అన్వేషించండి

KTR News: రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్

Telangana News | ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం 26 రోజులపాటు ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రజాధనం వృథా చేస్తూ విజయోత్సవాలు చేయడంపై కేటీఆర్ మండిపడ్డారు.

Congress Praja Vijayotsavalu హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఒక ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సింది విజయోత్సవాలు కాదు.. “కుంభకోణాల కుంభమేళా” అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి పాతరేసిన సందర్భంగా కాంగ్రెస్ జరపాల్సింది విజయోత్సవాలు కాదు.. ప్రజావంచన వారోత్సవాలు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.

కరప్షన్ కార్నివాల్ చేసుకోవాలని కేటీఆర్ సూచన

ఎనుముల (రేవంత్ రెడ్డి) వారి ఏడాది పాలనలో చెప్పుకోవడానికి ఏమున్నది గర్వకారణం.. మూసీ (Musi Project)లో లక్షన్నర కోట్ల మూటల వేట..! కొడంగల్ లిఫ్టులో వేల కోట్ల కాసుల వేట..!! బావమరిదికి అమృత్ టెండర్లను, కొడుకులకు వేలకోట్ల కాంట్రాక్టులను కట్టబెట్టే ముఖ్యమంత్రి, మంత్రులు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు.. “కరప్షన్ కార్నివాల్” అని కేటీఆర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

ఏడాది నుంచి ప్రతిరోజూ పరిపాలనా వైఫల్యాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ సర్కారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో సంక్షోభం తప్ప సంతోషం లేని సందర్భాలకు చిరునామా సీఎం రేవంత్ రెడ్డి పాలన. ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ నేతలు విజయోత్సవాలు నిర్వహిస్తారు. ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీల్లో ఒక్క వాగ్దానం కూడా సరిగ్గా అమలుచేయలేదు మరి ప్రజా ధనంతో 25 రోజులపాటు జల్సాలు చేసుకుంటారా ? అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.

వందల కోట్లతో విజయోత్సవాలు చేసుకుంటారా?

రుణమాఫీ కాక, పెట్టుబడి సాయం అందక పేద రైతులు దుఖంలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మీరు వందల కోట్లతో విజయోత్సవాలు చేసుకుంటారా? హైడ్రా (Hydra Demolitions), మూసీ బాధితులు బాధలో ఉంటే మీరు బాజాభజంత్రీలతో పండుగ ఎలా చేసుకుంటారు? ఆడబిడ్డలు రక్షణ లేక అల్లాడుతుంటే కాంగ్రెస్ నేతలు విజయోత్సవాల పేరిట విర్రవీగుతారా? వృద్ధులు పింఛన్ల (Pension Hike) పెంపు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటే మీరు దయలేకుండా దావత్ లు చేసుకోవడం భావ్యమేనా అని కేటీఆర్ నిలదీశారు.

బీఆర్ఎస్ (BRS Government) భర్తీ చేసిన ఉద్యోగాల ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకోవడం నయవంచన కాదా ? పావుశాతం కూడా రుణమాఫీ పూర్తిచేయకుండా 100 శాతం చేశామని చెప్పుకోవడం దగా కాదా ? 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కే సిలిండర్ పథకాలకు ఆంక్షలు పెట్టి మెజారిటీ అర్హులను దూరం చేయడం మోసం కాదా ? అని కేటీఆర్ అడిగారు.

Also Read: TG Praja Vijayotsavalu: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌కు ఏడాది! - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తొలి ప్రభుత్వం, ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఇదే

75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో అతితక్కువ సమయంలో అత్యధిక ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న తొలి, ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ సర్కారే. ఈ ముఖ్యమంత్రి రేవంత్ కు పాలనపై పట్టు కాదు.. ఈ ప్రభుత్వానికి తెలంగాణపై ప్రేమలేదు. పేదల ఇళ్లు కూల్చి రోడ్డున పడేసిన కాంగ్రెస్ సర్కారుకు మనసే లేకపోగా, ఈ ప్రజా విజయోత్సవాలు అంటే ఏంటో కూడా తెలియని ఈ అసమర్థ పాలకులకు ఆ పదాన్ని వాడే హక్కే లేదు’ అని కేటీఆర్ ఎక్స్ ఖాతాలో తన పోస్టులో పేర్కొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
Pushpa 2: ‘పుష్ప 2’ నా కోసం వెయిటింగ్ - అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసిన థమన్!
‘పుష్ప 2’ నా కోసం వెయిటింగ్ - అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసిన థమన్!
Ministry of Sex: రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
Pushpa 2: ‘పుష్ప 2’ నా కోసం వెయిటింగ్ - అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసిన థమన్!
‘పుష్ప 2’ నా కోసం వెయిటింగ్ - అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసిన థమన్!
Ministry of Sex: రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
KCR: త్వరలో ప్రజల్లోకి కేసీఆర్- మొదట కాంగ్రెస్ ప్రభుత్వ బాధితుల వద్దకే !?
త్వరలో ప్రజల్లోకి కేసీఆర్- మొదట కాంగ్రెస్ ప్రభుత్వ బాధితుల వద్దకే !?
Delhi Ganesh: తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
Tiger Tension: రెండు రాష్ట్రాల ప్రజల్ని వణికిస్తున్న పులి, సాయంత్రం నుంచి ఒంటరిగా వెళ్లవద్దని ప్రజలకు సూచనలు
Tiger Tension: రెండు రాష్ట్రాల ప్రజల్ని వణికిస్తున్న పులి, సాయంత్రం నుంచి ఒంటరిగా వెళ్లవద్దని ప్రజలకు సూచనలు
Jagan vs Lokesh: నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్
నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్
Embed widget