News
News
వీడియోలు ఆటలు
X

Nizamabad News: బ్లాక్ లిస్టులో పెట్టిన వారికి పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో విధులు - అధికారుల తీరుపై విమర్శలు

బ్లాక్ లిస్టులో పెట్టిన వారికి పదో తరగతి పరీక్షా సెంటర్లలో విధులు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ విద్యాశాఖ అధికారులపై ఆరోపణ. కొందరు టీచర్లకు ఏ సెంటర్లలో విధులు వేశారో తెలియని వైనం. అంతా గందరగోళం

FOLLOW US: 
Share:
ఇప్పటికే పేపర్ లీకుల పేరుతో విద్యార్థులు గందరోగళానికి గురవతున్న పరిస్థితి. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో విద్యాశాఖ అధికారుల తీరు ఆందోళనకు గురిచేస్తోంది. నిబంధనలు పాటించాల్సిన అధికారులు ఇష్టానుసారంగ వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పదో తరగతి పరీక్షల్లో విద్యాశాఖ అధికారులు అనుసరిస్తున్న పద్దతి అనుమానస్పదంగా ఉంది. గతంలో మాస్ కాపీయిం గ్ చేయిస్తూ దొరికి, శాశ్వతంగా బ్లాక్ లిస్టులో పెట్టిన ఉపాధ్యాయులను ఈ ఏడాది పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో డ్యూటీలు ఎలా వేశారనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
 
నిజామాబాద్ నగరంలోని గోల్డెన్ జూబ్లీ స్కూల్ పరీక్ష కేంద్రంలో 2018లో జరిగిన పదో తరగతి పరీక్షల్లో మాస్ కాయిపీంగ్ కు సహకరించారనే ఆరోపణలపై నలుగురు టీచర్లను నాటి విద్యాశాఖ అధికారి విధుల నుంచి తొలగించారు. ఇంతే కాదు ఆ నలుగురు టీచర్లను శాశ్వతంగా ఎలాంటి పరీక్షల విధులకు కేటాయించవద్దని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పుడు ఈ నిబంధనలు మార్చి అధికారులు విధులు కేటాయించడంలో మతలబేంటనే దానిపై చర్చ జరుగుతోంది. విద్యాశాఖ ఎవరి కోసం పనిచేస్తుంది? పదో తరగతి పరీక్షల్లో బ్లాక్ లిస్టులో ఉన్న ఓ ఉపాధ్యాయున్ని విద్యాశాఖ అధికారులు ఇన్విజిలేటర్ డ్యూటీ వేసినట్లు సమాచారం. దీనిపై పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ అభ్యంతరం వ్యక్తం చేసినా... అధికారులు పట్టించుకోలేదని తెలిసింది. ఓ ఉపాధ్యాయ సంఘం నాయకుడి కూతురు మోపాల్ కేంద్రంలో పదో పరీక్ష రాస్తున్నందున బ్లాక్ లిస్టులో ఉన్న టీచర్ ను ఇన్విజిలేటర్ డ్యూటీ వేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ పీ.ఆర్.టీ.యూ ఉపాధ్యాయ సంఘం నాయకుడి కోసం విద్యాశాఖ నిబంధనలు మార్చిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పదో తరగతి పరీక్ష సెంటర్లలో ఆ విధులు నిర్వహించే వారిని నియమించడంలో ఉపాధ్యాయ సంఘాలు పెత్తనం చెలాయిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. యూనియన్ నాయకుల కనుసన్నల్లో విద్యాశాఖ - పనిచేస్తుందనేందుకు ఇది ఉదాహరణ అంటున్నారు. విద్యాశాఖను నడిపిస్తుంది ప్రభుత్వమా? ఉపాధ్యాయ సంఘాలా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
విద్యాశాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరు మొదటి నుంచి వివాదస్పదమే అవుతోందని అంటున్నారు. పదో తరగతి పరీక్షల విధుల్లో ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెప్పిన వారికి డ్యూటీలు వేశారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇంతకు బ్లాక్ లిస్టులో ఉన్న టీచర్లకు పరీక్ష విధులు ఎలా కేటాయించారు? నిబంధన లు సడలించారా? మరి మిగతా ముగ్గురు టీచర్లకు పదో తరగతి పరీక్షల డ్యూటీలు వేశారా? వేస్తే ఎక్కడ డ్యూటీలు వేశారు? వేయకుంటే ఎందుకు వేయలేదు? తమకు కావల్సిన వారి పిల్లల కోసం విద్యాశాఖ అధికారులు ఏమైనా చేయగలరా? వీటన్నింటికి జిల్లా విద్యాశాఖ అధికారులు - సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొందరి కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవటం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నిబంధనలకు విరుద్దంగా విద్యాశాఖ అనుసరిస్తున్న విధానాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. బ్లాక్ లిస్టులో పెట్టిన వారిని డ్యూటీలకు ఎలా వేస్తారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 
Published at : 07 Apr 2023 05:09 PM (IST) Tags: Nizamabad Latest News Nizamabad Updates Nizamabad News NIZAMABAD

సంబంధిత కథనాలు

Top 10 Headlines Today: నేటి నుంచి ఆసీస్‌, ఇండియా మధ్య గధాయుద్ధం, ఇది సినిమా కాదు ఎమోషన్ అంటున్న ప్రభాస్‌

Top 10 Headlines Today: నేటి నుంచి ఆసీస్‌, ఇండియా మధ్య గధాయుద్ధం, ఇది సినిమా కాదు ఎమోషన్ అంటున్న ప్రభాస్‌

Inter Results: తెలంగాణ ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్స్ ఇవే!

Inter Results: తెలంగాణ ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్స్ ఇవే!

Group1: గ్రూప్‌-1 పరీక్షపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ, ప్రతివాదులకు నోటీసులు జారీ!

Group1: గ్రూప్‌-1 పరీక్షపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ, ప్రతివాదులకు నోటీసులు జారీ!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

రాజ్యాంగాన్ని రక్షించాలంటే బీజేపీని గద్దె దించాలి, వ్యతిరేక శక్తులు ఏకం కావాలి- ప్రకాష్ అంబేద్కర్

రాజ్యాంగాన్ని రక్షించాలంటే బీజేపీని గద్దె దించాలి, వ్యతిరేక శక్తులు ఏకం కావాలి- ప్రకాష్ అంబేద్కర్

టాప్ స్టోరీస్

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

YS Viveka Case :  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి -   సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?