అన్వేషించండి
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు

Telugu_News_Today_-_2024-11-10T080848926
Source : ABP Desam
Hyderabad explosion at a restaurant in Jubilee hills | హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్న తెలంగాణ స్పైసీ కిచెన్ రెస్టారెంట్‌లో ఫ్రిజ్ కంప్రెసర్ పేలిపోయింది. ఈ పేలుడు ఘటనలో ప్రహరీ గోడ ధ్వంసం కాగా, రాళ్లు ఎగిరిపడి పక్కనే ఉన్న బస్తీలోని బాలికకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. అయితే ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు ఏం జరిగిందోనని భయభ్రాంతులకు గురయ్యారు.
(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్ కోసం రిఫ్రెష్ చేయండి)ఇంకా చదవండి





















