News
News
X

Spirituality: బ్రహ్మచారులిద్దరూ ఒకే విగ్రహంలో కొలువుతీరిన ఆలయం..

సగం వినాయకుడు, సగం ఆంజనేయుడు..ఎప్పుడైనా విన్నారా. శరీరంలో సగభాగాన్ని పంచిచ్చిన శివుడి గురించి విన్నాం, అర్థనారీశ్వరుని రూపం చూశాం కానీ సగం వినాయకుడు, సగం ఆంజనేయుడు గురించి తెలీదంటారా..మీకోసమే ఈ కథనం.

FOLLOW US: 

వక్రతుండ మహాకాయ..,కోటిసూర్య సమప్రభ
నిర్విగ్నం కురుమేదేవా..సర్వ కార్వేషు సర్వదా!…
వినాయకుడు అంటే అద్వితీయుడు ,ఆనంద స్వరూపుడని అర్దం. సకల దేవతాగణములకు అదిపతి గణపతి . మహా శక్తి సంపన్నుడైన గణపతిని పూజిస్తే విఘ్నాలు లేకుండా శుభాలను ప్రసాదిస్తాడు

హనుమంతం వాయుపుత్రం నమామి బ్రహ్మచారిణమ్
త్రిమూరత్యాత్మక మాత్మస్థం జపాకుసుమ సన్నిభమ్
నానాభూషణ సంయుక్తం ఆంజనేయం నమామ్యహమ్
పంచాక్షర స్థితం దేవం నీల నీరద సన్నిభమ్..!!

అంటే  వాయుదేవుని వరప్రసాదంతో పుట్టినవాడు, బ్రహ్మచారి, త్రిమూర్తి స్వరూపుడు, ఆత్మజ్ఞాని, దేదీప్యమానంగా ప్రకాశించే సమస్తమైన నగలు ధరించినవాడు, పంచబీజాక్షరాలతో ఉన్నవాడు, నల్లని మేఘంతో సమానమైనవాడు అయిన హనుమంతుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని. ఈ శ్లోకంతో నిత్యం ఆంజనేయుడిని స్మరిస్తే బుద్ధిబలం, ధైర్యం సిద్ధిస్తాయి.

విఘ్నాలు తొలగించే గణనాథుడు, భయాన్ని తొలగించే ఆంజనేయుడు వీరిద్దరూ కలసి ఒకేవిగ్రహంలో కొలువైన ఆలయాన్ని కైలాసంగా భావిస్తున్నారు భక్తులు. గణపతి, హనుమంతుడు ఇద్దరికీ చాలా సారూప్యత ఉంటుంది. ఎందుకంటే ఇద్దరూ స్వామి భక్తులే ఒకరు సీతారాముల భక్తుడైతే మరొకరు తల్లిదండ్రుల భక్తుడు. సప్తగణాలకు, సకలకార్యాలకు అధిపతి వినాయకుడు. బలం, సమయస్ఫూర్తికి నిదర్శనం ఆంజనేయుడు. ఇద్దరూ బ్రహ్మచారులే అన్నది మరో సారూప్యత. వీరిద్దరూ కలసిన రూపాన్ని పురాణాల్లో అచ్యుత ప్రభుగా ఆరాధిస్తారు.ఈ ఆలయం తమిళనాడులో ఉంది.

Also Read: శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లో కొలువుతీరనున్న శ్రీరామానుజాచార్యుల విగ్రహం ప్రత్యేకతలివే…

చెన్నై నగరం అడయార్  సమీపం మధ్యకైలాస్‌లో ఉంది ఆనంద వినాయకుని ఆలయం. ఈ ఆలయంలో విగ్రహం  సగం వినాయకుడు, సగం హనుమంతుడు కొలువై ఉంటారు. ఆదిలో వినాయకుడిని, ముగింపులో హనుమంతుడిని పూజిస్తారిక్కడ. ఆద్యంతాలకు ప్రతీకగా ఇక్కడి స్వామిని `ఆద్యంత ప్రభు` అంటారు. మధ్యకైలాష్ ఆలయంలోని మండపాలు, విగ్రహాలు వేటికవే ప్రత్యేకతగా కనిపిస్తాయి. బ్రహ్మచారులైన విఘ్నేశ్వరుడు, ఆంజనేయస్వామి అర్ధ శరీరాలతో ఏకమైనట్లు ఏర్పాటైన విగ్రహం భక్తులను ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులు తమకు కైలాసాన్ని దర్శించినంత అనుభూతి కలుగుతోందంటారు. ఈ దేవాలయం సందర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఆద్యంత ప్రభుని పూజిస్తే సకల గ్రహదోషాల నుంచి విముక్తి కలుగుతుందంటారు. 

Also Read: నవగ్రహాల ఆరాధన వల్ల ఏం జరుగుతుంది… గ్రహ దోషాల నుంచి విముక్తి పొందాలంటే నిత్యం ఈ శ్లోకం చదవండి..

ఇక్కడి దేవాలయంలో అన్నదానం, పితృకర్మలు కూడా చేస్తుంటారు. తమ ఇళ్లల్లో కర్మ కార్యక్రమాలు నిర్వహించేందుకు వసతులు లేనివారు ఈ గుడిలో చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. వినాయకుడు, ఆంజనేయుడితో పాటూ పార్వతీ పరమేశ్వరులు, ఆదిత్యుడు, మహావిష్ణువు, దుర్గా, నవగ్రహాలు, స్వర్ణభైరవుని విగ్రహాలు కూడా ఉన్నాయి. 

Also Read: ఈ తిథి రోజు ఏం చేసినా విజయమే.. కానీ, ఈ తిథుల్లో చేసే పనులు కష్టాలు తెచ్చిపెడతాయ్!
Also Read: సోమవారం, శనివారం గణపతిని ఇలా పూజిస్తే శనిబాధలతో పాటూ కష్టాలన్నీ తొలగిపోతాయట…

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 27 Jan 2022 07:07 PM (IST) Tags: Lord Ganesh Chennai Anjaneya Aadyanta Prabhu Temple Madhyakailash Adyar

సంబంధిత కథనాలు

Navratri 2022: సకల శుభాలను కలిగించే శ్రీ లలితా చాలీసా

Navratri 2022: సకల శుభాలను కలిగించే శ్రీ లలితా చాలీసా

Numerology Today: ఈ తేదీల్లో పుట్టినవారు అనుకున్న పనులు పూర్తిచేస్తారు, సెప్టెంబర్‌ 30 న్యూమరాలజీ

Numerology Today: ఈ తేదీల్లో పుట్టినవారు అనుకున్న పనులు పూర్తిచేస్తారు, సెప్టెంబర్‌ 30 న్యూమరాలజీ

Horoscope Today 30th September: ఈ రాశులవారిపై లలితా త్రిపుర సుందరి కరుణా కటాక్షాలుంటాయి

Horoscope Today 30th September: ఈ రాశులవారిపై లలితా త్రిపుర సుందరి కరుణా కటాక్షాలుంటాయి

ఈ రాశివారు స్నేహమంటే ప్రాణమిస్తారు, మీ రాశికి ఏ రాశివారితో స్నేహం కుదురుతుందో చూసేయండి

ఈ రాశివారు స్నేహమంటే ప్రాణమిస్తారు, మీ రాశికి ఏ రాశివారితో స్నేహం కుదురుతుందో చూసేయండి

ఐదవ రోజు లతితా త్రిపురసుందరీ దేవి, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు

ఐదవ రోజు లతితా త్రిపురసుందరీ దేవి,  అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు

టాప్ స్టోరీస్

YS Sharmila : వైఎస్ఆర్ బతికుంటే కాంగ్రెస్ పార్టీపై ఉమ్మేసేవారు, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

YS Sharmila : వైఎస్ఆర్ బతికుంటే కాంగ్రెస్ పార్టీపై ఉమ్మేసేవారు, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

Botsa Reaction On Harish : పక్కపక్కన పెట్టి చూస్తే తేడా తెలుస్తుంది - హరీష్‌రావుకు బొత్స కౌంటర్ !

Botsa Reaction On Harish : పక్కపక్కన పెట్టి చూస్తే తేడా తెలుస్తుంది - హరీష్‌రావుకు బొత్స కౌంటర్ !

WhatsApp Updates: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, అందుబాటులోకి ఐదు ఫీచర్లు!

WhatsApp Updates: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, అందుబాటులోకి  ఐదు ఫీచర్లు!

Prabhas: కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ‌ - భోజనాల కోసం రూ.4 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభాస్!

Prabhas: కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ‌ - భోజనాల కోసం రూ.4 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభాస్!