అన్వేషించండి

KTR: బీజేపీ, కాంగ్రెస్ ఎజెండా కేసీఆర్ ను బద్నాం చేయడమే - కాళేశ్వరం ప్రయోజనాలు ప్రజలకు తెలుసు - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Telangana: కేసీఆర్ పై నిందలు వేయడమే కాంగ్రెస్, బీజేపీ పని అని కేటీఆర్ విమర్శించారు. కాలేశ్వరం ప్రయోజనాలు ప్రజలకు తెలుసన్నారు.

KTR On Kaleswaram:   కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల విమర్శలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రెండు పార్టీలు ఒక్కటే ఏజెండాతో కలిసి మా పార్టీ అధినేత కెసిఆర్ గారిని బదనాం చేయాలన్న కుట్రతో పనిచేస్తున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్క వ్యక్తి నిర్ణయం మాత్రమే కాదని,అప్పటి తెలంగాణ మంత్రివర్గం సమిష్టిగా నిర్ణయం తీసుకుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని కూడా గతంలో మంత్రులుగా పనిచేసిన ఈటెల రాజేందర్ తో పాటు హరీష్ రావు స్పష్టం చేశారన్నారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం ప్రభుత్వ విధానపర నిర్ణయం. ఆచరణలో పెట్టే బాధ్యత అధికారులు, యంత్రాంగం పై ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, కాళేశ్వరం అంశంలో దాచాల్సిందేమీ లేదు. ఇది సంపూర్ణంగా పారదర్శకంగా జరిగిన పని అని చెప్పారు.
 
 హరీశ్ రావు ప్రజెంటేషన్ చూస్తే అసలు విషయం తెలుస్తుందన్నారు. హరీష్ రావు ప్రజెంటేషన్‌తో కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాధాన్యత, ప్రయోజనం సులభంగా అర్థమయ్యేదని కేటీఆర్ అన్నారు. అరటిపండు వొలిచినట్టుగా హరీశ్ రావు వివరించారని కేటీఆర్ ప్రస్తావించారు. 45 లక్షల ఎకరాలకు నీరు అందించేలా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ను ఇతర దేశాల్లో ఏ నాయకుడు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసి ఉంటే,  ఆ దేశ చరిత్రలో వారి వారి పేరు అజరామరంగా, శాశ్వతంగా నిలిచిపోయేదని, ఆ నాయకుడి పాలనను ప్రశంసలతో ముంచేత్తేవారన్నారు. కానీ మనదేశంలో మాత్రం రాజకీయ కుయుక్తులు, కుట్రలకు ఇంతటి ఘనమైన కాలేశ్వరం ప్రాజెక్టు పావుగా మారిందని’’ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

‘‘బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి ఒకే ఎజెండాతో పనిచేస్తున్నాయి. ఏదో ఒకటి చేసి కేసీఆర్ ను బదనాం చేయాలని చూస్తున్నాయి. దున్నపోతు ఈనిందంటే దుడ్డేను కట్టేయమన్నట్టుగా అసత్య ఆరోపణలు చేస్తూ నోటీసులతో వేధిస్తున్నారు’’ అని కేటీఆర్ మండిపడ్డారు. ఎలాగైనా మమ్మల్ని ఇరిటేట్ చేయాలని నోటీసులు ఇస్తున్నారు.  మేము ఇప్పటికే ఈ అంశంలో చెప్పాల్సినదంతా స్పష్టంగా చెప్పాము. ఈరోజు కమిషన్ ముందు హరీశ్ రావు పూర్తి అంశాలు వివరించారు. కేసీఆర్ చెప్పేదేమీ కొత్తగా ఉండదు’’ అని కేటీఆర్ అన్నారు. 

భాక్రా నాగల్, నాగార్జున సాగర్, నర్మద, ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రాజెక్టులు నిర్మించడానికి దశాబ్దాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకున్నాయని, కానీ కేసీఆర్ మాత్రం కేవలం నాలుగేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పూర్తిచేశారని కేటీఆర్ గుర్తు చేశారు. ‘‘ఇది సాధారణ విషయం కాదు. మరో దేశంలో ఇలా జరిగి ఉంటే కేసీఆర్ కు సమున్నత పురస్కారాలు వచ్చేవి’’ అని అన్నారు. కానీ మన దేశంలో మాత్రం బిజెపి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇంతటి భారీ ప్రాజెక్టును రికార్డు సమయంలో కట్టినందుకు ఇబ్బందులకు గురి చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. 

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే విధ్వంసకర కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రస్తుతం నడుస్తున్నదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. పదవుల్లోకి రాగానే ప్రజలను మోసం చేశారు. రాష్ట్రాన్ని విధ్వంసకర ఆలోచనలతో నాశనం చేస్తున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడే వారెవరు మా పార్టీలో లేర ని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీడియా మేనేజ్‌మెంట్ తో ప్రధాని మోదీ దృష్టిలో పడేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag News: అంతర్జాతీయ ఈవెంట్లతో మెరిసిపోనున్న విశాఖ -  వచ్చే మూడు, నాలుగు నెలల్లో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు !
అంతర్జాతీయ ఈవెంట్లతో మెరిసిపోనున్న విశాఖ - వచ్చే మూడు, నాలుగు నెలల్లో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు !
America shut down: అమెరికా గవర్నమెంట్ షట్‌డౌన్ -ఎంతకాలం కొనసాగుతుంది? ట్రంప్ ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు ?
అమెరికా గవర్నమెంట్ షట్‌డౌన్ -ఎంతకాలం కొనసాగుతుంది? ట్రంప్ ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు ?
Brazil Model Issue: రాహుల్‌  గాంధీకి షాకిచ్చిన బ్రెజిల్ మోడల్  ఫేక్ ఓట్లపై  ఆరోపణలపై వీడియో రిలీజ్
రాహుల్‌ గాంధీకి షాకిచ్చిన బ్రెజిల్ మోడల్ - ఫేక్ ఓట్లపై ఆరోపణలపై వీడియో రిలీజ్
YS Jagan Padayatra: 2027లో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర- రెండేళ్ల పాటు సాగనున్న నయా ప్రజాసంకల్ప యాత్ర  
2027లో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర- రెండేళ్ల పాటు సాగనున్న నయా ప్రజాసంకల్ప యాత్ర  
Advertisement

వీడియోలు

వన్టే పోయే.. టీ20 అయినా..! ఈ బ్యాటింగ్‌తో డౌటే..
ఆసియా కప్ దొంగ బీసీసీఐకి భయపడి ఐసీసీ మీటింగ్‌కి డుమ్మా
సూపర్ స్టార్ హర్షిత్ రానా..  టీమ్‌లో లేకపోవటం ఏంటి గంభీర్ సార్..?
ప్రధాని మోదీకి మోదీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విమెన్స్ టీమ్
Ghazala Hashmi New Lieutenant Governor | వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా తొలి ముస్లిం మహిళ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag News: అంతర్జాతీయ ఈవెంట్లతో మెరిసిపోనున్న విశాఖ -  వచ్చే మూడు, నాలుగు నెలల్లో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు !
అంతర్జాతీయ ఈవెంట్లతో మెరిసిపోనున్న విశాఖ - వచ్చే మూడు, నాలుగు నెలల్లో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు !
America shut down: అమెరికా గవర్నమెంట్ షట్‌డౌన్ -ఎంతకాలం కొనసాగుతుంది? ట్రంప్ ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు ?
అమెరికా గవర్నమెంట్ షట్‌డౌన్ -ఎంతకాలం కొనసాగుతుంది? ట్రంప్ ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు ?
Brazil Model Issue: రాహుల్‌  గాంధీకి షాకిచ్చిన బ్రెజిల్ మోడల్  ఫేక్ ఓట్లపై  ఆరోపణలపై వీడియో రిలీజ్
రాహుల్‌ గాంధీకి షాకిచ్చిన బ్రెజిల్ మోడల్ - ఫేక్ ఓట్లపై ఆరోపణలపై వీడియో రిలీజ్
YS Jagan Padayatra: 2027లో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర- రెండేళ్ల పాటు సాగనున్న నయా ప్రజాసంకల్ప యాత్ర  
2027లో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర- రెండేళ్ల పాటు సాగనున్న నయా ప్రజాసంకల్ప యాత్ర  
Anasuya Bharadwaj : ప్రభుదేవాతో అనసూయ రొమాన్స్ - తమిళ మూవీలో ఐటెం సాంగ్ రిలీజ్
ప్రభుదేవాతో అనసూయ రొమాన్స్ - తమిళ మూవీలో ఐటెం సాంగ్ రిలీజ్
Borabanda Politics: బోరబండలో ఏం జరగబోతోంది? బండి సంజయ్ అల్లకల్లోలం సృష్టిస్తారా?
బోరబండలో ఏం జరగబోతోంది? బండి సంజయ్ అల్లకల్లోలం సృష్టిస్తారా?
Dies Irae Collection : 50 కోట్ల క్లబ్‌లో మోహన్ లాల్ కొడుకు మూవీ - అదరగొట్టిన హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే'... తెలుగులోనూ రెడీ
50 కోట్ల క్లబ్‌లో మోహన్ లాల్ కొడుకు మూవీ - అదరగొట్టిన హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే'... తెలుగులోనూ రెడీ
Drishyam style murder: భర్తను చంపేసి కిచెన్‌లో పాతిపెట్టేసింది - చివరికి ఎలా కనిపెట్టారంటే ?
భర్తను చంపేసి కిచెన్‌లో పాతిపెట్టేసింది - చివరికి ఎలా కనిపెట్టారంటే ?
Embed widget