By: ABP Desam | Updated at : 06 Oct 2021 02:20 PM (IST)
హెటిరో డ్రగ్స్ పై ఐటీ దాడులు
హెటిరో డ్రగ్స్ కార్యాలయాలపై ఉదయం నుంచీ ఐటీ దాడులు జరుగుతున్నాయి. హెటిరో సంస్థ డైరెక్టర్ల ఇళ్లల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు మూడు ప్రాంతాల్లో ఇటీ సోదాలు జరుగుతున్నాయి. హెటిరో ప్రధాన కార్యాలయంతో పాటు ఆ సంస్థ డైరెక్టర్ల ఇళ్లలోనూ ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు అధికారులు. 20 బృందాలు విడిపోయి ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. హెటిరో సీఈవో కార్యాలయాల్లోనూ సోదాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.
గత ఫిబ్రవరి-మార్చిలో ఐటీ దాడుల్లో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఓ ఫార్మా సంస్థ అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా దాదాపు రూ.4వేల కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే తాజా దాడులు ఎటు దారి తీస్తాయనేది ఉత్కంఠ ఉంది. హెటిరోపై ఐటీ దాడులకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
కొవిడ్-19 మహమ్మారితో తీవ్రంగా ప్రభావితమై ఆసుపత్రులో చేరిన రోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటీవల హెటిరో సంస్థ మరో ఔషధం అందుబాటులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌లో కొవిడ్‌తో ఆసుపత్రుల్లో చేరిన వయోజనులకు అందించేందుకు తమ ఔషధం టొసిలిజుమాబ్ అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ఆఫ్ఇండియా (డీసీజీఐ) అనుమతించినట్లు హెటిరో ఫార్మా ఇటీవల ప్రకటించింది. ఫలితంగా కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురై స్టెరాయిడ్స్ అందుకుంటున్న లేదా ఆక్సిజన్, వెంటిలేషన్ అవసరమైన వారికి ఇచ్చేందుకు ఆసుపత్రులకు అధికారం లభించినట్లయింది.
హెటిరో టోసిరా(టొసిలిజుమాబ్) ఔషధాన్ని తమ భాగస్వామ్య సంస్థ హెటిరో హెల్త్‌కేర్ ద్వారా దేశవ్యాప్తంగా సరఫరా చేయనున్నట్లు హెటిరో గ్రూప్ ఛైర్మన్డాక్టర్ బి.పార్థ సారధి రెడ్డి తెలిపారు. హైదరాబాద్.. జడ్చర్లలోని హెటిరో బయోఫార్మాలో ఈ ఔషధాన్ని ఉత్పత్తి చేస్తున్నట్లు పార్థసారధి రెడ్డి ప్రకటిడం తెలిసిందే.
కొవిడ్ చికిత్సలో కీలకంగా భావిస్తున్న మందుల్లో ముందు వరుసలో నిలిచిన టోసిలిజుమాబ్ ఔషధాన్ని హైదరాబాద్ సంస్థ హెటిరోనే రూపొందించింది. టోసిలిజుమాబ్ ఔషధం అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఇప్పటికే అనుమతిచ్చింది. కొవిడ్ సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్దల్లో స్టెరాయిడ్స్ పనిచేయని, ఆక్సిజన్ అవసరమయ్యే రోగులకు వైద్యులు ఈ ఔషధాన్ని సిఫార్సు చేస్తున్నారు. బయోసిమిలర్ వర్షన్ టోసిలిజుమాబ్‌ను హెటెరో అనుబంధ కంపెనీ హెటెరో హెల్త్‌కేర్ టోసిరా పేరుతో విక్రయించనుంది. 20 మిల్లీలీటర్ల వయల్ రూపంలో కంపెనీ రూపొందించింది.
Also Read: Republic Kolleru : "రిపబ్లిక్" సినిమాపై కొల్లేరు ప్రజల ఆగ్రహం ! అసలు వివాదం ఏమిటంటే ?
Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !
Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?
Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం
Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి
Congress Rachabanda : రైతు డిక్లరేషన్‌పై రచ్చబండల్లో చర్చ - ఇక ప్రజల్లోకి తెలంగాణ కాంగ్రెస్
Poorna Photos: కుందనపు బొమ్మా నిను చూస్తే మనసుకి వెలుగమ్మా
MS Dhoni IPL 2023: ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, విజిల్ వేస్తున్న సీఎస్కే అభిమానులు
Sirpurkar Commission Report: దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకమా - కేసుపై సంచలన విషయాలు వెల్లడించిన సిర్పూర్కర్ రిపోర్ట్‌లో ఏముందంటే !
Vivo Y75: వివో కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ధర ఎంతంటే?