(Source: ECI/ABP News/ABP Majha)
KCR: త్వరలో ప్రజల్లోకి కేసీఆర్- మొదట కాంగ్రెస్ ప్రభుత్వ బాధితుల వద్దకే !?
Telangana: కేసీఆర్ ప్రజల్లోకి వచ్చేందుకు గ్రౌండ్ వర్క్ రెడీ చేసుకుటున్నారు. వరంగల్ జిల్లా నేతలకు సమయం ఇవ్వడమే కాకుండా ఆయన మాట్లాడిన మాటలను బయటకు వచ్చేలా చేశారు.
KCR Back Soon: భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ మరోసారి ఫీల్డ్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంముగిసిన తర్వాత ఆయన పార్టీ నేతల్ని కలవడం మానేశారు. పూర్తిగా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. ఎవరైనా పుట్టినరోజు సందర్భంగా వస్తే అశీర్వదించడం తప్ప రాజకీయాలు మాట్లాడి చాలా కాలం అయింది. అయితే హఠాత్తుగా ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకు సమయం ఇచ్చారు. రాజకీయ అంశాలు మాట్లాడారు. దాంతో కేసీఆర్ .. మళ్లీ ట్రాక్‌లోకి వస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వ బాధితులకు పరామర్శ
భూపాలపల్లిజిల్లాలో ఇటీవల ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. రేవంత్ ప్రభుత్వ నిర్వాకం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని త్వరలో వారింటికి వెళ్లి పరామర్శించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వరంగల్ జిల్లా పార్టీ నేతలకు చెప్పారు.అంటే.. కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారని అనుకోవచ్చు. ఇటీవలి కాలంలో పలు చోట్ల కాంగ్రెస్ పార్టీ బాధితులు ఉన్నారని..కూల్చివేతలు ..ఇతర సమస్యల్లో ప్రశ్నించిన వారిని ఇబ్బంది పెట్టారనికేసీఆర్ వారందర్నీ పరామర్శించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
2025లో కేసీఆర్ ప్రజల్లోకి వస్తారన్న కేటీఆర్
ఇటీవల సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్ లో ఆస్క్ కేటీఆర్ అనే ప్రోగ్రాం నిర్వహించి నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన కేటీఆర్..కేసీఆర్ ఆరోగ్యం చాలా బాగుందని..2025లో ఆయన ఫీల్డ్ లోకి వస్తారని ప్రకటించారు. ఆ ప్రకారం ఇప్పుడు మెల్లగా గ్రౌండ్ ప్రిపేరింగ్ ప్రారంభించారని అనుకుంటున్నారు. ఎన్నికలు ఇంకా దూరంలో ఉన్నందున ఇప్పటి నుంచే ఎన్నికల హడావుడి అని కాకుండా ప్రభుత్వ బాధితుల వద్దకు పరామర్శకు వెళ్లేలా ప్లాన్ చేసుకుంటే మంచి మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు.
Also Read: AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరవుతారా ?
అసెంబ్లీకి రావాలిని రేవంత్ రెడ్డి పదే పదే సవాల్ చేస్తున్నారు. కేసీఆర్ కూడా ఈ సారి సడెన్ సర్‌ప్రైజ్‌గా అసెంబ్లీకి వచ్చి అధికార వర్గాలను షాక్‌కు గురి చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్‌లో చర్చ జరుగుతోంది. ప్రధాన ప్రతిపక్ష నేత, పదేళ్లు సీఎంగా చేసిన నేత అసెంబ్లీకి వస్తే సీఎం రేవంత్ రెడ్డి దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు సరైన వ్యూహమని నమ్ముతున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ వ్యూహకర్తలు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా రేవంత్ రెడ్డి దూకుడును తగ్గించడానికి.. ఎదురు దాడి చేయాడనికి కేసీఆర్ వీలైనంత త్వరగా ఫీల్డ్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.