Honor Killing In Hyderabad : కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
Honor Killing At Hayathnagar In Hyderabad: పెద్దలు అంగీకం లేకుండా వారికి ఇష్టం లేని పెళ్లి చేసుకుందని సోదరినే హత్య చేశాడో తమ్ముడు. హైదరాబాద్ శివారులో జరిగిందీ పరువు హత్య
Brother Brutally Killed His Sister In Hyderabad: కులాంతర వివాహం చేసుకుందన్న కారణంతో అక్కను హత్య చేశాడో తమ్ముడు. హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్‌లో జరిగిన దుర్ఘటన సంచలనంగా మారింది. కానిస్టేబుల్‌గా పని చేస్తున్న అక్కను తమ్ముడు కిరాతకంగా హత్య చేశాడు.డ్యూటీకి వెళ్తున్న అక్కను వెంబడించి కారుతో ఢీ కొట్టి కత్తితో పొడి నడిరోడ్డుపై హత్య చేశాడు.
ఇబ్రహింపట్నం రాయపోల్‌లో ఉంటున్న నాగమణి కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఆమె వేరే కులం వ్యక్తిని ప్రేమించింది. వివాహం చేసుకుంటానని ఇంట్లో చెప్పింది. దీనికి కుటుంబ పెద్దలు వద్దని చెప్పారు. ఇది నచ్చని తమ్ముడు పరమేష్ కూడా ఈ పెళ్లి అడ్డు చెప్పాడు.
తమ్ముడు అడ్డు చెప్పినా పెద్దవు వద్దన్నా నాగమణి తనకు నచ్చిన వ్యక్తిని 15 రోజుల క్రితం వివాహం చేసుకుంది. అప్పటి నుంచి కుటుంబానికి దూరంగా ఉంటోంది. ఇంట్లో వాళ్లకు తనకు నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకుందని తమ్ముడు పరమేష్ రగిలిపోయాడు.
కుటుంబ పరువు తీసిందని కోపంతో నాగమణిని అతి కిరాతకంగా ఈ ఉదయం హత్య చేశాడు పరమేష్. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న నాగమణి స్కూటిపై డ్యూటీకి వెళ్తుండే పరమేష్ దాడి చేశాడు. కారులో ఆమెను ఫాలో అవుతూ ఢీ కొట్టాడు. కిందపడిపోయిన నాగమణిని కారులో తెచ్చిన కత్తితో దాడి చేశాడు. కిరాతకంగా నరికి చంపాడు.
పరమేష్ దాడితో నాగమణి తీవ్రంగా గాయపడింది. రక్తస్రావం కావడంతో స్పాట్‌లోని చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు వచ్చి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. వెంటనే ఆ మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు.
2020లో నాగమణికి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చింది మంచిగా స్థిరపడదాని అనుకుంటున్నటైంలో తమ్ముడు కాలయముడై ఆమె ప్రాణాలు తీశాడు.