News
News
X

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ బీఆర్ఎస్ క్యాడర్ కు పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

FOLLOW US: 
Share:

 

Nizamabad News KTR :  ఎన్నికలు ఎప్పుడయినా రావొచ్చు సిద్ధంగా ఉండాలని క్యాడర్ కు కేటీఆర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్.. ఈ కీలక వ్యాఖ్యలు  చేశారు. కేంద్రం పార్లమెంట్ ను రద్దు చేసి ఎన్నికలకు వస్తే తామూసిద్ధమన్నారు. ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశ పెట్టె బడ్జెట్ లాస్ట్ బడ్జెట్ అన్నారు మంత్రి కేటీఆర్... మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఒక్క యూనివర్సిటీ, ఒక్క ట్రిపుల్ ఐటి కూడా ఇవ్వలేదు. తెలంగాణకు కేంద్రo చిన్నచూపు చేస్తోందన్నారు కేటీఆర్. మోడీ మాటలేమో సబ్ కా సాత్ సబ్ కా వికాస్ చేతలేమో సబ్ బక్వాస్ అన్నారు కేటీఆర్. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇలా దేనిని పట్టించుకోవటం లేదు కేంద్రం. ఇక్కడ ఉన్న బిజెపి ఎంపీలకు తెలంగాణ పట్ల అంకితాభావం ఉంటే తెలంగాణకు న్యాయం చెయ్యమని మీ మోడీకి చెప్పాలని సూచించారు. 
 
రూ.2 లక్షల కోట్ల తెలంగాణ డబ్బులు పన్నుల రూపంలో కట్టాం... మన సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో సోకులు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. మనం కేంద్రానికి ఎక్కువ డబ్బులు పంపిస్తే... కేంద్రం నుంచి మనకు వచ్చేది తక్కువేనని తేల్చారు కేటీఆర్.  మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు తెలంగాణకు పక్కనే ఉన్నాయి. అవి బిజెపి పాలిత రాష్ట్రాలే... ఇక్కడ సంక్షేమ పథకాలు అక్కడున్నాయా... ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అక్కడ జరుగుతుందా అని ప్రశ్నించారు కేటీఆర్. మరి మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు ఇక్కడ ఉన్న సంక్షేమ పథకాలు లేవు అని ప్రశ్నించారు కేటీఆర్. తెలంగాణలో అభివృద్ధిని చూసి ఢిల్లీలో ఉండే వారు తెలంగాణకు అవార్డులు ఇస్తారు... గల్లీలో ఉన్న బీజేపీ నాయకులు విమర్శలు చేస్తారు అని అన్నారు కేటీఆర్. అసలు బిజెపి నాయకులకు బుద్ధి ఉందా అని ప్రశ్నించారు. 


జాతీయ రహదారులు వేసి టోల్ టాక్సుల రూపంలో కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేస్తున్నారు. మన డబ్బులతోనే రోడ్లు వేస్తున్నారు. కేంద్రం చేసిందేమీ లేదన్నారు. నరేంద్ర మోడీ కంటే ముందు 14 మంది ప్రధానులు పని చేశారు. వారుబీ60 ఏళ్లలో 56 లక్షల కోట్లు అప్పు చేశారు. నరేంద్ర మోడీ కేవలం 8 ఏళ్లలో రూ. 100 లక్షల కోట్లు అప్పు చేశారని అన్నారు కేటీఆర్. ఇంత అప్పులు చేసి దేశానికి అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు కేటీఆర్. ఇంటింటికి నల్లా కోసం, ఉచిత కరెంట్ కోసం, ప్రాజెక్ట్ ల కోసం, రైతుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అప్పులు చేశారు. అభివృద్ధి చేశారు. మీరు అప్పులు చేయటమే తప్ప దేశానికి చేసిందేమీ లేదన్నారు కేటీఆర్.  రూ.400 ఉన్న సిలిండర్ రూ. 1100 చేసినందుకు మోడీ దేవుడా... నరేంద్ర మోడీ ఎవరికి దేవుడు... జిఎస్టీ వేసి నేతన్నలకు ఇబ్బంది పెట్టినoదుకు దేవుడా అని ఎద్దేవా చేశారు కేటీఆర్. 

మోడీ కష్టపడి కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నాడని ఒకడంటాడు మరి సైంటిస్టులు ఏం చేశారని అన్నారు. ఢిల్లీ లో ఉన్న వాడు ఫెకుడు ఇక్కడున్నోడు జోకుడు...అని చమత్కారంగా మాట్లాడారు కేటీఆర్. సెస్ పెరు మీద 30 లక్షల కోట్ల రూపాయలు పేదల నుంచి వసూల్ చేసింది బిజెపి. బిజెపికి హిందూ, ముస్లిం తప్ప పనికోచ్చేది ఒక్కటి లేదన్నారు. మతాల మధ్య తగాదాలు పెట్టడమే వారికి తెలుసని విమర్శఇంచారు.  మోడీ కార్పొరేట్ మిత్రులకు రూ. 12 లక్షల కోట్లు మాఫీ చేశాడు. ఇది అబద్ధమని చెబితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా.... అన్నారు కేటీఆర్. వెంటనే బడ్జెట్ లో తెలంగాణకు న్యాయం చేసేలా బిజెపి ఎంపీలు కృషి చేయాలన్నారు కేటీఆర్.  

గత 8 ఏళ్లలో నిజామాబాద్ నగర అభివృద్ధికి 936 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ప్రతి పక్ష పార్టీలకు అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. అభివృద్ధి చేసిన లెక్కలు పక్కాగా ఉన్నాయి చూసుకోండని చెప్పారు కేటీఆర్. ఇటీవలే నిజామాబాద్ నగరానికి కేసీఆర్ 100 కోట్లు నిధులు మంజూరు చేశారు.   తిలక్ గార్డెన్ ను అభివృద్ధి చేయాలని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పారు. నిజామాబాద్ లో అపురూపమైన చక్కటి ఆకృతిలో 50 కోట్లతో కళా భారతి నిర్మాణానికి శంకుస్థాపన చేశాం... రాబోయే నెల రోజుల్లో నిజామాబాద్ నగరంలో  ఐటి హబ్ ప్రారంభించనున్నామని తెలిపారు కేటీఆర్. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో రూ. 50 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ నిధులతో మరింత అభివృద్ధి చేయాలని అన్నారు కేటీఆర్. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని  చెప్పే సత్తా మాకుందని అన్నారు కేటీఆర్. నిజామాబాద్ ఎంపీ ఒక్క రూపాయి నిధులైనా తెచ్చారా... అని ప్రశ్నించారు కేటీఆర్.

Published at : 28 Jan 2023 04:39 PM (IST) Tags: KTR Nizamabad News BRS Cadre Telangana Early Elections

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: పోలవరం ప్రాజెక్టు సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Breaking News Live Telugu Updates: పోలవరం ప్రాజెక్టు సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Hyderabad News : పెళ్లైన రెండేళ్లకే దారుణం, కుటుంబ కలహాలతో ట్రాన్స్ జెండర్లు ఆత్మహత్య!

Hyderabad News : పెళ్లైన రెండేళ్లకే దారుణం, కుటుంబ కలహాలతో ట్రాన్స్ జెండర్లు ఆత్మహత్య!

ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ విచారణ మూడు వారాలకు వాయిదా

ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ విచారణ మూడు వారాలకు వాయిదా

Warangal Congress Politics : వరంగల్ కాంగ్రెస్ లో కుమ్ములాటలు? జంగా రాఘవరెడ్డిపై వేటు!

Warangal Congress Politics : వరంగల్ కాంగ్రెస్ లో కుమ్ములాటలు? జంగా రాఘవరెడ్డిపై వేటు!

Polavaram Flood: మూడు నెలల సమయం కావాలంటూ సుప్రీంకు కేంద్రం లేఖ

Polavaram Flood: మూడు నెలల సమయం కావాలంటూ సుప్రీంకు కేంద్రం లేఖ

టాప్ స్టోరీస్

Rapaka Varaprasad: నేను దొంగ ఓట్ల వల్లే గెలిచా, ఒక్కొక్కరు 10 దాకా ఫేక్ ఓట్లేశారు - ఎమ్మెల్యే రాపాక

Rapaka Varaprasad: నేను దొంగ ఓట్ల వల్లే గెలిచా, ఒక్కొక్కరు 10 దాకా ఫేక్ ఓట్లేశారు - ఎమ్మెల్యే రాపాక

HBD Ram Charan: చెర్రీకి ఎన్టీఆర్, మహేష్ బాబు శుభాకాంక్షలు, పుత్రోత్సాహంలో మునిగితేలుతున్న మెగాస్టార్!

HBD Ram Charan: చెర్రీకి ఎన్టీఆర్, మహేష్ బాబు శుభాకాంక్షలు, పుత్రోత్సాహంలో మునిగితేలుతున్న మెగాస్టార్!

కన్నా విందు భేటీలో రాయపాటి ఫ్యామిలీ- మారుతున్న గుంటూరు రాజకీయం!

కన్నా విందు భేటీలో రాయపాటి ఫ్యామిలీ- మారుతున్న గుంటూరు రాజకీయం!

TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ కేసులో మరో అరెస్టు, ఇప్పటిదాకా 15 మంది - అన్ని జిల్లాలకీ పాకిన క్వశ్చన్ పేపర్?

TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ కేసులో మరో అరెస్టు, ఇప్పటిదాకా 15 మంది - అన్ని జిల్లాలకీ పాకిన క్వశ్చన్ పేపర్?