By: ABP Desam | Updated at : 06 Oct 2021 06:47 AM (IST)
Edited By: Venkateshk
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్‌లో ఇంధన ధరల్లో కొద్ది రోజులుగా పెరుగుదల కనిపిస్తోంది. నేడు కూడా పెట్రోల్ ధర రూ.0.26 పైసలు పెరిగి రూ.106.77 అయింది. రూ.99.04 గా ఉన్న డీజిల్ ధర.. ప్రస్తుతం రూ.99.37కు చేరింది. ఇక వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.0.08 పైసలు పెరిగి రూ.106.29గా ఉంది. డీజిల్ ధర రూ.0.16 పైసలు పెరిగి రూ.98.91 గా ఉంది. వరంగల్‌లో గత కొన్ని రోజులుగా నిలకడగా ధరలు ఉంటుండగా.. తాజాగా పెరిగాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
కరీంనగర్‌లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.55 పైసలు పెరిగి.. రూ.106.94గా ఉంది. డీజిల్ ధర రూ.0.60 పైసలు పెరిగి రూ.99.52కు చేరింది. నిజామాబాద్‌లో ఇంధన ధరలు వరుసగా మళ్లీ పెరిగాయి. పెట్రోల్ ధర రూ.0.64 పైసలు పెరిగి రూ.108.40 గా ఉంది. డీజిల్ ధర రూ.0.68 పైసలు పెరిగి రూ.100.88 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
Also Read: జుకర్‌బర్గ్‌కు భారీ షాక్.. గంటల వ్యవధిలో రూ.52 వేల కోట్లు హుష్‌కాకి!
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు మరోసారి వరుసగా పెరిగాయి. ప్రస్తుతం రూ.109.26 గా ఉంది. పెట్రోల్ ధర రూ.0.39 పైసలు పెరిగింది. డీజిల్ ధర రూ.0.45 పైసలు పెరిగి ఏకంగా రూ.101.28కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో గత పది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి.
విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.107.94గా ఉంది. గత ధరతో పోలిస్తే రూ.0.54 పైసలు తగ్గింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.0.42 పైసలు తగ్గి రూ.100గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.
తిరుపతిలో ఇంధన ధరల్లోనూ భారీ పెరుగుదల కనిపించింది. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.1.25 పైసలు తగ్గి రూ.108.36 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఇక డీజిల్ ధర రూ.100.39గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.1.08 పైసలు తగ్గింది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా అక్టోబరు 6 నాటి ధరల ప్రకారం 77.50 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Also Read: రాకెట్‌లా దూసుకుపోయిన 'షిబా ఇను'.. 24 గంటల్లో 45 శాతం!
Also Read: అమెజాన్ హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్ అయిపోయిందా.. డోంట్ వర్రీ.. మీకోసం మళ్లీ!
Latest Gold-Silver Price 30 September 2023: పసిడి పతనం కంటిన్యూస్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Rs 2000 Notes: రూ.2 వేల నోట్లను మార్చుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్, ఈ గడువు పొడిగిస్తారా?
Petrol-Diesel Price 30 September 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Lost Pan Card: పోయిన పాన్ కార్డ్ కోసం మళ్లీ అప్లై చేయడం చాలా ఈజీ, ఈ సింపుల్ స్టెప్స్ పాటించండి
Small Savings Rate Hike: ఐదేళ్ల RDలపై మరింత ఎక్కువ వడ్డీ, మిగిలిన స్కీమ్‌లపైనా కీలక నిర్ణయం
Chandrababu Naidu Arrest : చంద్రబాబు మాజీ పీఎస్ సస్పెండ్ - అమెరికాకు వెళ్లి తిరిగిరాలేదన్న ప్రభుత్వం !
IND Vs ENG: ఇంగ్లండ్‌పై టాస్ గెలిచిన టీమిండియా - మొదట బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్!
Game Changer: 2 రోజుల్లో రిలీజ్ డేట్ చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటా, ‘గేమ్ ఛేంజర్‘ టీమ్ కు చెర్రీ ఫ్యాన్ వార్నింగ్
30 వచ్చేసింది కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌టీపీ విలీనం లేనట్టేనా! షర్మిల నెక్స్ట్ స్టెప్ ఏంటీ?
/body>