అన్వేషించండి

Morning Top News: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జలకు షాక్, జూబ్లీహిల్స్‌లో పేలుడు వంటి మార్నింగ్ న్యూస్

Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.

Morning Top News:

సజ్జలకు బిగ్ షాక్

వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డిపై పులివెందులలో కేసు నమోదైంది. ఓ దళిత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సజ్జల భార్గవ్‌రెడ్డితో పాటు మరో ఇద్దరిపై నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద పులివెందుల పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు

జూబ్లీహిల్స్ లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్న తెలంగాణ స్పైసీ కిచెన్‌ రెస్టారెంట్‌లో ఫ్రిజ్‌ కంప్రెసర్‌ పేలిపోయింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

ఆ వీరుడి కుటుంబాన్ని కలవనున్న పవన్
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను ముప్పుతిప్పలు పెట్టి అరెస్టు చేసిన తెలుగు తేజం, ఐఎఫ్ఎస్ అధికారి పందిళ్లపల్లి శ్రీనివాస్ వీరోచిత త్యాగం గురించి అందరికి తెలిసిందే. ఆయన కుటుంబ సభ్యులను ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు కలవనున్నారు. పందిళ్లపల్లి శ్రీనివాస్ ధాటికి తట్టుకోలేక లొంగిపోతానంటూ కబురు పంపి ఒంటరిగా వచ్చిన ఆయన్ను పాశవికంగా వీరప్పన్ హత్య చేశాడు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 

ముఖ్య మంత్రిపై  వైసీపీ అధినేత  ఆగ్రహం

దొంగే ఎదుటివారిని పట్టుకుని దొంగా అన్నట్టుగా చంద్రబాబు తీరు ఉందని, 40 ఏళ్లుగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతూ ఇప్పుడు అదే చేస్తున్నారంటూ వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ పాలిటిక్స్‌లో చంద్రబాబు మరింతగా బరితెగించారన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

దూసుకొస్తున్న అల్పపీడనం.. భారీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ఈరోజు రాత్రి లేదా రేపు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీంతో నేటి నుంచి మూడు రోజుల పాటు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మిగతా చోట్ల తేలికపాటి వర్షాలుల కురుస్తాయని పేర్కొంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధికి కమిటీ
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. తిరుమల తరహాలోనే శ్రీశైలం ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఆలయం సహా పరిసర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. నల్లమల అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని.. వీటన్నింటి కోసం మంత్రులు ఆనం రామనారాయణ, కందుల దుర్గేశ్, జనార్దన్‌లతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
ఆమె తెగువకు నామినేటెడ్ పదవి.. తెలుగు తమ్ముళ్ల హర్షం
ఏపీ ఎన్నికల పోలింగ్ రోజున పల్నాడులో చెలరేగిన హింసలో ఓ మహిళ సాహసం అందర్నీ ఆకర్షించింది. మాచర్ల నియోజకవర్గం రెంటచింతల్లో ఓ పోలింగ్ బూత్‌లో మంజులారెడ్డి టీడీపీ ఏజెంట్‌గా ఉన్నారు. వైసీపీ నేతలు బూత్‌ కు వెళ్తున్న మంజులపై దాడిచేసి గొడ్డలితో ఆమె తలపై వేటు వేశారు. తలపై గాయమైనా ఆమె వెనక్కి తగ్గలేదు. అప్పుడు ఆమె చూపిన తెగువకు ఇప్పుడు ఏపీ శిల్పారామం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
11న ఏపీ కేబినెట్‌ భేటీ
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 11వ తేదీన కేబినెట్ భేటీ కానుంది. ఆ రోజు ఉదయం 9 గంటలకు సీఎం ఛాంబర్‌లో ఈ సమావేశం జరగనుంది. ఇందులో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ప్రతిపాదనలను కేబినెట్‌ ఆమోదించనుంది. అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్.. శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
తెలంగాణ వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై పదకొండు నెలలు పూర్తయి ఏడాది దిశగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకోనున్న సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా 26 రోజులపాటు ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలను నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
వచ్చే ఎన్నికల్లో అధికారం మనదే: కేసీఆర్
వచ్చే ఎన్నికల్లో అధికారం మనదేనని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలకు నమ్మి ప్రజలు ఓట్లు వేశారని వచ్చే ఎన్నికల్లో విజయం మనదేనని బిఆర్ఎస్ నేతలతో కేసీఆర్ అన్నారు. అలాగే ప్రజల్లోకి వచ్చేందుకు గ్రౌండ్ వర్క్ రెడీ చేసుకుటున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌
రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ మొదటి ఈవీని పరిచయం చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ చేసిన ఈ మొదటి ఎలక్ట్రిక్ బైక్ పేరు ఫ్లయింగ్ ఫ్లీ ఎఫ్ఎఫ్-సీ6. ఈ మోటార్‌ బైక్ పూర్తిగా కొత్త బ్రాండింగ్‌తో భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది. రెట్రో డిజైన్‌తో వచ్చిన ఈ బైక్‌లో సర్క్యులర్ హెడ్‌ల్యాంప్, రియర్ వ్యూ మిర్రర్‌ అమర్చారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 KM కంటే ఎక్కువ రేంజ్ ఇవ్వగలదు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
కారుకు అంత్యక్రియలు.. ఎక్కడంటే?
18 ఏళ్లు తమ జీవితాల్లో ఒక భాగస్వామిగా ఉన్న ఓ లక్కీ కారుకు యజమానులు గ్రాండ్‌గా అంత్యక్రియలు నిర్వహించారు. గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాకు చెందిన సంజ‌య్ పోల్రా 2006లో మారుతి వ్యాగ‌నార్‌ కారు కొన్నాడు. ఆ కారుని కొన్నాకే ప్రాప్ట‌రీ బ్రోక‌ర్‌గా ఉన్న అతడు బిల్డర్ స్థాయికి ఎదిగినట్లు చెప్పారు. తాజాగా కారు షెడ్డుకు చేర‌డంతో మంత్రోచ్ఛార‌ణ‌ల మ‌ధ్య గొయ్యిలో పాతిపెట్టారు. ఇందుకోసం రూ.4లక్షలు ఖర్చు చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
 హిమాచల్ ప్రదేశ్‌లో సమోసా దొంగలపై విచారణలు

హిమచల్ ప్రదేశ్‌లో సీఎం కోసం తెచ్చిన సమోసాలు మిస్ అయ్యాయి.  అంతర్గత విచారణలో ఆ సమోసాలు సీఎం వరకూ రాలేదని.. ఆయన భద్రతా సిబ్బంది కోసం అనుకుని వారికి సర్వ్ చేయడంతో అయిపోయినట్లుగా గుర్తించారు. దీనిపై బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
Delhi Ganesh: తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
Jagan vs Lokesh: నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్
నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
Delhi Ganesh: తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
Jagan vs Lokesh: నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్
నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Prabhas: ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ డీల్ - ఆ మూడు సినిమాలకు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత?
ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ డీల్ - ఆ మూడు సినిమాలకు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత?
Viral News: సరదాగా మొదలుపెట్టి 2,500 కోర్సులు పూర్తి చేసిన శ్రీకాకుళం వాసి, త్వరలో గిన్నిస్ రికార్డ్స్‌లోకి
సరదాగా మొదలుపెట్టి 2,500 కోర్సులు పూర్తి చేసిన శ్రీకాకుళం వాసి, త్వరలో గిన్నిస్ రికార్డ్స్‌లోకి
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Embed widget