By: ABP Desam | Updated at : 10 Jan 2023 08:31 PM (IST)
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రగడ ఎవరికి ప్లస్
కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ తెలంగాణలో హాట్ టాపిక్ అయింది. కామారెడ్డి మాస్టార్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ గత నెల రోజులుగా రైతులు ఆందోళన బాట పట్టారు. తమకు న్యాయం చేయాలంటూ హైకోర్టు మెట్లెక్కారు. అయితే బుధవారానికి విచారణ వాయిదా పడింది. ఇప్పటికే కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లను కలిసి మాస్టర్ ప్లాన్ రద్దు కోసం తీర్మానం చేయాలని రైతులు కోరారు. ఈనెల 11న మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాల స్వీకరణ గడువు కూడా ముగుస్తోంది. 12న మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ రద్దు కోసం తీర్మానం చేయాలని అన్నదాతలు కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి వినతి పత్రం కూడా ఇచ్చారు. అయితే బీజేపీ కౌన్సిలర్లు మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ ను కలిశారు. ఈ నెల 12 మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ రద్దు చేసేలా తీర్మానం చేయాలని బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం ఇచ్చారు.
మాస్టర్ ప్లాన్ వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేస్తున్నారు. వీరికి కాంగ్రెస్, బీజేపీ మద్దతిస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం ఈ సమస్యపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ధర్నాలు, నిరసనలలో పాల్గొనడంతో మద్దతు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఇష్యూను తారా స్థాయికి తీసుకురావటంలో అన్నదాతల వెనుక కమలం పార్టీ పూర్తి మద్దతునిచ్చిందంటున్నారు. ఈ ఇష్యూపై బీజేపీ నేతలు బండి సంజయ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎంపీ అరవింద్ ఇలా ఆ పార్టీ ముఖ్య నేతలంతా స్పందించారు. బండి సంజయ్ కామారెడ్డికి వెళ్లి రైతులను సైతం కలిసి వారికి మద్దతు నిలిచారు.
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఒక రోజంతా రైతులు చేపట్టిన ర్యాలీలో పాల్గొని వారికి మద్దతు ప్రకటించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ కూడా మద్దతు ప్రకటించినా... అలా ఓ రోజు హడావుడి చేసి వెళ్లిపోయిందంటున్నారు అన్నదాతలు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఇష్యూ ఈ స్థాయిలో రావటానికి బీజేపీ రైతులకు వెన్నుదన్నుగా నిలిచినట్లు కనిపిస్తోంది. పొలిటికల్ మైలేజీ రాబట్టుకునేందుకు కామారెడ్డిలో కమలం పార్టీ మాస్టర్ ప్లాన్ ఇష్యూను వదలడం లేదు. ఓ వైపు రైతులకు న్యాయం జరిగితే, అది పోరాటం ఫలితమేనని కమలనాథులు ప్రచారం చేసుకునే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Adilabad Cheddi Gang : ఆదిలాబాద్ జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ కలకలం, రాత్రిపూట కర్రలతో గ్రామాల్లో గస్తీ
ఎప్పుడైనా ఎన్నికలు, సిద్ధంగా ఉండాలి- నిజామాబాద్ జిల్లాలో కేటీఆర్ కీలక ప్రకటన
Nizamabad KTR Convoy: మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు
TS News Developments Today: కేటీఆర్ నిజామాబాద్ పర్యటన, వరంగల్లో వీరయ్య- తెలంగాణ హైలెట్స్ ఇవే!
Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం- చలి సాధారణం!
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్