Vizag Kidnap: ఆరేళ్ల క్రితం బాలిక కిడ్నాప్.. తాజాగా ఆచూకీ, కేసులో ఎన్ని ట్విస్టులో.. అదే అతణ్ని పట్టించింది!
2015లో బాలిక కిడ్నాప్ అయిన నాటి నుంచి ఆమె తల్లిదండ్రులు వెతికే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆచూకీ దొరికింది.
విశాఖ జిల్లాలో దాదాపు ఆరేళ్ల క్రితం నాడు జరిగిన ఓ కిడ్నాప్ కేసును తాజాగా పోలీసులు ఛేదించారు. ఆ కేసుకు సంబంధించిన ఆధారాలు ఇప్పుడు లభించడంతో ఎంతో తెలివిగా నిందితుడి ఆచూకీని గుర్తించారు. ఓ బ్యాంకు లోన్ ఆధారంగా కేసు క్రాక్ అయింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. చోడవరం పట్టణంలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికను అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తిరుపతిరావు అనే వ్యక్తి 2015 జూన్ 26న బాలికను కిడ్నాప్ చేశాడు. అక్కడి నుంచి బాలికను విశాఖకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లాడు. తర్వాత రాజస్థాన్‌కు నివాసం అక్కడి నుంచి మళ్లీ హర్యానాకు వెళ్లి.. తెలంగాణాలోని నిజామాబాద్‌కు.. మళ్లీ రాజస్థాన్‌లోని జోగీఘట్టాకు వచ్చి చివరగా.. ఇక్కడ స్థిరపడ్డాడు.
బాలిక కిడ్నాప్ అయిన నాటి నుంచి ఆమె తల్లిదండ్రులు వెతికే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కేసును ఛేదించలేకపోయినందుకు 2016లో ఓ పోలీసు అధికారిని కూడా ఉన్నతాధికారులు ట్రాన్స్‌ఫర్ చేశారు. 2017లో ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించారు. అయినా కేసు పురోగతి లేదు. దీంతో ఆ తండ్రి హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది.
Also Read: మళ్లీ ఎగబాకిన పెట్రోల్, డీజిల్ ధరలు.. అన్నిచోట్లా ఇంతే.. తాజా ధరలు ఇవే..
అయితే, బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ఉపాధ్యాయుడు తిరుపతిరావు రాజస్థాన్‌లో అళ్వార్ జిల్లా జోగీఘట్టాలో పిల్లలకు ట్యూషన్లు చెప్పుకొంటూ జీవనం సాగించేవాడు. వారికి అయిదేళ్ల పాప, మూడేళ్ల బాబు ఉన్నారు. అక్కడే అన్ని ధ్రువపత్రాలు సంపాదించి బతుకుదెరువు కోసం బ్యాంకు లోన్ కోసం అప్లై చేశాడు. అప్పటికే విశాఖ జిల్లాలో డిఫాల్టర్ అయినట్లు తేలింది. బ్యాంకు లావాదేవీలు, పాన్ కార్డుల ద్వారా టెక్నాలజీ సాయంతో ఐటీ కోర్ బృందం నిందితుడి ఆచూకీని కనిపెట్టింది.
Also Read: బతుకమ్మ చీరల పంపిణీలో నోరుజారిన నేత.. వెళ్లిపోయిన మహిళలు
ఆ సమాచారంతో పోలీసులు రాజస్థాన్ వెళ్లారు. అక్కడి పోలీసుల సహాయంతో ట్రాన్సిస్ట్ వారంట్‌పై వారు ఇద్దరినీ ఇక్కడికి తీసుకొచ్చారు. ‘బాలికను కిడ్నాప్ చేసే సమయానికే తిరుపతి రావుకు భార్య, కొడుకు ఉన్నారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు చెప్పారు. ప్రస్తుతం బాధితురాలైన కిడ్నాప్‌కు గురైన బాలిక వయస్సు 18 ఏళ్లు. ఆమె ఇచ్చే ఫిర్యాదు చేసే మేరకే కేసును విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.
Also Read: వంట గ్యాస్‌పై మళ్లీ వాయింపు.. మరోసారి ఎగబాకిన ధర, ఈసారి ఎంత పెరిగిందంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి