatలో ఆయన్ను కలిశాడు.. కొద్దిసేపు అనుకున్న మీటింగ్ 4 గంటలు జరిగిందని... సినిమా మేకింగ్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నామని.. ఆ సమయంలో షారూఖ్ తనకు 11 హగ్గులు ఇచ్చాడంటూ.. సుజీత్ చెప్పాడు..

పవర్ స్టార్మ్ – Power Storm
సాహో సినిమా టాక్ ఎలా ఉన్నా .. ప్రొడ్యూసర్లకు లాభాలైతే తెచ్చింది. అయితే ఆ సినిమా మీద నెగటివ్ టాక్ సుజీత్‌ను ఎఫెక్ట్ చేయలేదు. కథ సరిగ్గా జనాలకు ఎక్కలేదు అనుకున్నారు కానీ.. సుజీత్ ఫెయిల్ అన్నట్లుగా చెప్పలేదు. సుజీత్ కూడా తనకొచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనుకోలేదు. తనకు ఎన్నో ఆఫర్లున్నా... సినిమా చేయలేదు. దాదాపు రెండేళ్లు ఖాళీగా ఉన్న సుజీత్‌కు ఓ పవర్ స్టార్మ్ తగిలింది. త్రివిక్రమ్ సలహాతో సుజీత్‌తో మూవీకి పవన్ కల్యాణ్ రెడీ అయ్యారు. ఆ సినిమా స్టార్ట్ చేయడానికి మందు నుంచీ.. సుజీత్ బిల్డప్ చేసిన విధానం.. ఫ్యాన్స్ కు పిచ్చెక్కిచ్చింది. సుజీత్ సినిమా లవర్ మాత్రమే కాదు.. పవన్ కల్యాణ్ వీరాభిమాని.. పవన్ కల్యాణ్ సినిమాలకు వెళ్లి ఓ ఫ్యాన్‌బోయ్‌గా సుజీత్ రచ్చ చేసిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉంటాయి. అలాంటోడు.. సినమా మొదలుపెట్టడం.. పవన్ కల్యాణ్‌కు బాగా సెట్ అయ్యే.. గ్యాంగ్ స్టర్, మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ ఎంచుకోవడం.. దీంతో సినిమా అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. సుజిత్ ఈ సినిమా మీద ఎంత ఎఫర్ట్ పెట్టాడో పవన్ కల్యాణ్ లుక్స్, OJas సాంగ్, ట్రయిలర్ చూస్తేనే అర్థం అయిపోతుంది. రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఇప్పటికే ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు ఈ మూవీని.. ఇక రిజల్ట్ కూడా ఆ రేంజ్‌లో ఉంటే.. పవన్ కల్యాణ్ బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. దానిని ఎగ్జిక్యూట్ చేసిన సుజిత్ పేరు మారుమోగుతుంది.

పదేళ్లలో కేవలం మూడంటే మూడు సినిమాలతో ఈ క్రేజ్ సంపాదించిన డైరక్టర్ ఇంకొకరు లేరు. ఎన్నో సినిమాలు చేసి ఏదోదో చేయాలన్న ఆతృత కూడా సుజీత్‌కు లేదు. ఓ ఫ్లోలో వెళుతున్న సుజీత్ తర్వాత ఏం చేస్తాడో చూడాలి.





















