News
News
X

Fake Certificate Scam: నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్- విదేశీయులకు కూడా ఇచ్చారని ఆరోపణలు!

Fake Certificate Scam: హైదరాబాద్ లో నకిలీ సర్టిఫికేట్ల జారీ వ్యవహారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. పాకిస్థాన్, బంగ్లాదేశీయులకు కూడా సర్టిఫికేట్లు ఇచ్చారని ఎమ్మెల్యే ఆరోపించారు.    

FOLLOW US: 
Share:

Fake Certificate Scam: హైదరాబాద్ లో వెలుగు చూసిన నకిలీ సర్టిఫికేట్ల జారీ వ్యవహారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. పాతబస్తీ కేంద్రంగా నకిలీ బర్త్ సర్టిఫికెట్స్ జారీ చేశారని, ఈ స్కాంలో ఎంఐఎం పాత్ర కూడా ఉందని ఆరోపించారు. ఆన్ లైన్ లో జీహెచ్ఎంసీ బర్త్ సర్టిఫికేట్ వచ్చేలా సాఫ్ట్ వేర్ రూపొందించింది. అయితే ఈ చర్య ద్వారా వ్యవస్థ చిన్నాభిన్నం అయిందనే విమర్శ ఇప్పుడు వినిపిస్తోంది. బర్త్ తో పాటు డెత్ సర్టిఫికేట్లను ఎడాపెడా జారీ చేశారు. అలాగే నాన్ అవైలబిలిటీ పేరుతో గత మార్చి నెల నుంచి డిసెంబర్ దాకా 31 వేల డెత్ సర్టిఫికేట్లు జారీ చేశారు. ఆ నకిలీ సర్టిఫికేట్ల ఆధారంగానే కొందరికి పాస్ పోర్టులు, వీసాలు కూడా మంజూరు చేశారు. వాటిని వాడుకొని కొంత మంది ఉన్నత ఉద్యోగాలు పొందారు. అంతేకాదు ఫేక్ డెత్ సర్టిఫికేట్ల బీమా బురిడీ జరిగిందని గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో కంప్యూటర్ ఆపరేటర్లదే కీలక పాత్రగా నిర్ధారించుకున్న పోలీసులు... అలాగే మీ సేవా సిబ్బందితో కొందరు అధికారులు కుమ్మక్కై పత్రాలు జారీ చేసినట్లు గుర్తించారు. 

గతేడాది డిసెంబర్ లో మొఘల్ పురలోని మూడు మీసేవా సెంటర్లలో టాక్స్ ఫోర్స్ పోలీసులు తనిఖీ చేపట్టారు. వందల కొద్దీ నకిలీ సర్టిఫికేట్లు బయటపడ్డాయి. దీంతో ఉన్నతాధికారులు దృష్టికి ఈ అంశం వెళ్లింది. ఇక పోలీసుల చర్యలతో జీహెచ్ఎంసీ మేల్కొంది. గ్రేటర్ లోని 30 సర్కిళ్లలో ఈ తతంగం జరిగినట్లు గుర్తించి, 27 వేలకు పైగా నకిలీ సర్టిఫికేట్లను రద్దు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. అంతేకాదు విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశించింది. 

Published at : 07 Mar 2023 02:53 PM (IST) Tags: Hyderabad News Telangana News MLA Raja Singh Fake Certificate Scam Rajasingh Fires on GHMC Officers

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: ఆకాశంలోకి LVM3 -M3 రాకెట్, ఏకంగా 36 ఉపగ్రహాలు మోసుకెళ్లిన వాహకనౌక

Breaking News Live Telugu Updates: ఆకాశంలోకి LVM3 -M3 రాకెట్, ఏకంగా 36 ఉపగ్రహాలు మోసుకెళ్లిన వాహకనౌక

BRS PLan : మహారాష్ట్రలో రెండో సభ - ఇతర రాష్ట్రాలను బీఆర్ఎస్ చీఫ్ లైట్ తీసుకుంటున్నారా ?

BRS PLan : మహారాష్ట్రలో రెండో సభ - ఇతర రాష్ట్రాలను బీఆర్ఎస్ చీఫ్ లైట్ తీసుకుంటున్నారా ?

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా

TSPSC Paper Leak: పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితులకు కస్టడీ, ఈ సారైన నోరు విప్పుతారా?

TSPSC Paper Leak: పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితులకు కస్టడీ, ఈ సారైన నోరు విప్పుతారా?

TSPSC Paper Leak: దేశం దాటిన 'గ్రూప్​–1' పేపర్, సిట్ విచారణలో విస్మయపరిచే విషయాలు!

TSPSC Paper Leak: దేశం దాటిన 'గ్రూప్​–1' పేపర్, సిట్ విచారణలో విస్మయపరిచే విషయాలు!

టాప్ స్టోరీస్

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే

TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!