అన్వేషించండి

Crime News: తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు - ఇద్దరి ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం

Brutal Murder: తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు చోటు చేసుకున్నాయి. వివాహేతర సంబంధంతో వచ్చిన వివాదాలు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి.

Brutal Murders In Telugu States Due To Extramarital Affair: తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు చోటు చేసుకున్నాయి. వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది. ఏపీలోని గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి మహిళతో అక్రమ సంబంధం కారణంగా ఏర్పడిన వివాదంతో దారుణహత్యకు గురయ్యాడు. అటు, తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో తనయుడి వివాహేతర సంబంధం అతని తండ్రి హత్యకు దారి తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా (Guntur District) పొన్నూరు మండల పరిధిలోని ములుకుదురు గ్రామంలో దారుణం జరిగింది. మండల పరిధిలోని మాచవరం గ్రామానికి చెందిన నక్కల దేవరాజ్ (34) విద్యుత్ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ములుకుదురుకి చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే, సదరు మహిళ అదే గ్రామానికి చెందిన మాధవ్ అనే వ్యక్తితోనూ అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలోనే దేవరాజ్, మాధవ్ మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి.

ఇనుప రాడ్‌తో కొట్టి..

ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున మాధవ్ కొంతమంది యువకులతో కలిసి దేవరాజ్‌పై ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన దేవరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని గ్రామ శివారులోని ఓ మద్యం దుకాణం వద్ద పడేశారు. ఉదయం స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, తమకు న్యాయం చేయాలంటూ దేవరాజ్ కుటుంబ సభ్యులు బాపట్ల - గుంటూరు ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో రాకపోకలు స్తంభించాయి. తెనాలి డీఎస్పీ జనార్ధన్‌రావు వారితో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. కాగా, మృతుడికి ఇప్పటికే వివాహం అయినట్లు తెలుస్తోంది.

తనయుడు వివాహేతర సంబంధంతో..

అటు, తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో (Mancherial District) ఘోరం జరిగింది. తనయుడి వివాహేతర బంధం అతని తండ్రి హత్యకు దారి తీసింది. ఈ ఘటన చెన్నూరు మండలంలోని ముత్తరావుపల్లిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తరావుపల్లి గ్రామానికి చెందిన పైడిపెల్లి మల్లయ్య(50) అదే గ్రామానికి చెందిన జాడి భూమయ్య చేతిలో హత్యకు గురయ్యాడు. మృతుడి కుమారుడు రాజశేఖర్ భూమయ్య భార్యను 7 నెలల క్రితం మరో ప్రాంతానికి తీసుకెళ్లి సహజీవనం చేస్తున్నాడు. దీంతో భూమయ్య తన భార్య కనబడటం లేదని ఫిర్యాదు చేయగా... పోలీసులు కేసు నమోదు చేశారు.

వివిధ ప్రాంతాల్లో గాలించి వారిద్దరిని పట్టుకొని తీసుకొచ్చి కౌన్సిలింగ్ నిర్వహించారు. అయితే, ఆమె తన భర్తతో ఉండేందుకు నిరాకరించి తిరిగి ప్రియుడితోనే వెళ్లిపోయింది. అప్పటి నుంచి మల్లయ్య కుటుంబంపై భూమయ్య కక్ష పెంచుకున్నాడు. శనివారం గ్రామ సమీపంలోని వాగు వైపు మల్లయ్య బహిర్భూమికి వెళ్లగా భూమయ్య తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. అటువైపు వెళ్లిన గ్రామస్థులకు మల్లయ్య మృతదేహం కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తనపై కోపంతోనే తన తండ్రిని హత్య చేశాడని మృతుడి కుమారుడు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీందర్ తెలిపారు.

Also Read: Crime News: తెలంగాణలో తీవ్ర విషాదాలు - చెరువులో దూకి ఇద్దరు పిల్లలు సహా తండ్రి ఆత్మహత్య, రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget