అన్వేషించండి

Pawan Kalyan: సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్

Andhra News: డిప్యూటీ సీఎం పవన్ మీడియా ప్రతినిధులకు క్లాస్ తీసుకున్నారు. సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే కనీసం పట్టించుకోవడం లేదని.. స్పృహ ఇక్కడి నుంచే రావాలని అన్నారు.

Deputy CM Pawan Class To Journalists: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గుంటూరులో ఆదివారం నిర్వహించిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తున్న సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ మీడియా ప్రతినిధి రాష్ట్రంలో మహిళలపై దాడుల విషయం ప్రస్తావించారు. ఆడబిడ్డల ఆత్మరక్షణకు బాలికలకు స్కూల్ స్థాయి నుంచే సెల్ఫ్ ప్రొటక్షన్ శిక్షణ వంటి అంశాలను పరిశీలిస్తారా.? అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన పవన్.. ముందు మారాల్సింది మీరే అంటూ వారికి క్లాస్ తీసుకున్నారు. అక్కడి మీడియా ప్రతినిధుల్లో ఓ మహిళా విలేకరి సైతం ఉన్నారు. ఆమె పవన్ బైట్ తీసుకునేందుకు యత్నిస్తూ ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్నే పవన్ వారికి చెప్పారు. 'మీరు సెల్ఫ్ ప్రొటక్షన్ అంటున్నారు. మీరే ఉన్నారు ఇక్కడ. ఈ మహిళా విలేకరి ఇందాకటి నుంచి నలిగిపోతున్నారు. మీ సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరు ఆమె గురించి ఆలోచించడం లేదు. మీరు బైట్ తీసుకోవాలనుకుంటున్నారు తప్ప ఆమె ఇబ్బంది పడకుండా చూడాలని అనుకోవడం లేదు. ఫస్ట్ మన స్పృహ మనకు ఉండాలి.' అంటూ క్లాస్ తీసుకున్నారు.

'సామాజిక స్పృహ ఉండాలి'

అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు అధికారులకు ఎవరైనా వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని హెచ్చరించారు. తమ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని మభ్యపెట్టి పోలీస్ అధికారులతో ఘోర తప్పిదాలు చేయించారని మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 'ఆడబిడ్డలపై అఘాయిత్యాలు ఆగాలంటే మొదట మనందరికీ సామాజిక స్పృహ ఉండాలి. అన్యాయం జరిగితే ఆపాలన్న ఆలోచన సమాజానికి ఉండాలి. కళ్ల ముందు ఆడబిడ్డలను ఏడిపిస్తుంటే చోద్యం చూస్తుంటారు. ముందుగా ప్రజలు కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించాలి. నా కళ్ల ముందు ఏ ఆడబిడ్డకు ఇబ్బంది కలిగినా చూస్తూ ఊరుకోను. పోలీసులు కూడా.. ఫిర్యాదు చేసిన వారిని క్రిమినల్స్‌గా పరిగణించవద్దు. ప్రజలు కూడా నేరం మీద ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు మనల్ని ఇబ్బందిపెడతారు అన్న ఆలోచనల నుంచి బయటకు రావాలి. పది మంది వెళ్లి ఫిర్యాదు చేస్తే అలాంటి పరిస్థితులను నిలువరించవచ్చు.' అని పేర్కొన్నారు.

'క్రిమినల్స్‌కు కులమతాలు ఉండవు'

'ఎన్ని చట్టాలు తెచ్చినా వాటిని అమలు చేసే వ్యక్తుల్లో చిత్తశుద్ది లేకపోతే ఫలితం ఉండదు. నిర్భయ కేసు తర్వాత కూడా కోల్‌కతా ప్రభుత్వ ఆసుపత్రి వంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. చట్టాల అమలుకు ప్రజల నుంచి కూడా సహకారం అవసరం. సింగపూర్ తరహా శిక్షలు అమలు చేయాలి. ఏ కులమైనా, మతమైనా తప్పు చేస్తే శిక్షించి తీరాలని సీఎం, డీజీపీకి చెప్పాం. దీంతో పాటు ఆడబిడ్డల సంరక్షణలో ముందుగా చుట్టుపక్కల వారి పర్యవేక్షణ ఉండాలి. పూంచ్ సెక్టార్ మాదిరి విలేజ్ డిఫెన్స్ సిస్టం ఉండాలి. ప్రాంతాల వారీగా యువత, పెద్దల కలయికతో డిఫెన్స్ కమిటీలు రావాలి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. దీంతో పాటు విద్యార్ధినులకు విద్యాలయాల్లో నిరంతర స్వీయ రక్షణ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలి. డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం. పర్యావరణానికి నష్టం కలిగించేలా చేస్తా కఠిన చర్యలు తీసుకుంటాం.' అని పవన్ హెచ్చరించారు.

Also Read: Madanapalli News: ఆర్డీవో మురళీపై ప్రభుత్వం వేటు- ఆ కేసులో కాదు, అక్రమ ఆస్తుల కేసులో చర్యలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
KTR Comments on Pocharam: ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
KTR Comments on Pocharam: ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
Kadiyam Srihari: కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
Revanth Reddy: పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం కాంగ్రెస్ గెలుపు - క్రియాశీలక రాజకీయాల్లో లేని కేసీఆర్ - రేవంత్ కీలక వ్యాఖ్యలు
పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం కాంగ్రెస్ గెలుపు - క్రియాశీలక రాజకీయాల్లో లేని కేసీఆర్ - రేవంత్ కీలక వ్యాఖ్యలు
Embed widget