Horoscope Today 28 January 2022: ఈ మూడు రాశులవారు అప్రమత్తంగా ఉండాలి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
జనవరి 28 శుక్రవారం రాశిఫలితాలు
మేషం
కార్యాలయంలో ఎవరితోనైనా విభేదాలు రావొచ్చు. ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్ని ఎదురవుతాయి. కొందరు వారి పిల్లల ఉద్యోగం గురించి ఆందోళన చెందుతారు. పొట్టకి సంబంధించిన సమస్యతో బాధపడతారు. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. వ్యాపారంలో కొంత నష్టం వాటిల్లవచ్చు. మాటల్ని అదుపుచేయండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు.
వృషభం
మీరు మీ జీవిత భాగస్వామి నుంచి బహుమతి పొందుతారు. మీ దినచర్యను మార్చుకోండి. కార్యాలయంలో ఉన్నతాధికారుల మద్దతు మీకు లభిస్తుంది. స్నేహితుని సహాయంతో మీరు మీ పనిని పూర్తి చేయగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తిని కలిగి ఉంటారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లభిస్తాయి. శుభవార్త వింటారు.
మిథునం
ఒకరి నుంచి తీసుకున్న అప్పు విషయంలో ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. వివాదాలకు దూరంగా ఉండండి. సామాజిక స్థాయిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. గొడవ పడే వారి పట్ల జాగ్రత్త వహించండి. ఆస్తి విషయంలో వివాదాలు రావొచ్చు. రోజువారీ ఖర్చులు పెరుగుతాయి. ప్రేమికులు తమ భాగస్వామితో సంబంధాన్ని చెడగొట్టకూడదు.
Also Read: వారంలో ఈ రోజు ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే సిరిసంపదలు, కీర్తిప్రతిష్టలు సిద్ధిస్తాయట...
కర్కాటకం
ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. సమాజంలో మీ ఔన్నత్యం ఉన్నతంగా ఉంటుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తారు.పెండింగ్‌లో ఉన్న పనిని పూర్తి చేయండి. వ్యాపారంలో లాభం వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోష సమయం గడుపుతారు. విద్యార్థులకు చదువుతోపాటు పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది.
సింహం
ఉద్యోగంలో అస్థిరత ఉంటుంది. భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. ఆరోగ్యం చెడిపోతుంది. ఈరోజు మీరు లావాదేవీలకు దూరంగా ఉండండి. మీ సమస్యలను మీ కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు. కుటుంబ పెద్దలతో సమయం గడపడానికి ప్రయత్నించండి. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సమస్య ఉండవచ్చు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి.
కన్య
ఈ రోజు మీకు కలిసొస్తుంది. మీలో దాగి ఉన్న నైపుణ్యాలు బహిర్గతమవుతాయి. ప్రజలు మిమ్మల్ని ఆకట్టుకుంటారు. ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. మీడియా, రచనరంగంలో ఉన్న వ్యక్తులు ప్రశంసలు అందుకుంటారు. కెరీర్‌కు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇదే మంచి సమయం. వ్యక్తిగత జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. ప్రయాణాలలో ఎవరితోనూ వివాదాలు పెట్టుకోవద్దు.
Also Read: బ్రహ్మచారులిద్దరూ ఒకే విగ్రహంలో కొలువుతీరిన ఆలయం..
తుల
ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రభావం పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వొద్దు. విమర్శల బారిన పడాల్సి రావొచ్చు. ఆర్థిక కార్యకలాపాలకు ఈరోజు మంచి రోజు అవుతుంది. ప్రమోషన్ పొందుతారు. యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.
వృశ్చికం
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపుతారు. ఇంటి మరమ్మతులకు డబ్బులు వెచ్చిస్తారు. కొన్ని పనులు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. జాగ్రత్తగా ఇంటరాక్ట్ అవ్వండి.
ధనుస్సు
మీరు మీ భవిష్యత్తుపై ఆశగా ఉంటారు. స్టాక్ మార్కెట్ లో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో నిలిచిపోయిన కొన్ని పనులు ఈరోజు పూర్తి అయ్యే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలకు ప్రణాళిక వేస్తారు. బంధువుతో గతంలో ఏర్పడిన వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
Also Read: శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో కొలువుతీరనున్న శ్రీరామానుజాచార్యుల విగ్రహం ప్రత్యేకతలివే…
మకరం
మీరు మీ సంపదను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలి. తెలియని వ్యక్తిని నమ్మవద్దు. మీ వ్యక్తిత్వంతో ప్రశంసలు అందుకుంటారు. రుణం మొత్తాన్ని తిరిగి పొందడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు.మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచండి. సాహిత్యం లేదా మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు గందరగోళంగా ఉంటుంది.
కుంభం
ఈరోజు చాలా చురుకుగా ఉంటారు. సామాజిక, మతపరమైన పనుల్లో మీ సహకారాన్ని అందరూ అభినందిస్తారు. మీ పనిని వేగంగా పూర్తి చేయండి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మీరు భవిష్యత్తు గురించి పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. ఉద్యోగులకు అనుకూల సమయం. మీ దినచర్యను క్రమశిక్షణగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.
మీనం
మీ సహకారంతో చాలా మంది వారి పనులు పూర్తిచేసుకుంటారు. గతంలో చేసిన తప్పుల నుంచి పాఠం నేర్చుకుంటారు. అనుభవం ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకరి పట్ల ఆకర్షితులవుతారు. వ్యాపారంలో వచ్చే సమస్యలకు పరిష్కారాలు కనుగొంటారు. మీరు భాగస్వామ్య పనిలో ప్రయోజనం పొందొచ్చు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయవద్దు.
Also Read: నవగ్రహాల ఆరాధన వల్ల ఏం జరుగుతుంది… గ్రహ దోషాల నుంచి విముక్తి పొందాలంటే నిత్యం ఈ శ్లోకం చదవండి..