Nizamabad TRS: నిజామాబాద్ జిల్లా గులాబీ బాస్‌గా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. పార్టీ నేతల్లో నూతనోత్సాహం
నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా జీవన్ రెడ్డిని నియమించడంలో గూలాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోందని స్థానిక నేతలు చెబుతున్నారు. ఫైర్ బాండ్ గా పేరున్న ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి.
73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి అన్ని జిల్లాల అధ్యక్షులను నియమించారు. తెలంగాణలో పార్టీకి కీలకమైన నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిని నియమించటం జిల్లా గులాబీ పార్టీలో జోష్ నింపుతోంది. మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు సన్నిహతంగా ఉండే ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు కేసీఆర్ అప్పజెప్పారు. ఫైర్ బాండ్ గా పేరున్న జీవన్ రెడ్డికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇవ్వటంతో జిల్లా గులాబీ పార్టీ నేతల్లో ఉత్సాహాన్ని నింపింది.
రాజీకయాల్లో చురుగ్గా ఉండే జీవన్ రెడ్డి నియామకం పట్ల జిల్లా టీఆర్ఎస్ పార్టీలో హర్షం వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పే నేత జీవన్ రెడ్డి అని నేతలు అంటున్నారు. జీవన్ రెడ్డి డబ్బులకు సైతం వెనుకాడరు అనే పేరుంది. ఎంపీ ధర్మపురి అరవింద్ లాంటి ప్రతిపక్ష బీజేపీ నేతలకు సమాధానం ఇవ్వాలంటే ఇలాంటి నేతకు బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని గులాబీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అందరినీ కలుపుకొని పోయే స్వభావం జీవన్ రెడ్డికి ఉండటంతో సీఎం కేసీఆర్ జిల్లా పార్టీ పగ్గాలు జీవన్ రెడ్డికి ఇచ్చినట్లు చెబుతున్నాయ్ గులాబీ పార్టీ వర్గాలు. గతంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఈగ గంగారెడ్డి ఉన్నారు. పార్టీని నడిపించటంలో చురుకైన పాత్ర లేదన్న అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమైంది. జీవన్ రెడ్డి యువ నాయకుడు కావటం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారనేది జీవన్ రెడ్డిపై అధిష్టానం ధీమాగా ఉంది.
జీవన్ రెడ్డి ఎమ్మెల్యే కావటం అలాగే జిల్లా పార్టీ బాధ్యతలు సైతం అప్పజెప్పటంతో జిల్లా టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తుం చేస్తున్నారు. మరోవైపు ప్రతి పక్షాలకు కౌంటర్ ఇవ్వటంలో జీవన్ రెడ్డి దిట్ట అనే భావన ఉంది. ఇక జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. పార్టీలో మరింత దూకుడు పేరుగుతుందన్న భావనను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలతో సఖ్యత ఉంటారన్న పేరు జీవన్ రెడ్డికి ఉంది. జిల్లాలో ఇటు బీజేపీ బలపడుతుండటంతో జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం అవసరమని భావించింది టీఆర్ఎస్ అధిష్టానం. మొత్తానికి జీవన్ రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యలు అప్పజెప్పటం జిల్లాలో గులాబీ పార్టీలో జోష్ వచ్చింది.
Also Read: TRS Jeevan Reddy : డిపాజిట్ రాకుండా ఓడిస్తా... అర్వింద్ ఆర్మూర్ పోటీ సవాల్‌కు జీవన్ రెడ్డి కౌంటర్ !
Also Read: Weather Updates: ఏపీలో మరో రెండు రోజులు వర్షాలే.. తెలంగాణలో పెరుగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు