అన్వేషించండి

Nizamabad News నిజామాబాద్‌ జిల్లాపై బీజేపీ అధినాయకత్వం నజర్

నిజామాబాద్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయటంపై బీజేపీ నజర్. బలమైన నేతలపై దృష్టి. ఆపరేషన్ ఆకర్ష్ ను మరింత వేగం పెంచింది.

ఇందూరు జిల్లాపై కేంద్ర బీజేపీ అధిష్ఠానం మరింత ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల తెలంగాణలో మారుతున్న రాజకీయల పరిణామాలు, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వీడి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరటం ఇవన్నీ చకచకా జరిగిపోతున్నాయ్. తెలంగాణలో కమలం పార్టీ ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. మునుగోడు సభలో అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు ఒక్క నల్గొండ మీదే ఫోకస్ కాదు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఫోకస్ పెట్టినట్లు సంకేతం ఇచ్చినట్లుంది. అందుకే నిజామాబాద్ జిల్లాపైనా కేంద్రం గట్టి పోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. 

ఇందూరు జిల్లాలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజాతీర్పు భిన్నంగా ఉంటుంది. మరోవైపు గతంలో కంటే ప్రస్తుతం బీజేపీ నిజామాబాద్ జిల్లాలో పట్టు సాధించుకుంటూ వస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ పార్టీ క్యాడర్‌లో జోష్ కనిపిస్తోంది. బీజేపీ పార్టీలో చేరేందుకు నాయకులు సైతం ఉత్సాహం చూపుతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించటం ఆ పార్టీకి మరింత ఊపు తెచ్చినట్లైంది. స్వయాన సీఎం కూతురు కల్వకుంట్ల కవితపై గెలిచింది కమలం పార్టీ. నాటి నుంచి జరుగుతు వస్తున్న ఎన్నికల్లో కమలం పార్టీ సత్తా చాటుకుంటూ వస్తోంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ పార్టీ అనూహ్యంగా 60 డివిజన్లలో 28 డివిజన్లను కైవసం చేసుకుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా వచ్చి తృటిలో మిస్ అయ్యింది. అంటే కమలం పార్టీ బలం జిల్లాలలో పుంజుకుంటోందని కేంద్రం ఇందూరు జిల్లాపై పోకస్ పెంచినట్లు తెలుస్తోంది. 

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో టీఅర్ఎస్‌ను జిల్లాలో దీటుగా ఎదుర్కోవాలంటే బలమైన ప్రతిపక్షం కమలం పార్టీనే కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాలపై దృష్టి సారించింది. జుక్కల్ మొదలు బాల్కొండ నియోజకవర్గం దాకా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేసేందుకు బీజేపీ స్కెచ్ వేస్తోంది. ప్రతి నియోజకవర్గంలో బలమైన నాయకుడిని రంగంలోకి దింపేందుకు కసరత్తు ప్రారంభించింది. జుక్కల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అరుణ తార ప్రస్తుతం బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలి ఉన్నారు. గతంలో జుక్కల్ నియోజకవర్గంలో బీజేపీ ప్రాభల్యం అంతగా ఉండేది కాదు ప్రస్తుతం బీజేపీ ఆ నియోజకవర్గంలో పుంజుకుంటోంది. బాన్సువాడలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మల్యాద్రి రెడ్డి కమలం పార్టీలో చేరారు. ఆయన పార్టీలో చేరినప్పటి నుంచి చురుగ్గా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు దీంతో బాన్సువాడలోనూ బీజేపీ పేరు బాగా వినిపిస్తోంది.

ఎల్లారెడ్డి నియోజవర్గం నుంచి గత ఎన్నికల్లో జహిరాబాద్ ఎంపీగా పోటీ చేసిన ఓడిన బాణాల లక్ష్మారెడ్డి ఈసారి ఎల్లారెడ్డి నుంచి పోటీ చేసేందుకు ఇంట్రస్ట్ గా ఉన్నారు. అయితే ఎల్లారెడ్డి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏనుగు రవీందర్ రెడ్డి టీఆర్ఎస్ ను కాదని ఈటెల రాజేందర్ తో బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. దీంతో ఆయన సైతం ఎల్లారెడ్డి నుంచి బీజేపీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక కామారెడ్డిలోనూ బీజేపీ బలంపుంజుకుంటోంది. వెంకటరమణ రెడ్డి ఇటీవల కాలంలో కామారెడ్డి నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. 

ఇక నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో ఎంపీ అరవింద్ ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గాల్లో కార్యక్రమాలను చేపడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో అరవింద్ పర్యటనలను టీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటున్నప్పటికీ ... ముందుకు వెళ్తు ప్రజాసమస్యలపై పోరాటం చేస్తుండటంతో బీజేపీకి ఆయా నియోజకవర్గాల్లో మరింత మద్దతు పెరుగుతోంది. నిజామాబాద్ అర్బన్ లో పార్టీ బలంగా ఉంది. ధన్ పాల్ సూర్య నాయరాయణ, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మినారాయణ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మినారాయణ అర్బన్ కు సంబంధించిన నేతలు కావటంతో అర్బన్ లో పార్టీ బలం పుంజుకుంది. ఆర్మూర్ పై ఎంపీ అరవింద్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

పెర్కిట్ లో అరవింద్ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసి మరీ ఆర్మూర్ ను వచ్చే ఎన్నికల్లో ఎలాగైన కైవసం చేసుకునే ప్లాన్ మొదలుపెట్టారు. బోధన్ లో ఇటీవలే టీఆర్ఎస్ నాయకుడు మోహన్ రెడ్డిని కమలం పార్టీలోకి ఆహ్వానించి ఆ పార్టీని బలోపేతం చేశారు. నిజామాబాద్ రూరల్ లో సైతం పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. ఇక బాల్కొండలో ఏలేటీ అన్నపూర్ణమ్మ తనయుడు మల్లి ఖార్జున్ రెడ్డి సైతం నియోజకవర్గంలో యాక్టివ్ గా తిరుగుతున్నారు.

అయితే అమిత్ షా కూడా జిల్లాపై ప్రత్యేక నజర్ వేసినట్లు తెలుస్తోంది. పార్టీ మరింత బలోపేతానికి ఆపరేషన్ ఆకర్ష్ ను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఓ బడా లీడర్ ను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారని సమాచారం. ఇటు టీఆర్ఎస్ లోని కొంత మంది కీలక నేతలు కూడా అమిత్ షా కు టచ్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయ్. మోహన్ రెడ్డి జాయినింగ్ తో ఆకర్ష్ ను మరింత వేగం చేసేందుకు కేంద్ర అధిష్టానం రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయ్. ఒకటి రెండు నియోజకవర్గాల్లో బడా నేతలను పార్టీలో చేర్పించుకునేందుకు బీజేపీ కేంద్రం పావులు కదుపుతునట్లు సమాచారం. మొత్తానికి రానున్న రోజుల్లో ఇందూర్ జిల్లాపై బీజేపీ గట్టి పట్టు సాధించేందుకు కేంద్ర బీజేపీ అధిష్టానం పావులు కదుపుతునట్లు సమాచారం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Embed widget