BRS Meeting KCR : దేశమంతా ఉచిత విద్యుత్, రైతు బంధు పథకం - అగ్నిపథ్ రద్దు - బీఆర్ఎస్ ఆవిర్భావసభలో కేసీఆర్ కీలక హామీలు
బీఆర్ఎస్ ఢిల్లీలో అధికారంలోకి వస్తే ఏం చేస్తామో కేసీఆర్ ప్రకటించారు. దేశమంతా ఉచిత విద్యుత్, రైతు బంధు పథకంఅ అమలు చేస్తామన్నారు.
BRS Meeting KCR : కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటే... దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అలాగే రైతు బంధు పథకాన్ని కూడా దేశం మొత్తం అమలు చేస్తామన్నారు. ఖమ్మంలో నిర్వహించిన్ బీఆర్ఎస్ ఆవిర్భావసభలో కేసీఆర్ కీలక హామీలు ఇచ్చారు. దళిత బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోందని.. అమలు చేయకపోతే.. తాము వచ్చిన తరవాత అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. మహిళలను ప్రోత్సహించిన దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. 35 శాతం రిజర్వేషన్ బీఆర్‌ఎస్ ప్రతిపాదిస్తోందని తెలిపారు. విశాక ఉక్కు కర్మాగారాన్ని అమ్ముతామంటున్నారు. విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లో అమ్మనీయబోమని.. ఒక వేళ అమ్మినా మళ్లీ తాము వచ్చిన తర్వాత జాతీయం చేస్తామని ప్రకటించారు.
బీఆర్ఎస్‌ను బలపరిస్తే మంచి భవిష్యత్
బీఆర్ఎస్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి మంచినీళ్లను అందిస్తామని హామీ ఇచ్చారు. మేక్ ఇన్ ఇండియా జోక్ ఇన్ ఇండియా అయిపోయిందన్నారు. అగ్నిపథ్‌ను రద్దు చేస్తామని.. సైన్యంలో వేలు పెట్టి తెలివితక్కువ విధానంతో వచ్చిన ఈ విధానాన్ని రద్దు చేస్తాం. పాత పద్దతిలోనే ఉద్యోగ నియామకాలు ఉంటాయని ప్రకటించారు. ఇది పెట్టుబడిదారుల ప్రభుత్వమని ఎల్ఐసీని కూడా అమ్ముతామంటున్నారని.. తాము వచ్చాక ఎల్‌ఐసీని జాతీయం చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీ ఇంటికి వెళ్తే మేం అధికారంలోకి వస్తున్నామన్నారు. ఎల్‌ఐసీ మిత్రులారా బీఆర్‌ఎస్‌ను బలపరచండని పిలుపునిచ్చారు. విద్యుత్ డిస్కమ్‌లు అప్పనంగా షావుకార్లకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ కార్మికులారా పిడికిలి ఎత్తి బీఆర్‌ఎస్‌ను బలపరచండీ... విద్యుత్‌ను పబ్లిక్ సెక్టార్‌లోనే ఉంచుకుందామని హామీ ఇచ్చారు.
తెలంగాణలో తప్ప ఎక్కడా రైతులకు నాలుగు గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు
75 ఏళ్ల స్వాతంత్ర్య భారత్ దేశంలో మంచినీళ్లు ఇవ్వలేని పాలకులు కావాలా అని ప్రజలను ప్రశ్నించారు. కరెంటు ఇవ్వలేరు.. మంచి నీళ్లు ఇవ్వలేరు. వీళ్ల మాటలు నమ్మి ఎదుకు మోసపోవాలి. అవసరమైన చోట పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం వ్యాపారం చేయాల్సిందేనన్నారు. కాంగ్రెస్ బీజేపీ దొందూ దొందేనన్నారు. బీజేపీ ఉంటే కాంగ్రెస్‌ను కాంగ్రెస్ ఉంటే బీజేపీని తిట్టడమే వారి పాలన అన్నారు. దేశంలో అందుబాటులోఉన్న విద్యుత్ 4లక్షల పదివేల మెగావాట్లు. ఏ రోజు కూడా రెండు లక్షల పదివేల మెగావాట్లకు మించి వాడలేదు. అనేక థర్మల్ పవర్ స్టేషన్లు ప్రారంభానికి సిద్ధంగా ఉంటే... స్ట్రేషర్ అసెట్స్ అని పేరు పెట్టి ఎన్సీఎల్టీ పంచాయితీ పెట్టి వాటిని మూలకు పెట్టి కూర్చున్నారని ఆరోపించారు. దేశమంతటా ఇవాళ కరెంటు కోతలతో ఇబ్బంది పడుతోంది. ఒక్క తెలంగాణలో తప్ప ఎక్కడ కూడా ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చే పరిస్థితి లేదన్నారు.
బీఆర్ఎస్‌కు అధికారం ఇస్తే వెలుగు జిలుగుల భారత్
బీఆర్‌ఎస్ లాంటి పార్టీ అధికారంలోకి వస్తే వెలుగుజిలుగు భారతాన్ని తయారు చేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వమంటే... రైతులను అవమాన పరుస్తున్నారు. వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీనికి సిగ్గుపడాలన్నారు. ఇవాళ భారత్ సమాజం లక్ష్యం ఏంటి? ఏమైనా ఉందా... భారత్ తన లక్ష్యాన్ని కోల్పోయిందా... దారి తప్పిందా.. దేశంలో ఏం జరుగుతోంది. ఇది అనేక రోజులుగా నన్ను కలచి వేస్తున్న ప్రశ్న అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎవరిని అడుక్కునే అవసరం లేనటువంటి.. ప్రపంచ బ్యాంకు, అమెరికా, విదేశీయుల అవసరం లేని.. ఈ దేశ ప్రజల సొత్తు. లక్షల కోట్ల, రూపాయల ఆస్తులు ఉన్నాయన్నారు. ఉండి కూడా ఎందుకు యాచకులం కావాలని కేసీఆర్ ప్రశ్నించారు. అమెరికా మన కంటే రెండున్నర రెట్లుపెద్దది. వాళ్లకు వ్యవసాయ భూముల శాతం 29శాతం. చైనా వాళ్లకు వ్యవసాయ భూమి 16 శాతమే. మన దేశంలో యాభై శాతం సాగుకు అనుకూలమైన భూమి ఉంది. పుష్కలంగా ఉన్న నీటి వనరులను కూడా ఉపయోగించుకోలేకపోతున్నామని.. తాము వస్తే అన్నింటికీ పరిష్కారం చూపిస్తామన్నారు.
ఖమ్మంకు వరాల జల్లు
ఖమ్మంలో జిల్లాలో 589 గ్రామ పంచాయితీలు ఉన్నాయి ప్రతి గ్రామ పంచాయితీకి పది లక్షలు మంజూరు చేస్తున్నాం. పది వేల జనాభాకు మించిన ఉన్న మేజర్ పంచాయతీలకు పది కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నాం. మున్నేరు నదిపై కొత్త బ్రిడ్జి మంజూరు చేస్తాం. ఇతర మున్సిపాలిటీలకు తలో 30 కోట్లు మంజూరు చేస్తున్నాం. ఖమ్మం ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేస్తాం. కొత్త కోర్టులు ప్రవేశ పెడతాం. ఖమ్మం హెడ్ క్వర్టర్స్‌లో పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆదేశిస్తున్నాననని కేసీఆర్ ప్రకటించారు.