Sircilla: సిరిసిల్ల యువకుడి వినూత్న ఆవిష్కరణ.. ట్రక్కులు తిరిగి ఖాళీగా రాకుండా అద్భుత ప్లాన్
వాహన యజమానులు ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకొని తమ వివరాలు నమోదు చేసుకుంటే, యాప్ ఆన్ డౌన్ లో రవాణా చౌకగా అందుబాటులోకి రానుంది.
సరకు రవాణా చేసే వాహనాలు తిరిగి ఖాళీగా వెళ్లకుండా వినూత్న ప్రయోగం చేశాడు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ యువకుడు. ఒకవైపు సరుకు రవాణా చేస్తూ రెండవ వైపు ఖాళీగా వెళ్తుండటంతో ఇంధన వృథాతోపాటు, వాహన యజమానులకు నష్టం వాటిల్లుతోంది. దీనిని గుర్తించిన యువకుడు ఖర్చులు తగ్గించేందుకు వినూత్న యాప్ ని రూపొందించాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన బాలరాజు సరికొత్త యాప్‌ని రూపొందించాడు. సరకు రవాణా చేసే వాహనాలు ప్రతి ప్రయాణంలో ఏదో ఒక ట్రిప్పు ఖాళీ వాహనంతో తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఇంధన వినియోగం పెరిగి, డబ్బు, సమయం వృధా అవుతోంది. ఈ విషయాన్ని గమనించిన బాలరాజు 'ఆదా ట్రిప్' అనే యాప్ రూపొందించి సరకు రవాణాదారులు, వాహనదారులను కలిపే వేదికను రూపొందించాడు. ఈ యాప్ తో మున్ముందు రోడ్లపై ఖాళీ వాహనాలు తిరగకుండా, సరకు రవాణా రంగం ప్రణాళికాబద్ధంగా సాగడానికి తోడ్పడుతుందని బాలరాజు తెలిపారు.
వాహన యజమానులు ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకొని తమ వివరాలు నమోదు చేసుకుంటే, యాప్ ఆన్ డౌన్ లో రవాణా చౌకగా అందుబాటులోకి రానుంది. సరకు రవాణా రంగంతో, ప్రత్యక్ష, పరోక్ష సంబంధం ఉన్నవారికి ఆదాయం, అవకాశాలు అభివృద్ధి చెందే అవకాశం ఉన్నాయని బాలరాజు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ఆలోచనను.. మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో అభివృద్ధి చేసానని.. తన యాప్‌ని కేటీఆర్ ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నాడు. ఇప్పటి వరకు దాదాపు నాలుగు వేలకు పైగా ఆదా ట్రిప్ యాప్ ని వినియోగదారులు డౌన్ లోడ్ చేసుకున్నారని ప్రభుత్వం కొంచం తోడ్పాటును అందిస్తే.. ఈ యాప్ ఇంకా అభివృద్ధి చేసి మరింత విస్తృత పరచి సామాన్య వినియోగదారులకు చేరువ చేయాలనేదే తన ధ్యేయమని బాలరాజు తెలిపారు.
ఎక్కడో మారుమూల లింగన్న పేట గ్రామంలో ఉంటూ.. ఎన్నో వ్యయ ప్రయసాలకోర్చి ఐటీ కంపెనీలకు పోటీ ఇస్తున్న బాలరాజుకు తగిన ప్రోత్సాహం లభిస్తే మరిన్ని ఆవిష్కరణలు చేసే అవకాశం ఉందని గ్రామస్తులు తెలిపారు.
Also Read: Rythubandhu: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. త్వరలో మీ ఖాతాల్లోకి రైతుబంధు నిధులు
Also Read: Karimnagar: కరీంనగర్ లో కరోనా కలకలం... 46 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్
Also Read: Konijeti Rosaiah: ముగిసిన రోశయ్య అంత్యక్రియలు.. కొంపల్లి ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు పూర్తి
Also Read: DH Srinivasa Rao: ఒకట్రెండు నెలల్లో భారత్ లో కరోనా కేసులు పెరిగే ఛాన్స్ ఉంది
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి