By: ABP Desam | Updated at : 07 Feb 2023 07:53 PM (IST)
ఏపీ రాజకీయాల్లోకి వెళ్లాలని షర్మిలకు కడియం శ్రీహరి సలహా
Kadiyam Srihari On Sharmila: జగన్ గ్రాఫ్ పడిపోతోందని.. జగన్ జైలుకు వెళ్తే సీఎం చాన్స్ వస్తుంది.. ఏపీకి వెళ్లాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలుషర్మిలకు కడియం శ్రీహరి సలహా ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిల బడ్జెట్‌పై విమర్శలు చేశారు. దీనికి కౌంటర్‌గా మీడియా సమావేశం నిర్వహించిన కడియం శ్రీహరి.. షర్మిల ఏపీలో రాజకీయాలు చేయాలనిసలహా ఇచ్చారు. వైఎస్ కుటుంబం తెలంగాణకు మొదటి నుంచి వ్యతిరేకమేనని చెప్పారు. పాదయాత్ర చేసి అన్నను సీఎంను చేసిన షర్మిల ఆంధ్రాకు వెళ్లి అక్కడి ప్రజలతో మొర పెట్టుకోవాలని సూచించారు. జగన్ గ్రాఫ్ పడిపోతోందని, రేపో మాపో ఆయన జైలుకు వెళ్తే షర్మిలకు పదవి దక్కే అవకాశముందని అన్నారు.
తెలంగాణ బిల్లు ఆమోద విషయంలో వైఎస్ జగన్,షర్మిల సమైక్య నినాదానికి తెరలేపిన వారని కడియం శ్రీహరి గుర్తు చేారు. అలాంటి షర్మిల నేడు తెలంగాణలో వైఎస్ శర్మిలకు ఓటు అడిగే నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించారు. షర్మిల కుటుంబ పరంగా నష్టపోయారని.. ...తన అన్న జగన్... ఆమెను రాజకియంగా దెబ్బ తీశారన్నారు. గతంలో శర్మిల పాదయాత్ర తోనే జగన్ సీఎం అయ్యాడన్నారు. ఆ సానుభూతి ఇక్కడ పనిచేయదు...రేపో మాపో సిఎం జగన్ జైలుకు పోయే అవకాశాలు ఉన్నాయి ..కాబట్టి.. ఏపీకి వెళ్లాలన్నారు. షర్మిలకు రాజకియ భవిష్యత్తు ఆంధ్రాలో ఉంటుందన్నారు. ఈ ప్రయత్నాలు అక్కడ చేసుకోవడం బెటర్ అని సూచించారు. తెలంగాణలో పాదయాత్రలు చేస్తూ షర్మిల సమయాన్ని వృథా చేసుకోవద్దని కడియం సూచించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు అన్న కడియం.. రాష్ట్ర బడ్జెట్ సంక్షేమ బడ్జెట్ అని ప్రశంసించారు.
వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తల దాడులు చేయడంతో నిలిచిపోయింది. అనంతరం షర్మిల హైకోర్టుకు వెళ్లి పాదయాత్రకు అనుమతి తెచ్చుకున్నారు. నర్సంపేట నియోజకవర్గం, చెన్నారావు పేట మండలం శంకరమ్మతండా వద్ద నుంచి మళ్లీ ప్రారంభించారు. ఈ నెలాఖరు కల్లా పెండింగ్ నియోజకవర్గాల్లో పాదయాత్రను పూర్తి చేసి మహబూబాబాద్ నియోజకవర్గం మీదుగా పాలేరు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. ప్రజాప్రస్థానం ముగింపు సభ ఖమ్మం రూరల్ మండలంలో జరగనుంది. వచ్చే ఎన్నికల్లో షర్మిల పాలేరు నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇటీవలి కాలంలో ఆమె బీఆర్ఎస్ పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఈ కారణంగా బీఆర్ఎస్ నేతలు దాడుల కూడా చేశారు. రెండో సారి పాదయాత్ర ప్రారంభించిన తర్వాత కూడా పలు చోట్ల పాదయాత్ర రూట్‌లో ఆమె ఫ్లెక్సీలు చించి వేయడంతో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. వారందరికీ.. షర్మిల సవాల్ చేసి.. పాదయాత్రను ఎవరూ అడ్డుకోలేరని ముందుకు సాగుతున్నారు.
Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు
Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు
జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
Bandi Sanjay : సిట్ కేసీఆర్ జేబు సంస్థ, కేటీఆర్ కు నోటీసులిచ్చే దమ్ముందా? - బండి సంజయ్
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు - తీహార్ జైలుకు రామచంద్ర పిళ్లై తరలింపు! 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్కు చేరుకున్న క్యాపిటల్స్!
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్