Shiba Inu Coin Price Rise: రాకెట్‌లా దూసుకుపోయిన 'షిబా ఇను'.. 24 గంటల్లో 45 శాతం!
షిబా ఇను క్రిప్టో కరెన్సీ రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. గత 24 గంటల్లో దీని విలువ 45 శాతం పెరిగింది.
షిబా ఇను నాణెం (ఎస్‌హెచ్‌ఐబీ).. క్రిప్టో కరెన్సీ మార్కెట్‌ను మరోసారి అవాక్కయ్యేలా చేసింది. 24 గంటల్లో షిబా ఇను నాణెం విలువ 45 శాతం పెరిగింది. మంగళవారానికి షిబా ఇను నాణెం $0.00001264 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. మార్కెట్ క్యాప్ విలువ $4,987,163,972కి చేరింది. అంటే సోమవారం నుంచి మంగళవారం వరకు దీని విలువ 49 శాతానికి పెరిగింది. మిగిలిన క్రిప్టో కరెన్సీల విలువ కొంచెం పెరిగింది.
2020 ఆగస్టులో సృష్టించిన షిబా ఇను (షిబా టోకెన్) వికేంద్రీకృత క్రిప్టో కరెన్సీ. ఈ టోకెన్ ప్రసిద్ధ డాగ్‌కోయిన్‌ల తర్వాత సృష్టించిన కరెన్సీ. డాగ్‌కాయిన్ లోగో ఆధారంగా దీన్ని సృష్టించారు. అయితే దీనికి ట్విట్టర్, రెడ్డిట్‌లో విపరీతమైన ప్రచారం వచ్చింది.
కారణమేంటి..
సాధారణంగానే క్రిప్టో మార్కెట్ చాలా వేగంగా మారుతుంది. ఎవరూ ఊహించని విధంగా.. అసలు ఎలాంటి అంచనాలు లేని క్రిప్టో కరెన్సీలు కూడా టాప్‌లోకి వస్తాయి. టెస్లా సీఈఓ, డాగ్‌కాయిన్ ఇన్వెస్టర్ ఎలాన్ మస్క్ షిబా ఇను గురించి ట్వీట్ చేసిన వెంటనే దీని విలువ అమాంతం పెరిగింది. ఇటీవల మస్క్.. తన కొత్త కుక్క ఫ్లోకీ ఇమేజ్‌ను ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఇది షిబా ఇను విలువను భారీగా పెంచింది. తాజాగా సోమవారం 'ఫ్లోకీ ఫ్రంక్ పప్పీ' అనే క్యాప్షన్‌తో మరో చిత్రాన్ని మస్క్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీంతో షిబా టోకెన్ విలువ రాకెట్ వేగంతో దూసుకుపోయింది.
Floki Frunkpuppy pic.twitter.com/xAr8T0Jfdf
— Elon Musk (@elonmusk) October 4, 2021
షిబా కాయిన్‌పై..
డాగ్‌కాయిన్ విలువ తగ్గినప్పటి నుంచి చాలా మంది షిబా ఇను నాణేన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో ఎలాన్ మాస్క్ ఒకరు. అయితే ఎలాంటి కారణం లేకుండా షిబా ఇను విలువ పెరగడం పెట్టుబడులకు అంత మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విలువ స్థిరంగా ఉంటుందనే దానిపై ఇప్పటివరకు మార్కెట్ నిపుణులు ఎలాంటి అంచనాలు వేయలేదు.
అసలేంటీ షిబా..
అనేక ఇతర డిజిటల్ నాణేల మాదిరిగా, షిబా ఇను కూడా ఓ క్రిప్టో కరెన్సీ. ఇది షిబాస్వాప్, కుకోయిన్, కాయిన్బీన్, ప్రోబిట్ గ్లోబల్ వంటి ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో మార్పిడి చేసుకోవచ్చు.
షిబా ఇను విలువ ఆకాశాన్ని తాకిన వెంటనే.. చాలా మంది దీనిని వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు తీసుకువెళ్లారు. దీర్ఘకాలిక రాబడి కోసం చూస్తున్న వ్యక్తులు తమ డబ్బును SHIBలో పెట్టుబడి పెట్టాలని ఎంచుకుంటున్నారు.
Also Read:WhatsApp Down: వాట్సాప్, ఫేస్‌బుక్ డౌన్.. ఫన్నీ మీమ్స్‌తో ఆడేసుకుంటున్న నెటిజన్స్