అన్వేషించండి

Revanth Reddy: ఆరు దశాబ్దాల తరువాత పాలమూరు బిడ్డ సీఎం అయ్యాడు - కురుమూర్తి సభలో రేవంత్ రెడ్డి

Kurumurthy Swamy Temple | హైదరాబాద్ కు బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా సేవలు అందించగా.. ఆరు దశాబ్దాల తరువాత మరో పాలమూరు బిడ్డ తెలంగాణ సీఎం అయ్యాడని కురుమూర్తి సభలో రేవంత్ రెడ్డి అన్నారు.

Revanth Reddy visits Kurumurthy Temple in Mahabubnagar District | మహబూబ్‌నగర్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంటమండలం అమ్మాపురంలోని కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. కింద నుంచి కురుమూర్తి గుట్టపైకి ఘాట్ రోడ్డు పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల కిందట పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఇన్నాళ్లకు పాలమూరు బిడ్డనైన నాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది. లక్షలాది పాలమూరు బిడ్డల ఆశీర్వాదం, కురుమూర్తి స్వామి ఆశీస్సులతో సీఎం అయ్యాను.

వారి ఇబ్బందులు చూడలేక ఈ నిర్ణయం తీసుకున్నాం..

తిరుపతిని దర్శించుకోలేనివాళ్లు కురుమూర్తి బ్రహ్మోత్సవాలు, కురుమూర్తి జాతరకు వచ్చి స్వామివారిని దర్శించుకునే తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నట్లే. జిల్లాతో పాటు ఇతర జిల్లాలు, సరిహద్దు రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి కురుమూర్తి స్వామివారిని దర్శించుకుంటారు. చిన్నపిల్లలు, అంగవైకల్యం ఉన్నవారు, వయో వృద్ధులు గుట్టమీదకు ఎక్కలేక ఇబ్బందులు పడుతున్నారని జిల్లా బిడ్డగా ఘాట్ రోడ్డు నిర్మాణం చేపడుతున్న. కురుమూర్తి స్వామి ఆలయం, మన్నెం కొండ జాతరకు అవసరమైన అభివృద్ధి పనులు, అందుకయ్యే నిధుల వివరాల నివేదికను సమర్పించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశిస్తున్నాను. 

తెలంగాణ సాధనలో కేసీఆర్ భాగస్వామ్యం ఉంది

ఉమ్మడి ఏపీలో అయినా, తెలంగాణ రాష్ట్రంలో అయినా మహబూబ్ నగర్ ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా ప్రాజెక్టులు పూర్తికాకపోవడానికి గత బీఆర్ఎస్ పాలకులే కారణం. 2009లో కేసీఆర్ కరీంనగర్ నుంచి పాలమూరుకు వలస వస్తే మన జిల్లా బాగుపడుతుందని అక్కున చేర్చుకున్నాం. ఆయనను గెలిపించి పార్లమెంట్ కు పంపించాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్లమెంట్ లో కేసీఆర్ భాగస్వామ్యం ఉంది. కానీ కేసీఆర్ రెండు పర్యాయాలు సీఎంగా చేసినా జిల్లాకు పరిశ్రమలు రాలేదు.

పెండింగ్ ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, జూరాల, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల ఇలా ఏదీ పూర్తి చేయలేదు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు అని చెప్పిన మాటలు మాకు ఆదర్శం. జిల్లా పచ్చని పంటలతో విలసిల్లాలంటే, ప్రాజెక్టులు పూర్తి కావాలి. ప్రతినెలా ప్రాజెక్టులపై సమీక్షలు చేస్తాం. మక్తల్, నారాయణపేట, కోడంగల్ ప్రాంతానికి త్వరలోనే కృష్ణా జలాలను తీసుకొచ్చి భూములు తడుపుతాం. పాలమూరుకు ప్రాజెక్టులు కేటాయించి, నిధులు ఇస్తామంటే కొందరు వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: Revanth Reddy: కురుమూర్తి స్వామిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి- ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన

పాలమూరు వాసిగా, నల్లమల ప్రాంతం నుంచి సీఎం అయిన నేను జిల్లాకు నిధులు కేటాయించి, ప్రాజెక్టులు పూర్తి చేయాలని కురుమూర్తి స్వామి సాక్షిగా చెబుతున్న. ఈ పనులను అడ్డుకుంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఇక్కడి నుంచి మిమ్మల్ని పార్లమెంట్ కు పంపిన మహబూబ్ నగర్ ప్రజల అభివృద్ధిని అడ్డుకోవడం భావ్యం కాదు. మీ జిల్లాలు, మీ నియోజకవర్గాలు అభివృద్ది చేసుకుంటే మేమెప్పుడూ అడ్డుకోలేదు. 12 అసెంబ్లీ, ఒక్క ఎంపీ స్థానం, సీఎం సీటు ఇచ్చిన ప్రజల రుణం తీర్చుకుంటాం. జిల్లాల్లో రోడ్లు, నీటి పారుదల సౌకర్యం కల్పిస్తాం. పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించనున్నాం. అమరరాజా బ్యాటరీ కంపెనీ ఏర్పాటు చేసి మా పాలమూరు వారికి అవకాశం ఇవ్వాలని కోరితే వారు అంగీకరించారు. ఓ పక్క సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి, మరోవైపు పరిశ్రమలు ఏర్పాటు చేసుకుందాం. ప్రతి గ్రామాలకు, తండాలకు రోడ్లు వేయాలని నిర్ణయం తీసుకున్నాం. పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ అధికారులు పాలమూరు కేంద్రంగా చర్చలు జరిపి రోడ్లు వేయడంపై నివేదిక తయారు చేయాలి’ అని రేవంత్ రెడ్డి జిల్లా ఇంఛార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహకు సూచించారు.

తిరుపతికి వెళ్లలేక కురుమూర్తి జాతరకు భక్తులు

పాలమూరు ముద్దుబిడ్డ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిత్యం ప్రజల కోసం ఆలోచన చేస్తుంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పాలమూరు జిల్లా వెనకబడిన జిల్లా, కూలీనాలీ చేసుకునే వారు తిరుపతికి వెళ్లడం అంటే ఖర్చుతో కూడుకున్న పని అనుకుంటారు. దాంతో కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులు కురుమూర్తి స్వామి వారిని దర్శించుకుని తరిస్తారని చెప్పారు. 2009లో ఇంఛార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు కురుమూర్తి ఆలయం వద్ద ఘాట్ రోడ్డు అవసరమని చెప్పానన్నారు. కానీ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం, ఇతర కారణాలతో ఆ పని వాయిదా పడింది. నేడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రూ.110 కోట్ల నిధులు కేటాయించి, ఆ పనులు ప్రారంభించారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.


Revanth Reddy: ఆరు దశాబ్దాల తరువాత పాలమూరు బిడ్డ సీఎం అయ్యాడు - కురుమూర్తి సభలో రేవంత్ రెడ్డి

పేదల తిరుపతిగా కురుమూర్తి

వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. పవిత్ర క్షేత్రం, పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి వారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తాను. కార్తీక మాసంలో భక్తులు కురుమూర్తి స్వామి వారిని దర్శించుకుంటారు. భవిష్యత్తులో ఈ క్షేత్రం మరింతగా అభివృద్ధి చెందుతుంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిధులు కేటాయించాం. రూ.110 కోట్లతో కురుమూర్తి గుట్టపైకి ఘాట్ రోడ్డు పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారన్నారు.

Also Read: KTR News: రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: ఆరు దశాబ్దాల తరువాత పాలమూరు బిడ్డ సీఎం అయ్యాడు - కురుమూర్తి సభలో రేవంత్ రెడ్డి
ఆరు దశాబ్దాల తరువాత పాలమూరు బిడ్డ సీఎం అయ్యాడు - కురుమూర్తి సభలో రేవంత్ రెడ్డి
NBK Allu Arjun: ‘పుష్ప 3’లో బాలయ్య, ‘అఖండ 3’లో బన్నీ - అన్‌స్టాపబుల్‌కు అల్లు అర్జున్ - ప్రోమో వచ్చేసింది!
‘పుష్ప 3’లో బాలయ్య, ‘అఖండ 3’లో బన్నీ - అన్‌స్టాపబుల్‌కు అల్లు అర్జున్ - ప్రోమో వచ్చేసింది!
Group 3 Hall Tickets: తెలంగాణలో గ్రూప్‌ 3 ఎగ్జామ్ హాల్‌ టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్‌ 3 ఎగ్జామ్ హాల్‌ టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్
KTR News: రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బన్నీకి బాలయ్య సర్‌ప్రైజ్, అస్సలు ఊహించలేదట!అమ్మో! ఇళ్ల పక్కనే పెద్దపులి! గజగజ వణికిపోతున్న జనంనడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: ఆరు దశాబ్దాల తరువాత పాలమూరు బిడ్డ సీఎం అయ్యాడు - కురుమూర్తి సభలో రేవంత్ రెడ్డి
ఆరు దశాబ్దాల తరువాత పాలమూరు బిడ్డ సీఎం అయ్యాడు - కురుమూర్తి సభలో రేవంత్ రెడ్డి
NBK Allu Arjun: ‘పుష్ప 3’లో బాలయ్య, ‘అఖండ 3’లో బన్నీ - అన్‌స్టాపబుల్‌కు అల్లు అర్జున్ - ప్రోమో వచ్చేసింది!
‘పుష్ప 3’లో బాలయ్య, ‘అఖండ 3’లో బన్నీ - అన్‌స్టాపబుల్‌కు అల్లు అర్జున్ - ప్రోమో వచ్చేసింది!
Group 3 Hall Tickets: తెలంగాణలో గ్రూప్‌ 3 ఎగ్జామ్ హాల్‌ టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్‌ 3 ఎగ్జామ్ హాల్‌ టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్
KTR News: రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
Kiara Advani: 'గేమ్ చేంజర్' టీజర్ లాంచ్‌లో కియారా - అరెరే ఏముందిరా!?
'గేమ్ చేంజర్' టీజర్ లాంచ్‌లో కియారా - అరెరే ఏముందిరా!?
Pushpa 2: ‘పుష్ప 2’ నా కోసం వెయిటింగ్ - అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసిన థమన్!
‘పుష్ప 2’ నా కోసం వెయిటింగ్ - అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసిన థమన్!
Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
Ministry of Sex: రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
Embed widget