By: ABP Desam | Updated at : 26 Jan 2022 06:32 PM (IST)
నిజామాబాద్ ఎంపీ సవాల్‌కు జీవన్ రెడ్డి కౌంటర్
అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి జీవన్ రెడ్డిపై పోటీ చేస్తానన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రకటనపై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పందించారు. అరవింద్ ఆర్మూర్ లో పోటీ చేస్తానని సవాల్ చేశారని...స్వాగతిస్తున్నానని.. డిపాజిట్ దక్కకుండా ఓడిస్తానని సవాల్ చేశారు. స్ట్రీట్ లో స్ట్రెయిట్ ఫైట్ చేద్దాం రా అరవింద్ అని చాలెంజ్ చేశారు. ఎంపీ అర్వింద్ ఆర్మూర్ పర్యటనలో దాడి జరిగింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు చేసిన అర్వింద్‌కు జీవన్ రెడ్డి వెంటనే కౌంటర్ ఇచ్చారు.
అరవింద్ నోరు తెరిస్తే అబద్ధం తప్ప మరొకటి రాదని.. పసుపు బోర్డు తెస్తానని మాట తప్పినందుకు నిజామా బాద్ లో రైతులు అరవింద్ పై ఆగ్రహం తో ఉన్నారని.. వారిని మరింత రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. మొత్తం పార్లమెంటు నియోజకవర్గం లో ఎక్కడికక్కడ అరవింద్ ను నిలదీస్తున్నారని.. దమ్ముంటే ఆపండి అని రైతులను రెచ్చ గొట్టిన ఫలితంగా అరవింద్ కు ఆర్మూర్ లో వారు తమ సత్తా చూపారన్నారు. సాక్షాత్తూ పీఎం మోడీ నే రైతులు అడ్డుకున్నారు... అరవింద్ ఎంత అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. అరవింద్ రాసిచ్చిన బాండ్ పేపర్ సంగతేమిటని రైతులు అడిగితే వారిని గుండాలు అంటున్నారని మండిపడ్డారు.
దేశ వ్యాప్తంగా బీజేపీకి రైతులు తమ పవర్ ఏమిటో చూపిస్తున్నారని.. కేంద్రం పై ఉన్న కోపానికి తోడు అరవింద్ పై ఉన్న ఆగ్రహం ఆర్మూర్ ఘటనకు కారణమని విశ్లేషించారు. రైతులను నిందించినందుకు అరవింద్ క్షమాపణ చెప్పాలన్నారు. తెలంగాణ ఉద్యమం లో సమైక్యవాదులను ఉరికించినట్టే బంగారు తెలంగాణ ను అడ్డుకుంటున్న వారిని ఉరికిస్తున్నారన్నారు. ఆర్మూర్ లో ఎర్రజొన్న రైతుల ను కాంగ్రెస్ ఎడిపిస్తే ఆ పార్టీ నాశనం అయింది...ఇపుడు పసుపు బోర్డు పేరు చెప్పి రైతులను మోసం చేసిన బీజేపీ కూడా నామరూపాలు లేకుండా పోతుందన్నారు.
బాలీవుడ్, టాలీవుడ్ హీరో లకు లేనంత ఫాలోయింగ్ తెలంగాణ వార్ హీరో కేసీఆర్ కు ఉందని...కేసీఆర్ ను ఏదీ పడితే అది తిడితే అభిమానులు కచ్చితంగా తిరగబడుతారని హెచ్చరించారు. కేవలం రైతులే కాదు ఇకముందు కల్యాణ లక్ష్మీ తో లబ్ది పొందిన మహికలు కూడా అరవింద్ కు చెప్పులతో స్వాగతం చెబుతారని జోస్యం చెప్పారు. 62 లక్షల మంది రైతులు 60 లక్షల మంది కార్యకర్తలు తలుచుకుంటే బీజేపీ నేతలు తిరుగుతారా అని ప్రశ్నించారు. లంగాణ బీజేపీ అధ్యక్షుడు .బండి సంజయ్ సవాళ్లు విసరడం కాదు దమ్ముంటే ఢిల్లీ కి వెళ్లి కాళ్ళు పట్టుకుని పసుపు బోర్డు తీసుకురావాలని చాలెంజ్ చేశారు. మాది దాడుల సంస్కృతి కాదని ...మేము నిజంగానే పిలువునిస్తే అరవింద్ నిజామాబాద్ వెళ్లి తిరిగి రాలేడన్నారు. అరవింద్ చిన్న ఘటన కే ఉలిక్కి పడుతున్నారన్నారు..
Breaking News Live Updates : ఎమ్మెల్సీ కారులో మృతదేహం కలకలం
CM KCR Tour : జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ గురి, నేటి నుంచి వరుస పర్యటనలు
Petrol Diesel Price 20th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా
Gold Silver Price Today 20th May 2022 : మళ్లీ పెరిగిన బంగారం ధరలు, కాస్త తగ్గిన వెండి ధరలు, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా
Weather Updates : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
Ram Charan-NTR: నీతో నా బంధాన్ని మాటల్లో చెప్పలేను - రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్
Nara Lokesh : ఎమ్మెల్సీ కారులో మృతదేహం ఘటనపై లోకేశ్ ఫైర్, హత్యను యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారని ఆరోపణ!
CBI Raids: లాలూ యాదవ్కు మరో షాక్- కొత్త అభియోగాలు మోపిన సీబీఐ
Covid-19 Cases India: దేశంలో కొత్తగా 2259 కరోనా కేసులు- 20 మంది మృతి