Hyderabad News: ప్రేమ వివాహానికి అడ్డొస్తున్నాడని ప్రియురాలి తండ్రిపై కాల్పులు - హైదరాబాద్‌లో ఘటన
Crime News: హైదరాబాద్ సరూర్‌నగర్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. తన ప్రేమ వివాహానికి అడ్డొస్తున్నాడని యువతి తండ్రిపై యువకుడు కాల్పులకు తెగబడ్డాడు.
![Hyderabad News: ప్రేమ వివాహానికి అడ్డొస్తున్నాడని ప్రియురాలి తండ్రిపై కాల్పులు - హైదరాబాద్‌లో ఘటన young man firing on girl friend father in hyderabad Hyderabad News: ప్రేమ వివాహానికి అడ్డొస్తున్నాడని ప్రియురాలి తండ్రిపై కాల్పులు - హైదరాబాద్‌లో ఘటన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/10/9fbc6cfe528a7748c3590dbde6273b521731247470026876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Young Man Firing On Girl Friend Father In Hyderabad: హైదరాబాద్‌లో (Hyderabad) దారుణం జరిగింది. తన ప్రేమ వివాహానికి అడ్డు వస్తున్నాడని యువతి తండ్రిపైనే ఓ యువకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన నగరంలోని సరూర్‌నగర్ (Saroor Nagar) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేటకు చెందిన బల్వీందర్‌సింగ్ (25), సరూర్‌నగర్ పీఎస్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన ఓ యువతి (23) కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో యువతిని ఆమె తండ్రి ఇటీవలే అమెరికా పంపించేశారు.
ఈ క్రమంలో ఆదివారం యువతి ఇంటికి వచ్చిన బల్వీందర్‌సింగ్.. యువతి తండ్రి రేవంత్ ఆనంద్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు తన వెంట తెచ్చుకున్న ఎయిర్‌గన్‌తో రేవంత్ ఆనంద్‌పై ఓ రౌండ్ కాల్పులు జరిపాడు. యువతి తండ్రి కంట్లో నుంచి తూటా దూసుకెళ్లడంతో తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ నిందితుడిని యువతి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Crime News: తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు - ఇద్దరి ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)