Annamayya District: 'నా బిడ్డది ఆత్మహత్య చేసుకునే వయసా?' - ఓ కన్నతల్లి ఆవేదన, అన్నమయ్య జిల్లాలో విషాద ఘటన
Crime News: అన్నమయ్య జిల్లా గ్యారంపల్లిలోని గురుకుల పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థి టవల్‌తో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లి, బంధువులు పాఠశాలకు చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు.
Fifth Class Student Forceful Death In Annamayya District: అన్నమయ్య జిల్లాలో (Annamayya District) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పీలేరు నియోజకవర్గం కేవీపల్లి మండలంలోని గ్యారంపల్లిలో ఏపీఆర్ రెసిడెన్సీ స్కూల్‌లో ఐదో తరగతి విద్యార్థి రెడ్డిమోక్షిత్ (10) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం 6 గంటలకు రోల్‌కాల్‌కు పిలవగా మోక్షిత్ హాజరై తర్వాత డార్మెటరీలో తన బెడ్ వద్ద టవల్‌తో ఉరేసుకున్నాడు. విద్యార్థిని గమనించిన టీచర్లు వెంటనే హాస్టల్ వార్డెన్‌తో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే విద్యార్థి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లి, కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. టీచర్లు, హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాతృ వేదన
ఘటనా స్థలంలో తల్లి వేదనతో కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు అందరినీ తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఇంత మంది టీచర్లు ఉండి తన బిడ్డను పట్టించుకోలేకపోయారని కన్నీటి పర్యంతమయ్యారు. నా బిడ్డది ఉరేసుకునే వయసు కాదని వాపోయింది. అటు, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Crime News: తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు - ఇద్దరి ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం