అన్వేషించండి

Khammam BRS Vijayan : బీజేపీపై కేసీఆర్ పోరాటానికి మద్దతు - కేరళలో తెలంగాణ పథకాలు అమలు చేస్తామన్న సీఎం విజయన్ !

బీజేపీపై కేసీఆర్ పోరాటానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు.


Khammam BRS Vijayan : తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేపట్టారని కేరళ సీఎం పినరయి విజయన్‌ కొనియాడారు. ప్రజల సౌకర్యార్థం అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. లక్షలాది మందికి ఉపయోగపడే కంటి వెలుగు పథకం అద్భుతమన్నారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సీఎం పినరయి విజయన్ ప్రసంగించారు. దేశంలో ప్రజాస్వామ్యానికి బీజేపీ ముప్పుగా పరిణమించిందని కేరళ సీఎం పినరయి విజయన్‌ అన్నారు. రాజ్యాంగానికి కాపాడేందుకు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఫెడరల్‌ స్పూర్తికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

ఖమ్మంలో నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ దేశానికి ఒక దిక్సూచి అని కేరళ సీఎం పినరయి విజయన్‌ అన్నారు. పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు. రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాల్సిందేనని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కేసీఆర్‌ పోరాటానికి మా మద్దతు ఉంటుందని ప్రకటించారు. కీలక నిర్ణయాల్లో కేంద్రం రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకోవట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.  తెలంగాణ పథకాలు బాగున్నాయి, కేరళలోనూ తెలంగాణ పథకాల అమలుకు ప్రయత్నిస్తానని విజయన్ వ్యాఖ్యానించారు.  ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోడీ పాలన సాగుతోంది, రాష్ట్రాల హక్కులు, అధికారాలను కేంద్రం నిర్వీర్యం చేస్తోంది, రాజ్యాంగాన్ని కాపాడేందుకు బీజేపీకి వ్యతిరేకంగా పని చేయాలని పిలుపునిచ్చారు.  గవర్నర్ల ద్వారా రాష్ట్రాలను నియంత్రించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కేరళ సీఎం ఆరోపించారు. 
 
ఈ సభ దేశానికి దిక్సూచి, కేసీఆర్ పోరాటానికి మద్దతు పలుకుదాం, కేరళ ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారన్నారు. పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు, ప్రజాస్వామ్యానికి బీజేపీ ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కార్పొరేట్లకు తొత్తుగా మారారని..రాష్ట్రాలను కేంద్రం లెక్కలోకి తీసుకోవడం లేదని అన్నారు. ఫెడరల్‌ స్ఫూర్తికి మోదీ తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రులు.. నేరుగా సుప్రీం కోర్టును బెదిరిస్తున్నారని అన్నారు. . ఉపరాష్ట్రపతి కూడా సుప్రీంను కించపరిచేలా మాట్లాడరని విమర్శించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రాజ్యాంగాన్ని కాపాడాలని కోరారు. 

దేశ సార్వభౌమత్వానికి ఇది పరీక్షా సమయం. రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకండా పోరాడాలి. బీజేపీ కార్పొరేట్‌ వ్యవస్థకు కొమ్ము కాస్తోంది. ఫెడరల్‌ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోదీ పాలన ఉంటోంది.దేశంలోని అన్ని వ్యవస్థలను బీజేపీ ప్రభావితం చేస్తోంది.   కులాలు, మతాల వారీగా ప్రజలను వేరు చేయడాన్ని వ్యతిరేకించాలి. కేసీఆర్‌ ఆధ్వర్యంలో అధికార వీకేంద్రీకరణ జరుగుతోందన్నారు. 

అంతకు ముందు యాదాద్రి నుంచి హెలీకాప్టర్లలో  ముఖ్యమంత్రులు ఖమ్మం చేరుకున్నారు.  అనంతరం అక్కడి నుంచి ఖమ్మం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. కేసీఆర్‌తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌, యూపీ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ జాతీయ నేత డీ రాజా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత చాంబర్‌లో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ను కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టరేట్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌ను జాతీయ నేతలు తిలకించారు. అనంతరం కంటివెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జాతీయ నేతల చేతులమీదుగా కళ్లజోళ్ల పంపిణీ చేయనున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Best Budget 9 Seater SUV: చవకైన 9 సీటర్లలో బెస్ట్ కారు ఇదే - పెద్ద ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఆప్షన్!
చవకైన 9 సీటర్లలో బెస్ట్ కారు ఇదే - పెద్ద ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఆప్షన్!
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Best Budget 9 Seater SUV: చవకైన 9 సీటర్లలో బెస్ట్ కారు ఇదే - పెద్ద ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఆప్షన్!
చవకైన 9 సీటర్లలో బెస్ట్ కారు ఇదే - పెద్ద ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఆప్షన్!
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
iPhone 15 Pro Max Offer: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
Bengalore: సినిమా బిచ్చగాడు కాదు రియల్ - బెంగళూరు రోడ్లపై కనిపించే ఈ బెగ్గర్ లైఫ్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు !
సినిమా బిచ్చగాడు కాదు రియల్ - బెంగళూరు రోడ్లపై కనిపించే ఈ బెగ్గర్ లైఫ్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు !
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Embed widget