Hyderabad Challans : అలాంటిలాంటి ఆఫర్ కాదు మరి వదులుకుంటారా ? ఎగబడి డబ్బులు కట్టేస్తున్న హైదరాబాద్ జనం
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించిన బంపర్ ఆఫర్‌ను చురుకుగా ఉపయోగించుకుంటున్నారు. నిమిషానికి ఏడు వందల నుంచి వెయ్యి మంది తమ పెండింగ్ చలాన్లు కట్టేస్తున్నారు.
ఓ మాదిరి ఆఫర్ ( Offer ) ఉంటేనే జనం ఎగబడిపోతారు. అది అవసరమా లేదా అని చూసుకోరు. ఆఫర్ ఉంది కదా అని కొనుక్కని వచ్చేస్తారు. అలాంటిది రోడ్డు మీద భయం భయంగా వెళ్లే పరిస్థితి నుంచి తప్పించుకునే మార్గాన్ని అతి తక్కువ మొత్తంతో వదిలించుకునే అవకాశం కల్పిస్తే ఊరుకుంటారా? ఇలా లింక్ ఓపెన్ కావడం ఆలస్యం అలా డబ్బులు కట్టేందుకు పోటీ పడుతున్నారు. అసలు విషయం ఏమిటంటే హైదరాబాద్ లో ( Hyderabad ) బైక్ అయినా.. కారు అయినా .. చివరికి ఆటో ఉన్న వారికి అయినా చలాన్లు ( Trafic Challans ) పరిచయమే. కరోన కాలంలో అయితే చివరికి బండి అన్నీ ఉన్న మాస్క్ ( Mask ) సరిగ్గా పెట్టుకోకపోయినా చలాన్లు వేసేశారు. కానీ కట్టలేని పరిస్థితి. అందుకే ఆ చలనాల్లో అత్యధికంగా పెండింగ్‌లో ఉండిపోయాయి. వాటిని ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా క్లియర్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు ( Trafic Police ) బంపర్ ఆఫర్ ప్రకటించారు. 50 నుంచి 90 శాతం డిస్కౌంట్ ప్రకటించారు.
నేడు కేసీఆర్ - కేజ్రీవాల్ భేటీ? బీజేపీ, కాంగ్రెస్సేతర ఫ్రంట్‌పైనే చర్చలు!
బైక్‌లపై చలనాలు వంద రూపాయిలు ఉంటే పాతిక రూపాయలు కడితే చాలు... అలాగే నో మాస్క్ చలానాలు వెయ్యి అయితే వంద కడితే చాలు అని రూల్ తెచ్చారు. ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై 75శాతం మాఫీ చేయగా.. 25శాతం చెల్లిస్తే సరిపోతుంది. ఆర్టీసీ బస్‌లకు 70శాతం, లైట్ మోటార్ వేహికిల్, హెవీ మోటార్ వాహనాలకు 50శాతం, తోపుడు బండ్లకు 75శాతం, నో మాస్క్ కేసుల్లో రూ.900 వరకు మాఫీ చేస్తున్నట్లు పేర్కొంది.
రియల్ ఎస్టేట్ వ్యాపారులపై తుపాకీ కాల్పులు, హైదరాబాద్ శివారులో కలకలం
ఈ ఆఫర్ ఈ రోజు నుంచే ప్రారంభమవుతోంది. నెలాఖరు వరకూ ఉంటోంది. అయినా మించి అవకాశం మించినా రాదంటూ చలానాలు వరుసపెట్టి కట్టేస్తున్నారు. గంటకు ఏడు వందల నుంచి వెయ్యి మంది చలానులు క్లియర్ చేసుకుంటున్నారట. పెండింగ్ చలాన్ల చెల్లింపునకు ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటి సేవలను కూడా ఉపయోగించుకోవచ్చు మార్చి 30వ తేదీ వరకు ట్రాఫిక్ చలాన్ల రాయితీ అమల్లో ఉంటుంది. సాధారణంగా ట్రాఫిక్ చలాన్లు చెల్లించి తీరాల్సిందే. లేకపోతే ఎప్పటికైనా సమస్యే. పొరపాటున రోడ్డుపై ట్రాఫిక్ పోలీసు ఆపితే అప్పటికప్పుడు కడితే కానీ బండి వదలరు. అలాంటి పరిస్థితుల్లో మొత్తం కట్టేయాల్సిఉంటుంది. అంత బాధ ఎందుకు ఇప్పుడు క్లియర్ చేసుకుంటే చాలుగా అనుకుంటున్నారు జనం. అందుకే తప్పేం లేదుగా ?