Spirituality: వారంలో ఈ రోజు ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే సిరిసంపదలు, కీర్తిప్రతిష్టలు సిద్ధిస్తాయట...
పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారాల్లో ధూపం ఒకటి. ఇంట్లో ధూపం వేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటారు. ఇంతకీ సాంబ్రాణి ధూపం వేయడం వెనుక ఆంతర్యం ఏంటి. ధూపం దేవుడికోసమే కాదు మన ఆరోగ్యం కోసం కూడా..
సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని చెబుతారు జ్యోతిష్యులు. దేవుడికి మాత్రమే కాదు ఇల్లంతా ధూపం వేయడం వేయడం వల్ల ఆధ్యాత్మికంగానే కాకుండా..ఆరోగ్యానికి కూడా మంచిదంటారు. వారంలో ఒక్కరోజు ధూపం వేసినా ఏడు రోజుల నెగిటివ్ ఎనర్జీని తరిమేయవచ్చట.
ఏ రోజు ధూపం వేస్తే ఎలాంటి ఫలితం
- ఆదివారం గుగ్గిలంతో సాంబ్రాణి పొగ వేస్తే.. సిరిసంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది.
- సోమవారం ఆరోగ్య వృద్ధి, మానసిక ప్రశాంతత.. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.
- మంగళవారం శత్రుభయం, ఈర్ష్య, అసూయ, తొలగిపోతాయి. కంటికి సంబంధించిన సమస్యలుండవు, అప్పుల బాధ తొలగిపోతుంది.
- బుధవారం ధూపం వేస్తే.. నమ్మక ద్రోహం, ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవడంతో పాటూ పెద్దల ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు.
- గురువారం గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేస్తే చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి.
- శుక్రవారం లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. శుభకార్యాలు జరుగుతాయి, అన్నింటా విజయం అందుకుంటారు
- శనివారం సోమరితనం తొలగిపోతుంది. ఈతిబాధలుండవు. శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది.
Also Read: బ్రహ్మచారులిద్దరూ ఒకే విగ్రహంలో కొలువుతీరిన ఆలయం..
ఆరోగ్యానికి ఎంతో మంచిది
- ప్రస్తుతం సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తున్నారు కానీ పూర్వం సాంబ్రాణి, సుద్ధచందనాన్ని కలిపి ఆవు పిడకల్లోనో, గుగ్గిలంలోనో వెలిగించే వారు. ఇలా చేస్తే ఇంట్లో, పరిసరాల్లో ఉండే దోమలు, సూక్ష్మ క్రిములు ఈ పొగకి నశిస్తాయి.
- హానికరమైన రసాయనాలు ఉపయోగించరు కాబట్టి..ఈ పొగ పీల్చడం వల్ల ఆరోగ్యానికి హాని జరగదు. శ్వాస సంబంధిత రుగ్మతలు లేకుండా చేస్తుంది.
- ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
- బాలింతలకు, శిశువులకు సాంబ్రాణి ధూపం వేస్తారు. చిన్నారులకు స్నానం చేయించిన వెంటనే ధూపం వేస్తే హాయిగా నిద్రపోతారు
Also Read: శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో కొలువుతీరనున్న శ్రీరామానుజాచార్యుల విగ్రహం ప్రత్యేకతలివే…
ఆయుర్వేదంలోనూ సాంబ్రాణి
- శరీరంలో నీరసాన్ని తగ్గించి నరాలను ఉత్తేజితం చేస్తుంది సాంబ్రాణి
- అనేక మానసిక రుగ్మతలకు సాంబ్రాణి దూపం మందులా పనిచేస్తుంది
- ఆయుర్వేదం లో కీళ్ళనొప్పుల నివారణకు జీర్ణక్రియ, చర్మ రోగాలను తగ్గించేందుకు ఉపయోగిస్తారు.
- ఆస్తమా, అల్సర్, క్యాన్సర్ చికిత్స కోసం వినియోగించే మందులతో పాటూ కొన్ని లేహ్యాల్లోనూ సాంబ్రాణి ఉపయోగిస్తారు.
- దూపం వేసినప్పుడు వచ్చే వాసన నాడిని ప్రేరేపించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
పెద్దల నుంచి తెలుసుకున్నవి కొన్ని, పుస్తకాల్లో చదివినవి కొన్ని..అన్నీ సేకరించి రాసిన కథనం ఇది. ఎంతవరకూ విశ్వసించాలన్నది పూర్తిగా మీకు సంబంధించిన విషయం...
Also Read: నవగ్రహాల ఆరాధన వల్ల ఏం జరుగుతుంది… గ్రహ దోషాల నుంచి విముక్తి పొందాలంటే నిత్యం ఈ శ్లోకం చదవండి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి