అన్వేషించండి

YS Jagan: దొంగే దొంగ అన్న‌ట్లు చంద్ర‌బాబు తీరు! జీవిత ఖైదు వేయాల్సింది ఎవరికి? వైఎస్ జగన్

Andhra Pradesh News | తన స్కాంలు బయటపడుతున్నాయని చంద్రబాబు ఎదుటివారి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.

YS Jagan fires on chandrababu over social media arrests in AP | అమరావతి: దొంగే ఎదుటివారిని పట్టుకుని దొంగా అన్నట్టుగా చంద్రబాబు తీరు ఉందని, 40 ఏళ్లుగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతూ ఇప్పుడు అదే చేస్తున్నారంటూ వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. తన స్కాంలు బయటపడుతున్నాయని, తాను చేసిన అవినీతి బయటకు వస్తోందని.. ఎదుటివారి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ పేర్కొన్నారు. 

‘తన పాలనా వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతున్నారని చంద్రబాబు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. సామాజిక మాధ్యమాలు  (Social Media) వేదికగా గొంతు విప్పుతున్నవారిని, ముఖ్యంగా చంద్రబాబు తప్పులను, కూటమి ప్రభుత్వం తప్పులను నిలదీస్తున్న యువతను లక్ష్యంగా చేసుకున్నారు. చంద్రబాబు తప్పులను ప్రశ్నిస్తున్న చట్టవిరుద్ధంగా, అక్రమంగా, అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు. తన అడుగులకు మడుగులొత్తే పోలీసులను వాడుకుంటూ అన్యాయాన్ని ప్రశ్నించే వారిపై భౌతికదాడులు చేయిస్తూ, హింసిస్తున్నారు. ఇది ఆర్గనైజ్డ్‌ క్రైం కాదా?’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.  

చంద్రబాబు చేతిలోనే దాదాపుగా అన్ని పేపర్లు ఉన్నాయి. ప్రజాసమస్యలపై గొంతు విప్పే టీవీలను కూడా చంద్రబాబు దెబ్బ తీశారు. కేబుల్‌ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి ప్రజలకు వాటి ప్రసారాలు అందకుండా పలుమార్లు కట్‌ చేశారు. ఇక చంద్రబాబుకి కొరుకుడుపడనిది సోషల్‌ మీడియా ఒక్కటే. అందుకే చంద్రబాబు ఇలా బరితెగిస్తున్నారు. ఒక చేత్తో తన మీడియాను, మరో చేత్తో వ్యవస్థలను, మనుషులను వాడుకుని చంద్రబాబు చేస్తున్న ఆర్గనైజ్డ్‌ క్రైమ్స్‌ చూస్తూనే ఉన్నాం. మరి వీటికి పాల్పడుతున్నది ఎవరు? అని జగన్ ప్రశ్నించారు.


ప్రజలను మభ్యపెట్టి, మోసం చేసి, అబద్ధాలతో అధికారంలోకి రావాలి. దీనికోసం చంద్రబాబు అబద్ధాన్ని సృష్టించి, దానికి రెక్కలుతొడిగి తన ఎల్లోమీడియా ద్వారా శరవేగంగా ప్రచారం చేస్తారు. వారి పార్టీనాయకులతో ఆ విషయాలపై పదేపదే మాట్లాడిస్తారు. పనిలోపనిగా దత్తపుత్రుడిని, ఇతర పార్టీల్లో తనకు అనుకూలంగా ఉన్నవారిని సైతం అందుకు చంద్రబాబు వాడుకుంటారు. ఆ తర్వాత మీడియాలో దానిపై డిబేట్లు చేయిస్తారు. తన కుమారుడు లోకేష్‌ ద్వారా సోషల్‌ మీడియాలో చంద్రబాబు విష ప్రచారం చేయిస్తారు. వాళ్లే ఆరోపణలు చేసి, వాళ్లే విచారణ చేసి దోషులెవరో నిర్ధారించి, వాళ్లే శిక్షలు సైతం విధిస్తారు. ఒక పథకం ప్రకారం చంద్రబాబు ఈ నేరాలు చేస్తూనే ఉన్నారు. ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీయడానికి, వ్యక్తిత్వ హననానికి  ప్రయత్నిస్తూనే ఉంటారు. దీన్ని వ్యవస్థీకృత నేరం అనరా అని జగన్ నిలదీశారు.

టీడీపీ అధికారిక సోషల్‌ మీడియా అకౌంట్లో మీరే ఫేక్‌ న్యూస్‌ (Fake News) పెట్టి, దాన్ని రాద్దాంతం చేసిన లేటెస్ట్‌ ట్వీట్‌ను ఏపీ ప్రజలు గమనించారు. ఎప్పుడో రెండేళ్ల కిందట మా అమ్మ వైఎస్ విజయమ్మ కారు టైర్‌ బరస్ట్‌ అయితే, అప్పటి వీడియోను లేటెస్ట్‌గా జరిగినట్టుగా ట్వీట్ చేశారు. పైగా నా తల్లిని నేను చంపాలని అనుకున్నానని సిగ్గుమాలిన వ్యక్తిత్వ హననానికి దిగావు చంద్రబాబు. దీన్ని ఖండిస్తూ మా అమ్మ విజయమ్మ లేఖ రాయగా.. దాన్నికూడా ఫేక్‌ లెటర్‌ అన్నారు. మా అమ్మ వీడియో మెసేజ్‌ కూడా ఇస్తూ మీ తీరును దుయ్యబట్టడాన్ని అంతా గమనించారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న నిన్ను, నీ కొడుకు లోకేష్ ను పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదు? మీ అనుకూల మీడియా ఎన్ని చేసినా పోలీసులు ఏనాడైనా చర్యలు తీసుకున్నారా? మీ చర్యలను ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కేసులుపెట్టి వారిని హింసించడం ధర్మమేనా?

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ పాలిటిక్స్‌లో చంద్రబాబు మరింతగా బరితెగించారు. మొన్నటి తిరుమల లడ్డూ (Tirumala Laddu) వ్యవహారం, పరిణామాలు దీనికి ఉదాహరణ. కూటమి 100 రోజుల మోసాలు, వైఫల్యాలనుంచి ప్రజలను తప్పుదోవపట్టించడానికి చంద్రబాబు సృష్టించిన అబద్ధాన్ని ఎల్లోమీడియా మోయడం, ఆ తర్వాత ఆ పార్టీల నాయకులు కార్యక్రమాలు చేయడం ఒక పన్నాగం ప్రకారం జరిగాయి. ఈ నేరాల కింద అరెస్టు చేయాల్సింది, జీవిత ఖైదు వేయాల్సింది చంద్రబాబుకి అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget