Spirituality: ఈ తిథి రోజు ఏం చేసినా విజయమే.. కానీ, ఆ తిథుల్లో చేసే పనులు కష్టాలు తెచ్చిపెడతాయ్!

ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు మంచి తిథి చూసుకుంటారు కొందరు. అయితే దశమి, ఏకాదశి అనగానే మంచిదే అనుకుంటారు కానీ మిగిలిన తిథుల్లోనూ మంచి ఫలితాలనిచ్చేవి ఉన్నాయి.. అవేంటో చూద్దాం...

FOLLOW US: 

పాడ్యమి నుంచి పౌర్ణమి లేదా అమావాస్య వరకూ 15 రోజులు... నెల రోజుల్లో ఒక్కో తిథి రెండుసార్లు వస్తుంది. అమావాస్య వెళ్లిన పాడ్యమి నుంచి తెలుగు నెల మొదలైతే పదిహేను రోజులకు పౌర్ణమి వస్తుంది..మళ్లీ 15 రోజులకు వచ్చే అమావాస్యతో తెలుగు నెల పూర్తవుతుంది. అయితే ఈ కొన్ని పనులు తలపెట్టినప్పుడు ఈ తిథి మంచిదా కాదా అనే సందేహం వస్తుంది. పెద్ద పెద్ద కార్యక్రమాలకు అయితే  పండితుల దగ్గరకు వెళ్లి ముహూర్తం పెట్టించుకుంటారు. కానీ కొన్ని చిన్న చిన్న పనులకు మాత్రం కేవలం మంచి తిథి చూసుకుని ముందడుగు వేస్తారు. మరి ఏ తిథి విజయాన్నిస్తుంది... ఏ తిథి కష్టాలపాలు చేస్తుందో తెలుసుకోండి...

Also Read:
తిధులు, మంచి, చెడు- వాటి ఫలితాలు  

 • పాడ్యమి తిథి మొదటి అర్థభాగం మంచిదికాదు..తర్వాత అర్థభాగం మంచిది.
 • విదియ రోజు ఏ పని తలపెట్టినా శుభమే
 • తదియ కూడా మంచి రోజే. ఈ రోజు చేసే పనుల్లో విజయం, ఆనందం కలుగుతాయంటారు
 • చవితి చల్లని తిథి అనే పేరు. అయితే మధ్యాహ్నం వరకూ వినాయకుడికి, ఆ తర్వాత మనకు మంచిది
 • పంచమి తిథి శుభానికి చిహ్నం, ఈ తిథిలో ఏం చేసినా లాభమే
 • షష్టి రోజు ఏ పనీ పెద్దగా కలసిరాదు
 • సప్తమి రోజు ఏం చేసిన కలిసొస్తుంది, అన్నింటా విజయం వరిస్తుంది. ముఖ్యమంగా చదువులకు సప్తమి తిథి మంచిదంటారు
 • అష్టమి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది... ఇది కేవలం దుర్గాదేవికి మాత్రమే కలిసొచ్చే తిథి..ఈ రోజు ఏం చేసినా అష్టకష్టాలు తప్పవు
 • నవమి తిథి గురించి చెప్పుకునే ముందు శ్రీరాముడిని తలుచుకోండి..ఆయనకే తప్పలేదు మనమెంత
 • దశమి ...పేరులోనే ఉంది దశ తిరుగుతుందని...ఈ రోజు ఏం చేసినా విజయమే
 • ఏకాదశి...ఈ రోజు పది పనులు చేపడితే అందులో ఒకటి అవుతుందని చెబుతారు పండితులు
 • ద్వాదశి తిథి ప్రయాణాలకు మంచిందట. అయితే ఖాళీ కడుపుతో బయలుదేరకుండా ఏదైనా తినేసి వెళితే తలపెట్టిన పనులు నెరవేరుతాయంటారు  
 • త్రయోదశి  రోజు ఏ పని చేసినా విజయం వరిస్తుందంటారు
 • చతుర్దశి తిథిని పెద్దగా పట్టించుకోపోవడం మంచిది
 • పౌర్ణమి తిథి అన్నీ శుభాలే. ఈ రోజు వర్జ్యం లేకుండా ఉండే మరింత మంచిదని చెబుతారు పండితులు 
 • అమావాస్య రోజు ఏ పనీ కొత్తగా చేయకపోవడమే మంచిదంటారు

షష్టి –శనివారం, సప్తమి –శుక్రవారం, అష్టమి –గురువారం, నవమి – భుదవారం, దశమి –మంగళవారం, ఏకాదశి –సోమవారం, ద్వాదశి –ఆదివారం వచ్చినప్పుడు శుభకార్యాలు చేసుకోవచ్చంటారు. 

Also Read: తుమ్ము మంచి శకునమే కానీ షరతులు వర్తిస్తాయట..
Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?
Also Read: అభిమన్యుడు, ఘటోత్కచుడు సహా ఈ 15 మంది పాండవుల సంతానమే..
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 
Also Read: అనారోగ్యం, శని ప్రభావం నుంచి విముక్తి పొందాలంటే ఈ ఆలయానికి వెళ్లాలట..
Also Read:  జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 21 Jan 2022 05:56 PM (IST) Tags: Padyami Vidhiya Thadhiya Chavithi Pamchami Shashti Sapthami Ashtami Navami Dhasami Ekaadhashi Dhvadhashi Thrayoodhashi Chaturdhashi Amavasya Pournami

సంబంధిత కథనాలు

Panchang 26June 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, సంపూర్ణ ఆరోగ్యం కోసం సూర్యుడి మంత్రం

Panchang 26June 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, సంపూర్ణ ఆరోగ్యం కోసం సూర్యుడి మంత్రం

Horoscope 26th June 2022: ఈ రాశులవారు సలహాలివ్వడంలో ది బెస్ట్, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope 26th June 2022: ఈ రాశులవారు సలహాలివ్వడంలో ది బెస్ట్, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Heavy Rush In Tirumala: శ్రీవారి భక్తులతో నిండిన సప్తగిరులు, TTD అధికారులు అలర్ట్ - సర్వదర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే !

Heavy Rush In Tirumala: శ్రీవారి భక్తులతో నిండిన సప్తగిరులు, TTD అధికారులు అలర్ట్ - సర్వదర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే !

Jagannath Rath Yatra 2022 : జులై 1న పూరీ జగన్నాథుడి రథయాత్ర, అక్కడ సగం చెక్కిన విగ్రహాలే ఎందుకుంటాయి!

Jagannath Rath Yatra 2022 : జులై 1న పూరీ జగన్నాథుడి రథయాత్ర, అక్కడ సగం చెక్కిన విగ్రహాలే ఎందుకుంటాయి!

Horoscope 25 June 2022: ఈ రాశులవారు నమ్మకాన్ని కోల్పోకుండా చూసుకోవాలి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope 25 June 2022: ఈ రాశులవారు నమ్మకాన్ని కోల్పోకుండా చూసుకోవాలి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

టాప్ స్టోరీస్

TS Govt : టీచర్ల ఆస్తుల ప్రకటనపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం, విద్యాశాఖ ఉత్తర్వులు నిలిపివేస్తూ ఆదేశాలు

TS Govt : టీచర్ల ఆస్తుల ప్రకటనపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం, విద్యాశాఖ ఉత్తర్వులు నిలిపివేస్తూ ఆదేశాలు

DA Hike In July: జులైలో పెరగనున్న జీతాలు! సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!!

DA Hike In July: జులైలో పెరగనున్న జీతాలు! సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!!

CM Jagan: రూట్ మారుస్తున్న సీఎం జగన్- ప్లీనరీ తర్వాత ఆ విమర్శలకు చెక్‌ పెడతారట! 

CM Jagan: రూట్ మారుస్తున్న సీఎం జగన్- ప్లీనరీ తర్వాత ఆ విమర్శలకు చెక్‌ పెడతారట! 

Puri Jagannadh : చీప్‌గా వాగొద్దు - బండ్ల గణేష్‌కు పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్

Puri Jagannadh : చీప్‌గా వాగొద్దు - బండ్ల గణేష్‌కు పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్