News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Spirituality: సోమవారం, శనివారం గణపతిని ఇలా పూజిస్తే శనిబాధలతో పాటూ కష్టాలన్నీ తొలగిపోతాయట…

హిందూ ధర్మాన్ని అనుసరించేవారెవరైనా... ఏ పూజ చేసినా, ఏపని తలపెట్టినా వినాయకుడిని తలుచుకోకుండా ముందడుగు వేయరు. అయితే లంబోదరుడి కరుణాకటాక్షాలు పొందాలంటే కొన్ని పాటించాలంటారు పండితులు..అవేంటో చూద్దాం..

FOLLOW US: 
Share:

వక్రతుండ మహాకాయ..కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవా..సర్వ కార్వేషు సర్వదా!

 వినాయకుడు అంటే నాయకుడు లేనివాడు తనకు తానే నాయకుడు అని అర్దం. సకల కార్యాల్లో ప్రధమ పూజ్యుడు. సకల దేవతాగణాలకు అధిపతి గణపతి. అలాంటి మహా శక్తి సంపన్నుడైన గణపతిని పూజిస్తే విఘ్నాలు లేకుండా శుభాలు ప్రసాదిస్తాడని విశ్వాసం.  ఏ పనినైనా ప్రారంభించే ముందు ఆరాధించే దేవుడు. అందుకే ఆయన్ను ఆదిదేవుడని అంటారు. కీర్తిని ప్రసాదించేవాడు , లాభాలను కలిగించువాడు కాబట్టి ఆయనను లక్మీగణపతిగా పిల్చుకుంటారు. అలాంటి గణపయ్యను దర్శించుకునేందుకు ఆలయాని వెళ్లేవారు  కొన్ని పాటిస్తే చాలామంచిదంటారు పండితులు.

  • బొజ్జ గణపయ్య ఆలయానికి వెళ్లేవారు ముందుగా ఆయన ముందు ప్రణమిల్లి 13 ఆత్మ ప్రదక్షిణలు చేయాలి. కనీసం మూడు గుంజీలు తీయాలి.
  • వినాయకుడికి 21 వెదురు పుష్పాలు కాని , కొబ్బరి పువ్వులను కానీ, వెలగ పుష్పాలను కానీ  అలంకరణకోసం సమర్పించాలి.
  • ఇవేవీ దొరకని పక్షంలో 21 గరిక గుచ్ఛాలను సమర్పించాలి. గరికతో వినాయకుడిని పూజిస్తే సమస్త దోషాలు, విఘ్నాలు తొలగిపోతాయని వేదపండితులంటారు.
  • గరిక సూర్యునికి కూడా ప్రీతికరం కావడంతో ఆయన అనుగ్రహంతో ఆరోగ్యం ప్రాప్తిస్తుందని, శనివారం వినాయకుడితో పాటూ శనికి గరిక సమర్పిస్తే శనిదోషాలు కూడా తొలగిపోతాయని చెబుతారు.
  • నైవేద్యంగా చెరకు, వెలగకాయ, కొబ్బరిబోండాలను ఇవ్వాలి
  • గణపయ్య ఆలయం ప్రత్యేకంగా ఉంటే ఐదు ప్రదక్షిణలు చేయాలి
  • వినాయకుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. అయితే జలంతో కన్నా కొబ్బరినీళ్ళు, చెరకురసంతో అభిషేకం చేసినట్లైతే వ్యాపారాభివృద్ధి, వంశాభివృద్ధి, గృహ నిర్మాణాలు చేపట్టే వారికి మంచి ఫలితాలు ఉంటాయని చెబుతారు. 

Also Read: ఈ తిథి రోజు ఏం చేసినా విజయమే.. కానీ, ఈ తిథుల్లో చేసే పనులు కష్టాలు తెచ్చిపెడతాయ్!

  • తెల్ల జిల్లేడు పూలతో వినాయకుడిని పూజించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోయి, అనుకున్నకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయంటారు.
  • తెల్లజిల్లేడు వేరుతో అరగదీసిన గంధాన్ని వినాయకుడిని పూసినట్లైతే అత్యంత శీఘ్రంగా కోరిక కోరికలు నెరవేరుతాయట.
  • వినాయకుడి తిథి అయిన చవితి, జన్మ నక్షత్రం హస్తా రోజు పార్వతీ తనయుడిని పూజిస్తే సుఖసంతోషాలు చేకూరుతాయని చెబుతారు.
  • సోమవారం రోజు వినాయకుడికి ప్రత్యేక పూజ చేస్తే సంతోషంగా ఉంటారట.
  • హస్తానక్షత్రం, చవితిరోజు విద్యార్థులకు పలకలు, పుస్తకాలు, విద్యకు సంబంధించిన వస్తువులు దానం చేయడం మనశ్శాంతినిస్తుందని చెబుతారు. 

మతానికో విశ్వాసం ఉంటుంది..ప్రతి దేవుడిని పూజించే విధానంలో పద్ధతులు వేర్వేరుగా ఉంటాయి.. నచ్చితే పాటించాలి లేదంటే చదివి వదిలేయాలి కానీ వితండ వాదనలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదంటారు పండితులు...

Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 24 Jan 2022 07:33 AM (IST) Tags: Lord Ganesh Ganesh Utsav Ganesh Chaturthi Ganesh puja Lord Ganesha ganesh pooja ganesh ganesh aarti ganesh bhajan ganesh chaturthi puja ganesh visarjan vighnaharta ganesh god ganesha ganesha jai ganesh deva jai ganesh ganesh mantra ganesh bhajans ganesh stotra ganesh vandana ganesh vighnaharta