TG Praja Vijayotsavalu: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌కు ఏడాది! - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana News | నవంబర్ 14 నుంచి 26 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ప్రారంభించాలని నిర్ణయించారు.
Congress Government to be held Praja Vijayotsavalu | హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై పదకొండు నెలలు పూర్తయి ఏడాది దిశగా అడుగులు పడుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు (Praja Vijayotsavalu) నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
26 రోజులపాటు పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి అవుతున్నందున ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని భట్టి విక్రమార్క తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ శనివారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు
గత పది నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఊహకందని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, విప్లవాత్మక నిర్ణయాలు అములు చేసిందన్నారు. అందుకుగాను తెలంగాణ వ్యాప్తంగా ప్రజా విజయోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని సచివాలయంలో ర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చించారు. ప్రజా ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, తీసుకున్న నిర్ణయాలు, చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు.
రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి అవుతున్నందున ఈ నెల 14 వ తేదీ నుండి డిసెంబర్ 9 వ తేదీ వరకు 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) November 9, 2024
గత పది నెలల్లో ముఖ్యమంత్రి @revanth_anumula గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం… pic.twitter.com/raA4UxZ3Ru
నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా వేడుకలు ప్రారంభం
భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు పుట్టినరోజు (Nehru Jayanti) సందర్భంగా నవంబర్ 14న ప్రజా విజయోత్సవాలను ప్రారంభిస్తున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా విజయోత్సవాల ముగింపు రోజైన డిసెంబర్ 9 న హైదరాబాద్ లో భారీ సంఖ్యలో కళాకారులతో ప్రదర్శనలు, ప్రత్యేక లేజర్ షో లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆరు గ్యారంటీలు సహా పథకాల అమలుపై ప్రజల్లోకి
తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన ఆరు గ్యారంటీలతో పాటు ఇప్పటివరకూ అమలు చేసిన ఇతర హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, 200 యూనిట్లలోపు ఉచిత కరెంట్, ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు, ఆర్టీసీలో బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం లాంటి విషయాలను ముఖ్యంగా ప్రస్తావించనున్నారు. వీటితో పాటు ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని యువతకు తెలియజెప్పనున్నారు. గత ప్రభుత్వంలో పెండింగ్ లో పెట్టిన ఉద్యోగాల భర్తీని తమ ప్రభుత్వం తక్కువ కాలంలోనే సమస్యలు క్లియర్ చేసి సెలక్ట్ అయిన వారికి నియామక పత్రాలు అందించినట్లు ప్రచారం చేయనున్నారు.
Also Read: KTR News: నిధులు అడిగితే ఎమ్మెల్యేపై దాడి చేస్తారా! ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? కేటీఆర్, హరీష్ రావు ఫైర్