Weather Updates: ఏపీలో మరో రెండు రోజులు వర్షాలే.. తెలంగాణలో పెరుగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ఫలితంగా నేడు ఏపీలో పలు చోట్ల వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
AP Weather Updates: దక్షిణ తమిళనాడు నుంచి రాయలసీమ వరకు ఉన్న అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ఫలితంగా నేడు ఏపీలో పలు చోట్ల వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో వర్షాల కారణంగా చలి తీవ్రత పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలే అందుకు కారణమని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తక్కువ ఎత్తులో నైరుతి, తూర్పు దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి.
రెండు వైపుల నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో కోస్తాంధ్ర, యానం ప్రాంతాల్లో వాతావరణం పొడిగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు సైతం వాతావరణంలో ఎలాంటి మార్పులు ఉండవని, వర్షాలు కురిసే అవకాశం లేదని అధికారులు అంచనా వేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నేడు వాతావరణం పొడిగా ఉంటుంది. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఎలాంటి సమస్య లేదని అధికారులు సూచించారు. వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం తడవకుండా చూసుకోవాలని సూచించారు. అత్యల్పంగా నందిగామలో 18.3 డిగ్రీలు, జంగమేశ్వరపురంలో 1686 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. బాపట్లలో 19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో వర్షాల కారణంగా చలి గాలులు వీస్తున్నాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో అల్పపీడన ప్రభావం ఉంది. దీంతో నేడు, రేపు ఈ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురవనుండగా మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రెండు రోజుల తరువాత వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. కోస్తాంధ్రతో పోల్చితే రాయలసీమలో చలి తీవ్రత అధికంగా ఉంది. అత్యల్పంగా అనంతపురంలో 20.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, కర్నూలులో 20 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో వాతావరణంలో ఎలాంటి మార్పులు లేవు. గత రెండు రోజుల మాదిరిగా ఇక్కడ వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఆకాశం నిర్మలమై కనిపిస్తుంది. ఈశాన్య దిశ నుంచి గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రంలో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలు ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. ఉదయం వేళలో ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్నిచోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది.
Also Read: Horoscope Today 28 January 2022: ఈ మూడు రాశులవారు అప్రమత్తంగా ఉండాలి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Also Read: Gold-Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఏకంగా 400 దిగిన పసిడి ధర, వెండి కూడా పతనం